యువ

పద్నాలుగేళ్లకే పైలట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో జ్ఞానులు’.. అని మనం పాతపాటను మార్చి పాడుకోవాల్సిందే మరి..! చదువులోనే కాదు, తమకు అభిరుచి ఉన్న రంగంలో అద్భుతాలను సాధించి టీనేజీలోనే ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలు ‘శభాష్’ అనిపించుకుంటున్నారు. టీనేజీ కుర్రాడు కారు నడిపితే ఇప్పుడు వింతేమీ కాదు.. అందుకే- పద్నాలుగేళ్ల ప్రాయంలోనే సింగిల్ ఇంజన్ విమానాన్ని నడిపిన పిన్న వయస్కుడిగా భారత సంతతికి చెందిన మన్సూర్ అనిస్ సరికొత్త రికార్డును సృష్టించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరంలో తొమ్మిదో తరగతి చదువుతున్న అనిస్‌కు విమానం నడపాలనే కోరిక చిన్నతనం నుంచి ఉంది. తన బంధువు ఇచ్చిన స్ఫూర్తితో శిక్షణ పొంది తొలిసారి సింగిల్ ఇంజన్ విమానం నడిపానని, 17 ఏళ్లు రాగానే ప్రైవేట్ పైలెట్ లైసెన్స్, 18 ఏళ్లకు కమర్షియల్ పైలెట్ లైసెన్స్ సాధించి తీరతానని అనిస్ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు.జర్మనీకి చెందిన పదిహేనేళ్ల కుర్రాడు 34 గంటల శిక్షణ తర్వాత ఒంటరిగా విమానం నడిపాడు. అమెరికాకు చెందిన మరో 14 సంవత్సరాల బాలుడు కూడా 34 గంటల శిక్షణ అనంతరం విమానం నడిపాడు. అయితే కేవలం 25 గంటల శిక్షణ ముగిశాక విమానం నడిపిన అత్యంత పిన్న వయస్కుడిగా అనిస్ సరికొత్త అధ్యాయం సృష్టించాడు. వారిజ అనే పదహారేళ్ల గుజరాతీ బాలిక మన దేశంలో పైలెట్ లైసెన్స్ పొందిన చిన్నారిగా అరుదైన ఘనతను సాధించింది. నిజానికి మైనారిటీ తీరకుండా ఏ దేశంలోనూ కార్లు, బైక్‌లు నడిపేందుకు కూడా చట్టపరంగా అనుమతి లేదు. అయితే, పదిహేనేళ్ల వయసులోనే గుజరాత్ ఫ్లయింగ్ క్లబ్‌లో మెంబర్‌షిప్ పొందిన వారిజ పైలెట్ లైసెన్స్‌ను సాధించింది. తాజాగా షార్జాలో మన్సూర్ అనిస్ ‘కెస్నా-152’ విమానం నడిపి కెనడా ఏవియేషన్ అకాడమీ నుంచి పైలట్‌గా ధ్రువీకరణ పత్రం పొందడంలో విజయం సాధించాడు. అమెరికాకు చెందిన తేలికపాటి విమానమైన ‘కెస్నా- 152’లో రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. దీన్ని శిక్షణకు, వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తుంటారు. 7.34 మీటర్ల పొడవుండే ఈ విమానం క్రూయిజ్ స్పీడ్ గంటకు 198 కిలోమీటర్లు, టాప్ స్పీడ్ గంటకు 204 కిలోమీటర్లుగా నిర్ణయించారు. దీని బరువు 490 కిలోలు మాత్రమే. పది నిమిషాల పాటు ఎవరి సహాయం లేకుండానే విమానం నడిపిన అనిస్ రన్‌వేపై టేకాఫ్, ల్యాండింగ్, రేడియో కమ్యూనికేషన్ పరీక్షలో 96 శాతం మార్కులను కైవసం చేసుకోవడం గమనార్హం. ఒంటరిగా ఆకాశవీధిలో విమానం నడుపుతూ కొన్ని నిమిషాల సేపుచక్కర్లు కొట్టడంతో తన ఆకాంక్ష నెరవేరిందని అనిస్ ఆనందం వ్యక్తం చేశాడు. పైలట్‌గా శిక్షణ పొందాలంటే భారత్, అమెరికా, యుఎఇ, బ్రిటన్ వంటి దేశాల్లో కనీస వయసుకు సంబంధించి కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. కనిష్ట వయసు బ్రిటన్, అమెరికాలో 16 ఏళ్లుగాను, భారత్, యుఎఇలో 18 ఏళ్లుగాను ఉంది. అయితే- కెనడాలో మాత్రం పద్నాలుగేళ్ల వయసు వారికి పైలెట్ లైసెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో అనిస్‌ను పైలట్ శిక్షణ కోసం కెనడాకు అతని తల్లిదండ్రులు పంపారు. పేరెంట్స్ ప్రోత్సాహంతోనే తాను ఇంతటి ఘనతను సాధించానని అనిస్ చెబుతున్నాడు.