యువ

కెరీర్‌కు దిక్సూచి ‘ఇండియా ఎంప్లాయడ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి కెరీర్‌లో స్థిరపడాలని ఎనె్నన్నో ఆశలతో ఉన్నత విద్యలో విభిన్నమైన కోర్సులను పూర్తి చేసే యువతకు నేడు ఆశించిన ఫలితం దక్కడం లేదు. చదివే చదువుకు, చేసే ఉద్యోగానికి ఒక్కోసారి ఎలాంటి పొంతన ఉండడం లేదు. నేటి పోటీ ప్రపంచంలో ఆశించిన ఉద్యోగం రాకున్నా ఉన్న దాంతోనే సంతృప్తి పడాల్సి వస్తోంది. ‘కెరీర్’కు సంబంధించి యువతకు సరైన దిశానిర్దేశం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితుల్లో యువతకు ఆశాకిరణంలా ఆవిర్భవించింది ‘ఇండియా ఎంప్లాయడ్’. మన దేశంలో ప్రతి సంవత్సరం ఉన్నత విద్యలో వివిధ కోర్సులను పూర్తి చేసి దాదాపు అరవై లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం అనే్వషణ మొదలుపెడుతున్నారు. మంచి కెరీర్‌పై ఆశలు పెట్టుకుని ఇంతటి భారీ సంఖ్యలో పట్ట్భద్రులు బయటకు వస్తున్నా వీరిలో కేవలం 8 నుంచి 10 శాతం మందికే ఉద్యోగాలు దక్కుతున్నాయి. మిగతా తొంభై శాతం మంది ఉద్యోగానే్వషణలోనే కాలం గడుపుతున్నారు. నిరుద్యోగులుగా మిగిలిపోతామేమోనన్న భయాందోళనలు వీరిలో గూడుకట్టుకుంటున్నాయి. ఇలాంటి వారికి కెరీర్‌పై అవగాహన కల్పించేందుకు ‘ఇంటర్న్‌శాల’ అనే సంస్థ ‘ఇండియా ఎంప్లాయడ్’ అనే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కెరీర్‌కు సంబంధించి ఆన్‌లైన్ శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లపై తగిన అవగాహన కల్పించేందుకు ‘ఇండియా ఎంప్లాయడ్’ ఎంతగానో దోహదం చేస్తుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా కనీసం అరలక్ష మంది యువతీ యువకులకు ఇంటర్న్‌షిప్ అందించాలని సంకల్పించారు.
ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారి గురించి సమాచారం అందిస్తామని, ఈ వివరాలు మిగతా ఉద్యోగార్థులకు మంచి స్ఫూర్తిని కలిగిస్తాయని ‘ఇంటర్న్‌శాల’ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సర్వేశ్ అగర్వాల్ భరోసా ఇస్తున్నారు. సరైన సంస్థలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తే ఉద్యోగార్థులు మంచి నైపుణ్యాలను సాధించే వీలుందని ఆయన చెబుతున్నారు. నిరుద్యోగ సమస్యను కొంతైనా రూపుమాపాలంటే ఇంటర్న్‌షిప్‌లు ఎంతో అవసరమని అంటున్నారు. తమ సంస్థ నుంచి పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకునే వారు జశఆళూశఒ్ద్ఘ్ఘ.ష్యౄ/జశజూజ్ఘళౄఔ్యకళజూ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని అగర్వాల్ సూచిస్తున్నారు.
యువతను వేధిస్తున్న నిరుద్యోగం, నైపుణ్యాల లేమి వంటి సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను సూచించేందుకు ‘ఇండియా ఎంప్లాయడ్’ను తీర్చిదిద్దారు. నిర్యోగులు, కెరీర్‌లో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆరాటపడేవారు ఇంటర్న్‌షిప్ కోసం ఈ సంస్థలో దరఖాస్తు చేసుకోవాలి.
తమ నైపుణ్యాలకు సరిపోయే ఉద్యోగాలను ఎంచుకోవడంలో ఈ సంస్థ యువతకు సహకరిస్తుంది. అభ్యర్థులు తగిన నైపుణ్యం ప్రదర్శించినట్లయితే తాము ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన చోటే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ఆదిత్య బిర్లా, ఓవైఓ రూమ్స్, టీచ్ ఫర్ ఇండియా వంటి సంస్థలు ‘ఇండియా ఎంప్లాయడ్’కు తోడ్పాటును అందచేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. విద్యా సంవత్సరంతో సంబంధం లేకుండా మంచి కెరీర్‌ను ఆశించే యువత ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీలు పూర్తిచేస్తే చాలదు, మంచి నైపుణ్యం, తగిన శిక్షణ, సరైన అవగాహన ఉన్నపుడే కెరీర్‌లో ఆశించిన లక్ష్యాలను చేరుకునే వీలుంటుందని ‘ఇంటర్న్‌శాల’ నిర్వాహకులు చెబుతున్నారు.