యువ

‘బ్లూవేల్’కు విరుగుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనో వికాసానికి దోహదం చేయాల్సిన ‘ఆన్‌లైన్ గేమ్’లు ఇపుడు మరణ శాసనాలు రాస్తున్నాయి! ఆటవిడుపు కావాల్సిన ‘గేమ్’లు టీనేజీ యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయనడానికి ఇటీవలి ‘బ్లూవేల్ చాలెంజ్’ ఆన్‌లైన్ గేమ్ పరాకాష్ఠ! రష్యన్ యువకుడు రీనా పలెంకోవా సృష్టించిన ‘బ్లూవేల్ చాలెంజ్’ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మన దేశంలోనూ ఎంతోమంది ఈ ప్రాణాంతక గేమ్ బారిన పడ్డారు. టీనేజీ యువత పాలిట యమపాశంలా మారడంతో ఇప్పటికే ఎన్నో దేశాలు ‘బ్లూవేల్ చాలెంజ్’ను నిషేధించాయి. వేలం వెర్రిగా ‘బ్లూవేల్’ను డౌన్‌లోడ్ చేసుకున్న వారు తమను తాము గాయపరచుకోవడం, ఆత్మహత్యకు పురికొల్పే సాహసాలను పూర్తి చేయడం మనం చూస్తునే ఉన్నాం. వివేచన, అవగాహన లేని టీనేజీ వయస్కులు ‘బ్లూవేల్’ బారిన పడుతున్నందున ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు యువతను కాపాడేందుకు రంగంలోకి దిగాయి.
‘బ్లూవేల్’ మోజులో పడి ఏకాంతంగా గడుపుతూ, అన్నపానీయాలకు దూరమవుతూ.. చివరికి కుటుంబ సంబంధాలను మరచిపోతున్న యువతను ఆదుకోవాలని కేరళకు చెందిన కొందరు మేనేజ్‌మెంట్ విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. ‘బ్లూవేల్ చాలెంజ్’గు విరుగుడుగా ‘కిల్ ద వేల్ చాలెంజ్’ అనే సరికొత్త ఆటను కోజిక్కోడ్‌లోని సెయింట్ జోసెఫ్స్ కళాశాల విద్యార్థులు రూపొందించారు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసలైన వారిని రక్షించేందుకు ఉద్దేశించిన ‘కిల్ ద వేల్’ గేమ్ వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసే ‘కౌనె్సలింగ్ థెరపీ’గా ఉపయోగపడుతుంది. ‘బ్లూవేల్ చాలెంజ్’లో ‘టాస్క్’(సవాళ్ల)ల పేరిట వికృత చేష్టలకు, ప్రాణాంతక సాహసాలకు టీనేజీ యువత తెగిస్తోంది. ఆత్మహత్య చేసుకోవడం ఆ ఆటలోని చివరి ‘టాస్క్’! అయితే- ‘కిల్ ద వేల్ చాలెంజ్’ గేమ్ ఇందుకు పూర్తిగా విభిన్నం. మనల్ని మనం తెలుసుకోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో అనుబంధాలను పెంచుకోవడం ఈ సరికొత్త గేమ్ వల్ల అలవడుతుంది. ఎన్ని ‘టాస్క్’లను పూర్తి చేసినా ఇందులో ఆటను ఇంకా కొనసాగించే అవకాశం ఉంటుంది. ‘బ్లూవేల్’లో మాత్రం ఆత్మహత్య చేసుకోవడంతో ఆట ముగుస్తుంది.
‘బ్లూవేల్’కు విరుగుడుగా తాము రూపొందించిన ‘కిల్ ద వేల్ చాలెంజ్’ ఆటకు ఇప్పటికే అనూహ్య స్పందన వచ్చిందని దీని సృష్టికర్తలైన విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీనేజీ యువత ప్రాణాలతో చెలగాటమాడే ప్రాణాంతక ఆటకు విరుగుడు కనిపెట్టిన ఈ విద్యార్థులను తల్లిదండ్రులతో పాటు వివిధ వర్గాలవారు అభినందిస్తున్నారు. సెయింట్ జోసెఫ్స్ కళాశాలకు చెందిన ఈ విద్యార్థులు ‘కిల్ ద వేల్ చాలెంజ్’ను సృష్టించడానికి ముందు కూడా సమాజ సేవలో తమ వంతు కృషి చేస్తున్నారు. వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు వెళ్లి వీరు తమకు తోచిన సాయం అందిస్తుంటారు. ‘బ్లూవేల్ గేమ్’ వల్ల భారత్ సహా అనేక దేశాల్లో వందలాది మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం వీరిని కదిలించింది. బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సు చదువుతున్న ఈ విద్యార్థులు మానసిక నిపుణులు, పోలీసు అధికారులను కలుసుకుని వారి సలహాలను పాటించి ‘కిల్ ద వేల్ చాలెంజ్’ గేమ్‌ను సృష్టించారు. అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాకే దీన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచారు. దీనిని ఎవరైనా సులువుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆటను విడుదల చేసిన వారం రోజుల్లోనే తమకు మంచి స్పందన లభించిందని సెయింట్ జోసెఫ్స్ కళాశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.