యువ

వైర్‌లెస్ ఇయర్ ఫోన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో వినియోగదారుల సౌకర్యమే లక్ష్యంగా సరికొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. మనదేశంలో ఐటి ఉపకరణాలు, ఆడియో, వీడియో సర్వైలెన్స్ ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థగా పేరొందిన జెబ్రానిక్స్ మార్కెట్‌లోకి అలాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని విడుదల చేసింది. ఇయర్‌ఫోన్లు, హెడ్‌ఫోన్లతో వచ్చే బ్లూటూత్ మాడ్యూల్ (జడ్‌ఇబి-వా380టి) ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ మాడ్యూల్‌ని వినియోగించి ఇయర్‌ఫోన్ లేదా హెడ్‌ఫోన్‌ను వైర్‌లెస్ విధానంలో ఉపయోగించుకునే వెసులుబాటు వస్తుంది. వైర్‌లెస్ ఆడియోలో స్వచ్ఛత సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. దీర్ఘకాలంపాటు పనిచేసే సౌలభ్యం ఇందులో ఉంది. ఈ బ్లూటూత్ మోడల్ మాడ్యూల్ 3.5 ఎం.ఎం. జాక్ అదనపు ఆకర్షణ.
సన్నగా, తేలికగా ఉండే ఈ జాక్‌ను ఆన్ చేసిన వెంటనే వినియోగదారుడు ఉపయోగించే ఇయర్‌ఫోన్ లేదా హెడ్‌ఫోన్ వైర్‌లెస్‌గా మారిపోతుంది. ఈ బ్లూటూత్‌ను కంట్రోల్ చేయడం కోసం వాల్యూం, మీడియా కంట్రోల్ బటన్‌లు ఉంటాయి. అలాగే, ఎంపి3 ప్లేబ్యాక్ కొరకు మైక్రొఎస్‌డి స్లాట్ కూడా ఉంటుంది. ఈ మాడ్యూల్‌తోపాటు వచ్చే బండిల్డ్ ఇయర్‌ఫోన్లు, ఇన్ ఇయర్ టైప్ అధిక నాణ్యతను కలిగి ఉంటాయి.ఈ ఇయర్‌ఫోన్లకు పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. ఈ మాడ్యూల్ ఒక కప్ డిజైన్‌లా పనిచేస్తుంది. దీనిని తేలికగా ఏదైనా ప్య్రాబ్రిక్‌కు తగిలించుకోవచ్చు. జాగింగే చేసేటప్పుడు, ఇతర వ్యాయామాలు చేస్తున్నప్పుడు మనసు తేలిక అవడానికి పాటలు వినాలంటే ఈ మాడ్యూల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మెటాలిక్ డైజన్డ్ బ్యాక్ ఫినిష్‌తో అందంగా కనిపించే ఈ ఇయర్‌ఫోన్ బ్లూటూత్ మాడ్యూల్ మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా జెబ్రోనిక్స్ డైరక్టర్ దిలీప్‌దోషి తమ జడ్‌ఇబి-బిఇ380టి స్మార్ట్ పోర్టబుల్ బ్లూటూత్ మాడ్యూల్ ఎక్కడికైనా సంగీతాన్ని తీసుకువెళ్లి వినగలిగే సాధనంగా అభివర్ణించారు. ఆధునిక టచ్, స్మార్ట్ సౌకర్యంతో ఇది పనిచేస్తుంది కూడా.
ఈ మాడ్యూల్‌లోని బ్లూటూత్ శ్రేణి ఎలాంటి అంతరాయం లేకుండా పది మీటర్లు ఉంటుంది. తెలుపు నలుపు రంగుల్లో ఈ బ్లూటూత్ మాడ్యూల్ ఇయర్‌ఫోన్లు లేదా హెడ్‌ఫోన్లు దేశం అంతటా రిటైల్ స్టోర్లలో లభ్యమవుతాయి.