యువ

చిన్నారి ‘చెస్ క్వీన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరేళ్ల ప్రాయంలోనే ‘పావుల’ను కదపడంలో, ‘ఎత్తులకు పైఎత్తులు’ వేయడంలో ఆ బాలిక అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది. పదకొండేళ్ల వయసుకే ‘చెస్ క్వీన్’గా జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. మహారాష్టల్రోని నాగపూర్‌కు చెందిన దివ్యా దేశ్‌ముఖ్ తాజాగా బ్రెజిల్‌లో పతకం సాధించడంతో ఇప్పుడు ఓ ‘విశిష్ట వ్యక్తి’గా గుర్తింపు పొందింది. 2012లో ప్రారంభమైన ఆమె ‘పతకాల ప్రస్థానం’ నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు ఇరవై అంతర్జాతీయ పతకాలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో చెస్ పోటీల్లో లెక్కలేనన్ని పతకాలను తన ఖాతాలో వేసుకుంది. చెన్నైకి చెందిన రమేష్ ఆమెకు కోచ్‌గా వ్యవహరిస్తూ మెళకువలకు సంబంధించి తర్ఫీదు ఇస్తున్నారు. 2012లో అండర్-7 పోటీల్లో బంగారు పతకం, 2013లో అండర్-9 టోర్నమెంటులో బంగారు పతకం, 2014లో అండర్-9 పోటీలో రజతం, 2015లో అండర్-11 జాతీయ పోటీలో రజతం, 2016లో జాతీయ పోటీలో బంగారు పతకం, గత ఏడాది నేషనల్ చెస్ టోర్నీలో రజత పతకాలను దివ్య సాధించింది. విశ్వవిఖ్యాత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తనకు స్ఫూర్తిదాత అని, తన తల్లి ప్రోత్సాహం వల్లే తాను ఇంతటి ఘనతను సాధించానని ఆమె అంటోంది. తన పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కూడా ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని చెబుతోంది. ఇటీవల బ్రెజిల్‌లో ‘వరల్డ్ కాడెట్ చెస్ టోర్నీ’లో బంగారు పతకం సాధించడం తనకు ఎంతగానో ఆనందం కలిగించిందని చెబుతున్న దివ్య- భవిష్యత్‌లో మరిన్ని టైటిళ్లు సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తానని ఎంతో ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. సరైన స్పాన్సర్లు లభిస్తే దివ్య మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పతకాలను సాధించి తీరుతుందని ఆమె కోచ్ రమేష్ అంటున్నారు.