యువ

అరచేతిలో సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి డిగ్రీలు పూర్తి చేయకపోయినా ఆసక్తి, ఆలోచనలు ఉంటే కొత్త ఆవిష్కరణలు కష్టమేమీ కాదని బెంగళూరుకు చెందిన కార్తీక్‌రాజ్ నిరూపించాడు. ఒకేసారి 400 దిన,వార పత్రికలను చదివేందుకు ఓ మొబైల్ యాప్‌ను సృష్టించిన పెద్దినిమిదేళ్ల కార్తీక్ రాజ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తాజా సమాచారం, రాజకీయ వార్తలు, బిజినెస్ వ్యవహారాలు, సినిమా సంగతులు, క్రీడావార్తలు, కథలు, ఇతర సాహిత్యం.. వీటిలో ఏది చదవాలన్నా అనేక దిన, వారపత్రికలను మనం కొనాల్సిందే. ఈ నేపథ్యంలో సమస్త సమాచారాన్ని ఒకే చోట అందిస్తే వివిధ పత్రికలు, మేగజైన్లను కొనాల్సిన అవసరం లేదని కార్తీక్‌రాజ్ భావించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందించాలని రోజుల తరబడి శ్రమించి, చివరికి అనుకున్నది సాధించాడు. అన్నిరకాల సమాచారాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘పేపర్ బాయ్’ మొబైల్ యాప్‌ను రూపొందించాలన్న ఆలోచన ఈ కుర్రాడికి హైస్కూల్ దశలోనే కలిగింది. ఎక్కువ జనాభా నివసించే చిన్న పట్టణాల్లో వివిధ రకాల పత్రికలు లభించే అవకాశం లేదని తెలుసుకున్న ఇతను తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చాడు. క్షణాల్లో వార్తాపత్రికలు, మేగజైన్లను తెరిచి చదువుకునే అవకాశం ఉండడంతో ‘పేపర్ బోయ్’ యాప్‌కు ఆదరణ పెరిగిందని, ఈ సౌకర్యాన్ని ఇతర దేశాలకూ విస్తరింపజేయాలని యోచిస్తున్నట్లు కార్తీక్‌రాజ్ చెబుతున్నాడు.