యువ

కల్లోల సీమలో ‘ఐక్యతారాగం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీరీ సంగీతానికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించి పెట్టడమే కాదు, భిన్నధృవాలుగా ఉంటున్న రెండు వర్గాలను కలపడమే తన ధ్యేయమని అంటోంది యువ సంగీత కళాకారిణి ఆభా హంజూర. ఆమె స్వర విన్యాసాలు అంతర్జాల వేదికపై ఇప్పటికే లక్షలాది మందిని సమ్మోహితులను చేశాయి. కాశ్మీర్‌లో దశాబ్దాల తరబడి కలహించుకుంటున్న ముస్లింలు, కాశ్మీరీ పండిట్లను ‘స్వరబంధం’తో ఆమె ఏకం చేస్తోంది. కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన హంజూర కుటుంబం ఏనాడో భారత్‌కు వలస వచ్చింది. ఒకే ప్రాంతానికి చెందినప్పటికీ ముస్లింలు, కాశ్మీరీ పండిట్లు ద్వేషభావంతో ఉండడం వాంఛనీయం కాదని ఆమె భావించింది. ఈ రెండు వర్గాలను పరస్పరం సన్నిహితం చేయాలని, ఇందుకు సంగీతమే తగిన సాధనమని ఆమె భావించింది. తాజాగా శ్రీనగర్‌లో ‘సాజ్- ఇ- కాశ్మీర్’ పేరిట నిర్వహించిన హంజూర నిర్వహించిన సంగీత కార్యక్రమానికి ముస్లింలు, కాశ్మీరీ పండిట్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆమె ఆలపించిన స్వరాలకు ఈ రెండు వర్గాల వారూ గళం కలిపారు. మత ఘర్షణలు, ఉగ్రవాదుల దాడులు, శాంతిభద్రతల సమస్యల కారణంతో కాశ్మీర్ లోయ ప్రజలు గత మూడు దశాబ్దాలుగా సినిమాలు చూసేందుకు కూడా నోచుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో హంజూర నిర్వహించిన సంగీత కార్యక్రమం అక్కడి ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. జానపద గీతాలను పాశ్చాత్య బాణీల్లో ఆలపించడం ఆమె ప్రత్యేకత. అందమైన పర్వత శ్రేణులు, మనోహరమైన ‘దాల్’ సరస్సు ఉన్న ప్రాంతంలో గీతాలను ఆలపించడం కంటే మరో అద్భుతం ఏమి ఉంటుందని ఆమె ప్రశ్నిస్తోంది. యువతులు, విద్యార్థినులు భారీ సంఖ్యలో తన పాటలు వినేందుకు రావడం ఆనందం కలిగిస్తోందని, రెండు ప్రధాన వర్గాలను మానసికంగా దగ్గరకు చేర్చేందుకు సంగీతం ఓ వారధి కావడం తనకు సంతృప్తి కలిగించిందని ఆమె అంటోంది. శ్రీనగర్ సమీప ప్రాంతాల్లో నివసించే కాశ్మీరీ పండిట్ కుటుంబాలు, ముస్లిం కుటుంబాలకు చెందిన వారు సంగీత కార్యక్రమానికి హాజరై గళం విప్పారు. రెండు వర్గాల వారు పరస్పరం అభినందనలు తెలుపుకుని దగ్గరయ్యారు.
1990 ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల ఫలితంగా భారీ సంఖ్యలో కాశ్మీరీ పండిట్లు ‘లోయ’ను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస పోయారు. అప్పటి నుంచి ‘పండిట్లు’, ముస్లింల మధ్య అంతరాలు మరింతగా పెరిగాయి. ఈ రెండు వర్గాలను సమైక్య పరచేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. హంజూర నిర్వహించిన సంగీత కార్యక్రమం నిజమైన కాశ్మీర్‌ను ప్రతిబింబించిందని, మనుషుల మధ్య ‘విభజన’ సరికాదని గాయని తన పాటల ద్వారా చాటి చెప్పడం అభినందనీయమని జమ్ము-కాశ్మీర్ మంత్రి నరుూమ్ అఖ్తర్ అంటున్నారు. నిజానికి 2012లోనే హంజూర తన గీతాలాపన కార్యక్రమాలను ఓ ఉన్నత లక్ష్యం కోసం ప్రారంభించారు. ప్రఖ్యాతి పొందిన ‘హుకుస్ బుకుస్’ వంటి జానపద బాణీలను ఆమె ఎంచుకున్నారు. తన పాటలను నూటికి నూరుశాతం అర్థం చేసుకునే సంగీతాభిమానులు లభించడంతో తన కల సాకారమైందని హంజూర అంటున్నారు. ఉన్నతమైన సంస్కృతి, సంప్రదాయాలకు కాశ్మీర్ ఆలవాలమని, వాటిని ప్రపంచానికి చాటి చెప్పడమే గాక, వివిధ వర్గాల వారిలో ఐక్యతను పెంపొందించేందుకు తాను సంగీతాన్ని ఎంచుకున్నానని ఆమె అంటున్నారు.