యువ

పట్టుదలతో పతకాల పంట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలింపిక్స్‌లో బంగారు పతకం కోసం మన దేశం ఆశగా ఎదురుచూస్తున్న రోజుల్లో పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని అందించి అంతర్జాతీయ వేదికపై భారత్ పరువునిలిపిన హై జంప్ క్రీడాకారుడు మరియప్పన్ తంగవేలు. తాజాగా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘అర్జున అవార్డు’ అందుకున్నాడు. ఒక కాలు లేకున్నా, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి అనుకున్నది ఆచరణలో సాధించి- విజయం అంటే ఎలా ఉంటుందో రుజువు చేసుకున్న వ్యక్తి మరియప్పన్. పారా ఒలిపింక్స్‌లో విజయం తర్వాత మరియప్పన్ వెనుదిరిగి చూసుకోలేదు.. ప్రపంచం అతనికి బ్రహ్మరథం పట్టింది. పేదరికం పటాపంచలు అయిపోయింది. భారీగా నగదు నజరానాలుగా అందాయి, అవార్డులు వరించాయి. లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు.. ఇలా ఆయన జీవితం అనూహ్యంగా మారిపోయింది. ఆయన విజయం వెనుక అనేక కష్టనష్టాల సంకలనం ఉంది. మరియప్పన్ 1995 జూన్ 28న జన్మించాడు. మరియప్పన్ ఎవరో గత ఏడాది వరకూ ఎవరికీ తెలియదు. పారాఒలింపిక్స్‌లో తన సత్తా చూపించాడు. భారత్ తరఫున 2016లో రియో డిజనిరియోలో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల హైజంప్‌లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2004 తర్వాత పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన మరో విజేత తంగవేలు. తాజాగా ఐశ్వర్య ధనుష్ తంగవేలు జీవితంపై ఒక సినిమా నిర్మించతలపెట్టడంతో తంగవేలు ఎక్కడ అంటూ అంత వెతుకులాట మొదలుపెట్టారు. ఈ ఏడాది జనవరి 25న కేంద్రప్రభుత్వం తంగవేలుకు పద్మశ్రీ పురస్కారాన్ని, అర్జున్ అవార్డును ప్రకటించింది. తమిళనాడులో సేలం జిల్లా పెరివడగంపట్టి గ్రామంలో జన్మించిన మరియప్పన్ ఆరుగురు పిల్లల్లో ఒకరు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులున్నారు. తండ్రి దూరంగా వెళ్లిపోవడంతో తల్లి సరోజ ఆరుగురు పిల్లలను సాకింది. ఐదో ఏట మరియప్పన్ స్కూలుకు వెళ్తున్నపుడు ఒక తాగుబోతు బస్సు నడుపుతూ ఢీ కొట్టడంతో కుడికాలు శాశ్వతంగా తొలగించాల్సి వచ్చింది. అయినా కర్ర ఊతంతో నడుస్తూ, పదో తరగతి పూర్తి చేశాడు. వాలీబాల్ ఆడుతూ ఉల్లాసంగా కనిపించే మరియప్పన్‌ను స్కూల్‌లోని పిఇటి హై జంప్ ప్రాక్టీసు చేయమని ఎపుడూ ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఇతని ప్రతిభా పాటవాలను గమనించిన ప్రస్తుత కోచ్ ఆనాడే మరియప్పన్‌ను ఎంపిక చేసి స్పోర్ట్సు అకాడమి ఆఫ్ ఇండియా సారధ్యంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. 2015లో జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసి తదుపరి శిక్షణకు బెంగలూరుకు తీసుకువచ్చి ‘సాయి’లో మరింత మెరుగైన శిక్షణ అందించారు. 2016 మార్చిలో తునిషియాలో జరిగిన ఐపిసి గ్రాండ్ ప్రిక్స్‌లో తొలి విజయం సాధించి రియో పారా ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. ఒక పక్క హైజంప్‌లో తన ప్రావీణ్యాన్ని రుజువు చేసుకుంటూనే మరో పక్క ఎవిఎస్ కాలేజీలో ఎంబిఎ పూర్తి చేశాడు. తమిళనాడు ప్రభుత్వం రెండు కోట్లు ప్రకటించగా, యువజన సర్వీసుల మంత్రిత్వశాఖ 75 లక్షలు, సామాజిక న్యాయ శాఖ 30లక్షలు, సచిన్ టెండూల్కర్ 15 లక్షలు, యాష్ రాజ్ ఫిల్మ్ సంస్థ 10 లక్షలు, ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ 10 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ ముక్కుట్టు సెబాస్టియన్ ఐదు లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు.

చిత్రం..మరియప్పన్

- బి.వి ప్రసాద్