యువ

చిన్న వీణపై పెద్ద రికార్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేళ్లు సైతం దూరని అతి చిన్న వీణపై ఏకబిగిన పదిహేను నిమిషాల సేపు ఆహ్లాదకరంగా కృతులను పలికించిన శ్రీవాణి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సాధించి మన దేశానికి వనె్న తెచ్చారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నగరంలో జరిగిన ‘అసిస్ట్ వరల్డ్ రికార్డ్సు- 2017’ పోటీలో బుల్లివీణపై రాగ విన్యాసం చేసిన శ్రీవాణి అందరినీ అబ్బుర పరిచారు. కేవలం ఇరవై ఒక్క ఇంచుల వీణపై పదిహేను నిమిషాల సేపు స్వరాలు పలికించిన ఆమె ప్రపంచ రికార్డును సాధించారు. చిన్న వీణలపై స్వరాలు పలికించడంలో కొన్ని రోజులపాటు సాధన చేయడంతో తాను ఇంతటి ఘనతను సాధించగలిగానని ఆమె తెలిపారు. భారతీయ సంగీతానికి సంబంధించి ఎన్నో వాయిద్యాలు ఉన్నప్పటికీ, వీణ అంటే చిన్నప్పటి నుంచి తనకు అంతులేని మమకారం అని ఆమె చెబుతుంటారు.
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన శ్రీవాణి ‘వీణ శ్రీవాణి’గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గుర్తింపు పొందారు. ఏడేళ్ల వయసులోనే తొలి వీణా వాయిద్య ప్రదర్శన ఇచ్చిన ఆమె వివిధ ప్రాంతాల్లో సుమారు ఐదు వందల కచీరీలు చేశారు. వివాహం అనంతరం సుమారు పదేళ్లపాటు సంగీత సాధనకు దూరమైనప్పటికీ తిరిగి నాలుగేళ్ల క్రితం వీణపై స్వరాలు పలికించడం ప్రారంభించారు. వీణపై స్వరాలు సృష్టించడం చాలామంది చేసేదే. అయితే తాను ఇందులో ఏదో ఒక ప్రత్యేకతను సాధించాలన్న తపన ఉండడంతో ఆమె తన కోసం ఓ బుల్లి వీణను ప్రత్యేకంగా తయారు చేయించున్నారు. కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన మబు పాషా 21 అంగుళాల వీణను రూపొందించారు. ఇంత చిన్న వీణపై రాగాలు పలికించేందుకు నిరంతర సాధన చేసిన శ్రీవాణి తన ప్రతిభను నిరూపించుకున్నారు. అతి చిన్న వీణపై కృతులను పలికించడం చాలా కష్టమైనప్పటికీ శ్రీవాణి పట్టుదల, ఏకాగ్రతను చూసి భర్త వేణుస్వామి, బంధుమిత్రులు ఎంతగానో ప్రోత్సహించారు.
రెండేళ్ల వయసులోనే తన తల్లి సీతామహాలక్ష్మి వద్ద వీణపై స్వరాలను పలికించడానికి శ్రీవాణి శ్రీకారం చుట్టి, ఏడేళ్ల ప్రాయంలో తొలి సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో వీణ వాయిద్య ప్రదర్శనలు ఇచ్చి ప్రముఖుల, విద్వాంసుల ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాక కొన్నాళ్లు ప్రదర్శనలు ఇచ్చారు. 1998లో రాష్ట్ర స్థాయి వీణ పోటీల్లో ప్రథమురాలిగా నిలిచారు. రేడియో కళాకారిణిగాను గుర్తింపు పొందారు. దశాబ్ద కాలం పాటు వీణకు విశ్రాంతి ఇచ్చినా మళ్లీ స్వరాలను పలికించడం ప్రారంభించి, చిన్నవీణపై అనితర సాధ్యమైన ప్రతిభను చాటుకున్నారు. ‘ఫేస్‌బుక్’లో సుమారు ఆరు లక్షల మంది, యూ ట్యూబ్‌లో అరవై వేల మంది అభిమానులున్న ఆమె ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, పలు దేశాల్లో కచేరీలు ఇచ్చారు. ఇటీవల ఓ తెలుగు చలనచిత్రంలో రెండు పాటలకు వీణాసహకారం అందించారు. ఇటీవల పాండిచ్చేరికి చెందిన ‘అసిస్ట్ వరల్డ్ రికార్డ్సు- 2017’ నిర్వహించిన పోటీలో అతి చిన్న వీణపై స్వరాలు పలికించి ప్రపంచ రికార్డు సృష్టించి ప్రశంసాపత్రాన్ని, పురస్కారాన్ని అందుకున్నారు. మిగతా వాయిద్య పరికరాల కన్నా వీణపై పలికే స్వరాలకు ఓ ప్రత్యేకత ఉందని, ఈ కారణంగానే తాను వీణను ఎంచుకున్నానని ఆమె అంటున్నారు. ఏకాగ్రత, నిరంతర సాధన తోడైతే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చన్న శ్రీవాణి నేటి యువతకు స్ఫూర్తిదాత.