యువ

యువతకూ హృద్రోగాల ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతికత, ఆధునికత పెరిగిన కొద్దీ జీవనశైలిలో మార్పుల ఫలితంగా యుక్తవయసు వారిలోనూ గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువవుతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో హృద్రోగాల బారిన పడుతున్న యువత సంఖ్య నానాటికీ అధికం అవుతున్నట్లు పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ‘అడ్వాన్డ్ కార్డియోవాస్క్యులర్ సొల్యూషన్స్- 2017’ సదస్సులో యువతలో గుండెజబ్బులకు దారితీస్తున్న కారణాలపై నిపుణులు చర్చించారు. విద్య, ఉపాధి రంగాల్లో లోపాలు, ఒత్తిడుల ఫలితంగా యువత మానసిక, శారీరక అనారోగ్యాలకు గురవుతోందని సదస్సులో పలువురు హృద్రోగ నిపుణులు పేర్కొన్నారు. ‘్ఫ్యక్ట్స్ ఫౌండేషన్’ నేతృత్వంలో నాలుగు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ దేశాలకు చెందిన సుమారు 1,500 మంది ప్రముఖ హృద్రోగ నిపుణులు పాల్గొన్నారు. జీవనశైలి మారడంతో మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులకు యువత దూరం అవుతోంది. ఫలితంగా అనేకమంది 30 ఏళ్ల ప్రాయంలోనే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారట. సంసార బంధంలో ఉన్నవారిలో గుండెజబ్బులు తక్కువగా ఉంటున్నాయి. అవివాహితులు, విడాకులు తీసుకున్న వారికంటే పెళ్లయిన జంటల్లో గుండె జబ్బులు 14 శాతం తక్కువగా ఉన్నాయంటున్నారు. జీవనశైలిలో మార్పులే ఈ విపరిణామాలకు కారణమని ‘కార్డియోవాస్క్యులర్ రీసెర్చి ఫౌండేషన్’ (అమెరికా)కు చెందిన నిపుణులు తేల్చి చెబుతున్నారు.