యువ

అంతా ‘యాప్’ మయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన ఆవిష్కరణలు ఏ ప్రయోగశాలలోనో కాదు.. తమ మెదడులో మెరిసిన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి అద్భుతాలను ఆవిష్కరిస్తోంది నేటి యువతరం. ‘కాలేజీలో సరదాగా గడపాలి, చదువు ముగిశాకే కెరీర్ గురించి ఆలోచించాలన్నది’ నిన్నటి ట్రెండ్.. తరగతి గదిలోనే తమ ఆలోచనలకు పదును పెట్టి.. అసాధ్యాలను సుసాధ్యం చెయ్యడం నేటి కుర్రకారు స్టయిల్. పరీక్షల కోసం ఓ వైపు పుస్తకాలతో కుస్తీ పడుతూనే తమ మదిలో మెరిసే ఆలోచనలకు కార్యరూపం ఇస్తూ ఎంతోమంది యువతీ యువకులు ఇతరులకు స్ఫూర్తిదాతలుగా మారుతున్నారు. తరగతులకు హాజరవుతూనే, పరీక్షలకు సన్నద్ధం అవుతూనే నేటి కుర్రకారు యాప్‌లు, స్టార్టప్‌ల ఆవిష్కరణకు తన మేధస్సును సద్వినియోగం చేస్తోంది. ఆలోచనలకు, వ్యూహాలకు పదునుపెట్టడంతో వారు అనుకున్నది సాధిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న చాలామంది యువతీ యువకులు ప్రస్తుత అవసరాలకు ఉపయోగపడే యాప్‌లను ఆవిష్కరిస్తున్నారు. చిన్న పట్టణాల్లో ఉండే మధ్య తరగతివారు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో తమకు కావాల్సినవి కొనుగోలు చేసేందుకు ‘సండే కార్ట్’ వంటి పలు రకాల యాప్‌లు నేడు అందుబాటులో ఉన్నాయి. అలాగే పెట్రోల్ బంకుల్లో వినియోగదారులు మోసపోకుండా ‘్ఫ్యయల్ ఫ్లో మెజర్‌మెంట్’, రోజువారీ వార్తావిశేషాలను తెలుసుకునేందుకు ‘లిజన్ ఇఎమ్’ వంటి యాప్‌లను తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత సృష్టించింది. పెద్దగా పెట్టుబడులు అవసరం లేకుండానే ఈ తరహా యాప్‌లను యువత సులభంగానే అందుబాటులోకి తెస్తోంది. ‘స్టార్టప్’ (అంకుర సంస్థలు)ల ఏర్పాటుకు ప్రభుత్వాలు సైతం అన్ని రకాలుగా చేయూత ఇస్తున్నందున యువత నైపుణ్యం వెలుగులోకి వస్తోంది. సొంత ఆలోచనలతో, కొద్దిపాటి ఆర్థిక వనరులతో యువతీ యువకులు తాము అనుకున్నది సాధిస్తున్నారు. తమ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడమే కాదు, వివిధ వర్గాల ప్రజలకు యాప్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ప్రతి అవసరానికో యాప్
సాంకేతికత పెరిగిన నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్ లేనిదే చాలామందికి రోజులు గడవని పరిస్థితి నెలకొంది. స్మార్ట్ఫోన్ ఉందంటే అందులో పలురకాల యాప్‌లను వినియోగించడం అనివార్యమవుతోంది. ఏ వస్తువునైనా అమ్మాలన్నా, కొనాలన్నా, ప్రయాణాలకు బస్సు,రైలు టిక్కెట్లు కొనాలన్నా, హోటల్‌లో గదులను బుక్ చేయాలన్నా, ప్రముఖ రెస్టారెంట్లలో భోజనం చేయాలన్నా, పలురకాల పన్నులు చెల్లించాలన్నా, తాజావార్తలు తెలుసుకోవాలన్నా, నగదును ఎవరికైనా పంపాలన్నా, ఆరోగ్య పద్ధతులను తెలుసుకోవాలన్నా, చివరికి మొబైల్ ఫోన్ తస్కరణకు గురికాకుండా ఉండాలన్నా.. అనేక రకాల ‘యాప్’లు నేడు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
‘నిక్సోన్ మార్కెట్’ యాప్‌తో పాత పుస్తకాలను అమ్మేయచ్చు, కొనుగోలు చేయవచ్చు. ఈ ‘యాప్’ నిర్వాహకులే మన ఇంటికి వచ్చి పాత వస్తువులను తీసుకువెళతారు. విలువైన మన స్మార్ట్ఫోన్ చోరీకి గురికాకుండా ఉండాలంటే ‘యాంటీ థెఫ్ట్ అలారం’ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకు తెలియకుండా ఎవరైనా మన ఫోన్‌ను తస్కరించే ప్రయత్నం చేస్తే ‘అలారం’ మోగుతుంది. ఇక, నగదు చెల్లింపుల కోసం ఇప్పటికే ఎంతోమంది ‘పేటిఎమ్’ వంటి యాప్‌లను విరివిగా వాడుతున్నారు. సినిమా టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ‘బుక్ మై షో’ యాప్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. యోగాసనాలు వేసేందుకు, పోషకాలున్న ఆహారం గురించి అవగాహన పెంచుకునేందుకు, వాతావరణం, పంటల సాగులో మెళకువలు, దినఫలాలు, జాతక విశేషాలు తెలుసుకునేందుకు సైతం యాప్‌లను చాలామంది వాడుతున్నారు. మహిళల భద్రతకు సంబంధించి కూడా పలురకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా నగరంలోకి వచ్చినవారు తాము ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవాలంటే ‘గూగుల్ మ్యాప్’ను ఆశ్రయించవచ్చు. తాము ఏ ప్రదేశంలో ఉన్నామో బంధుమిత్రులకు సమాచారం తెలియజేయవచ్చు. అలాగే, ఆదాయపు పన్ను చెల్లించేందుకు ‘ఆయకార్‌సేతు’ యాప్ అందుబాటులోకి వచ్చింది. మన ఆరోగ్యానికి సంబంధిన వివరాలను ‘మై హెల్త్ అసిస్టెంట్’ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. నిపుణులైన వైద్యులతో అపాయ్‌మెంట్‌ను యాప్‌ల ద్వారా ముందే పొందే అవకాశం ఉంది. ఇక వినోదానికి, వికాసానికి, సౌందర్య పరిరక్షణకు సంబంధించిన యాప్‌లకైతే అంతే లేదు. అన్ని వర్గాల వారికి, అన్ని అవసరాలకూ ‘యాప్’లు కొలువుదీరాయి. మన అవసరాలకు తగిన సాంకేతికతను పొందడంలోనే నైపుణ్యం దాగి ఉంది.