యువ

యాపిల్ ఐఫోన్ల జోరు మొదలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండగల సీజన్‌లో ‘ఐఫోన్’ ప్రేమికులకు ఇక సందడే సందడి! సాంకేతిక రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ‘యాపిల్’ సంస్థ మరిన్ని ఫీచర్లతో కొత్తరకం ఐఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీంతో అమెరికాలోనే కాదు, మన దేశంలోనూ యువతలో కోలాహలం వెల్లువెత్తుతోంది. 2007 జనవరి 9న అప్పటి యాపిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఓ) స్టీవ్ జాబ్స్ తొలి ఐఫోన్‌ను విడుదల చేశారు. అప్పటి నుంచి ఐఫోన్ శకం ఆరంభమైంది. విపణి వీధిలో ఐఫోన్ రంగప్రవేశం చేసి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా యాపిల్ ‘ఐఫోన్ 10’ను విడుదల చేసింది. ఇదేగాక ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ అనే రెండు మోడళ్లను కూడా మార్కెట్‌కు పరిచయం చేసింది. ఐఫోన్ 10 ప్రారంభ ధరను 999 డాలర్లుగా నిర్ణయించగా, అక్టోబర్ 27 నుంచి ముందుగా బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ మూడో తేదీ నుంచి వీటిని వినియోగదారులకు అందజేస్తారు.
5.8 అంగుళాల ‘స్క్రీన్’తో విడుదలైన ‘యాపిల్ 10’ విక్రయాలు సంచలనం సృష్టిస్తాయని మార్కెటింగ్‌రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓఎల్ ఇడి సాంకేతికతతో పాటు స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, గ్లాస్ బ్యాక్, 3డి టచ్ వంటి ఆకర్షణలున్న ఈ ఫోన్ 64, 256 జిబి సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అలాగే సరికొత్త ఫీచర్లతో విడుదలైన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ రకాలు సైతం యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. 4.7 అంగుళాల స్క్రీన్‌తో ఐఫోన్ 8, 5.5 అంగుళాల స్క్రీన్‌తో ఐఫోన్ 8 ప్లస్ లభిస్తాయి. సిల్వర్, గ్రే, గోల్డ్ వంటి రంగుల్లో లభించే వీటిలో 3డి టచ్, ట్రూ టోన్ డిస్‌ప్లే వంటి అదనపు ఆకర్షణలున్నాయి. ఐఫోన్ 8లో రియర్ కెమెరా 12 ఎంపిగా, 8 ప్లస్‌లో 12 ఎంపి సామర్ధ్యం కలిగిన డ్యూయల్ కెమెరాలుంటాయి.
8ప్లస్ ఫోన్ కనీస ధర 799 డాలర్లుగా, ఐఫోన్-8 కనీస ధర 699 డాలర్లుగా ‘యాపిల్’ నిర్ణయించింది. అమెరికాలో విక్రయాలు ప్రారంభమైన వారం పది రోజులకే భారత్‌లోనూ ఇవి అందుబాటులోకి వస్తాయి. ఈ నెల 29 నుంచి యాపిల్ ఆథరైజ్డు షాపుల్లో ఇవి లభ్యమవుతాయి. ఐఫోన్ 8, 8 ప్లస్ ప్రారంభ ధర మన దేశంలో 64,000 రూపాయలుగా ఉంటుంది. మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు మూడువేల విక్రయ కేంద్రాల ద్వారా ఈ రెండు ఫోన్‌లను విక్రయించేందుకు రెడింగ్టన్ ఇండియా సన్నాహాలు చేసింది. ఈ నెల 22 నుంచే ముందస్తు బుకింగ్‌ల సందడి మొదలుకానుంది. వీటితో పాటు యాపిల్ వాచ్ సరీస్ 3, వాచ్ ఓఎస్-4, 4కె హెచ్‌డిఆర్ వీడియో ఆకర్షణలతో టీవీల వంటి ఉత్పత్తులు తాజాగా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.
యాపిల్‌కు చెందిన తాజా ఐఫోన్‌లతో పోటీ పడేందుకు శామ్‌సంగ్ నోట్-8 ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. శామ్‌సంగ్ నోట్-8 ధరను 67,900 రూపాయలుగా నిర్ణయించారు.
మన దేశంలో నవంబర్ 3 నుంచి ఇవి మార్కెట్‌లో లభిస్తాయి. మన యువతలో మొబైల్ ఫోన్ వాడకం నానాటికీ అధికం కావడంతో భారతీయ మార్కెట్‌పై యాపిల్ భారీ అంచనాలను పెంచుకుంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్‌లో అమ్మకాలకు సంబంధించి యాపిల్ సంస్థ 11వ స్థానంలో నిలిచింది. ప్రత్యర్థి కంపెనీల వ్యాపారాన్ని నిలువరించేందుకు యాపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ధరలను ఇదివరకే తగ్గించింది. ఇపుడు ఐఫోన్ 10, 8, 8 ప్లస్ రకాలతో భారతీయ మార్కెట్‌లో తన వాటాను పెంచుకునేందుకు ‘యాపిల్’ భారీ కసరత్తు చేస్తోంది,