యువ

చెత్తనుంచి ఎరువు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనావాసాల్లో నానాటికీ విషమిస్తున్న ‘చెత్త’ సమస్యకు పరిష్కారం చూపడమే కాదు, వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువును తయారు చేస్తూ బెంగళూరుకు చెందిన యువకులు ‘ఔరా’ అన్పిస్తున్నారు. ‘గార్డెన్ సిటీ’గా ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరంలో చెత్త సమస్య నానాటికీ వికృత రూపం దాలుస్తోంది. దీంతో ఈ సమస్య నుంచి నగర వాసులకు ఉపశమనం కలిగించేందుకు ‘గ్రీన్ పీస్’ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన యువకులు నడుం బిగించారు. నగర పరిసరాల్లో తాము సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువును సులభ పద్ధతుల్లో తయారుచేసి కర్షకులకు అందిస్తున్నారు. సేంద్రియ ఎరువులను వినియోగిస్తే మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయని తెలియజేసేందుకు నగరంలోని ఓ పార్కులో వెయ్యి మొక్కలను నాటారు. వీటిని చూశాక రైతులు సేంద్రియ ఎరువులను తమ పొలాల్లో వాడేందుకు సుముఖత చూపుతున్నారు. అతి తక్కువ ధరకే లభిస్తున్నందున ఈ ఎరువును కొనుగోలు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
‘గ్రీన్ పీస్’కు చెందిన యువకులు సామాజిక సేవలో భాగంగా ‘వేస్ట్ టూ ఫుడ్’ అనే తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. చెత్తను సేంద్రియ ఎరువుగా మార్చడం కష్టమేమీ కాదని, ఎవరైనా ఈ పని చేసేందుకు ముందుకురావచ్చని యువకులు సూచిస్తున్నారు. బెంగళూరు నగరంలో ప్రతిరోజూ కనీసం ఐదువేల టన్నుల చెత్త పోగవుతోంది. ఇందులో కనీసం అరవై శాతం చెత్తాచెదారాల నుంచి సేంద్రియ ఎరువును తయారుచేసేందుకు అవకాశం ఉందని యువకులు చెబుతున్నారు.
కృత్రిమ ఆకులతో ఇంధనం..
సహజ సిద్ధమైన మొక్కల ఆకులను ఔషధ రంగంలో వాడడం అందరికీ తెలిసిందే. మూలికల నుంచి ఇంధనాన్ని తయారు చేయవచ్చన్న కథనాలు గతంలో విన్నాం. అయితే, హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే కృత్రిమ ఆకును మన శాస్తవ్రేత్తలు తాజాగా సృష్టించారు. పుణె (మహారాష్ట్ర)లోని ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి’ (సిఎస్‌ఐఆర్)కు చెందిన యువ శాస్తవ్రేత్తలు నీళ్లను, సూర్యరశ్మిని వినియోగించి కృత్రిమ ఆకును రూపొందించారు. ఈ ఆకు సూర్యరశ్మిని గ్రహించాక నీళ్ల నుంచి ఇంధనాన్ని తయారు చేస్తుందని శాస్తవ్రేత్తలు భరోసా ఇస్తున్నారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న తమ ప్రయోగాలు ఇన్నాళ్లకు ఫలించాయని, సహజ సిద్ధమైన ఆకులను పోలిన ఈ కృత్రిమ ఆకులో అర్ధవాహకాలు పేర్చామని, వీటిపై సూర్యరశ్మి సోకగానే ఎలక్ట్రాన్లు కదిలి విద్యుత్ (ఇంధనం) ఉత్పత్తి అవుతుందని వారు వివరిస్తున్నారు. నీళ్ల నుంచి హైడ్రోజన్‌ను వేరు చేయడంలో ఆ విద్యుత్ పనిచేస్తుందంటున్నారు. తాము రూపొందించిన కృత్రిమ ఆకు ఇరవై మూడు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగి ఉంటుందని, ఇది గంటకు ఆరు లీటర్ల హైడ్రోజన్‌ను తయారు చేస్తుందని వారు తెలిపారు. ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తున్నందున వాతావరణంలోకి ఇపుడు పెద్దఎత్తున కార్బన్ డైయాక్సైడ్ విడుదల అవుతోందని, ఫలితంగా భూతాపం పెరుగుతోందని వారు గుర్తు చేస్తున్నారు. కృత్రిమ ఆకులను విరివిగా రూపొందిస్తే పర్యావరణ హితంగా హైడ్రోజన్ అందుబాటులోకి వస్తుందని, అపుడు దాన్ని వాహనాలను నడిపే ఇంధనంగా వాడొచ్చని సిఎస్‌ఐఆర్ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇలాంటి కృత్రిమ ఆకుల వినియోగం పెరిగితే పర్యావరణం సైతం మెరుగుపడుతుందని వారు అంటున్నారు.