యువ

సంపాదన కన్నా.. సేవాభావం మిన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత చదువులు పూర్తిచేసి, భారీగా జీతభత్యాలున్నా ఆ యువకుడు సమాజసేవకే సుముఖత చూపి ఇతరులకు స్ఫూర్తిదాతగా నిలిచాడు.. తాను ఇబ్బందుల పాలైనా సరే- పేదవర్గాల పిల్లలకు అక్షరదానం చేయాలని అకుంఠిత దీక్షతో ముందుకు కదిలాడు.. దీంతో ఆ యువకుడికి ఇపుడు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. కార్పొరేట్ కొలువును, విలాసవంతమైన జీవితాన్ని కాదనుకుని విద్యాగంధాన్ని పదిమందికి పంచాలని ప్రయత్నిస్తున్న ఆ కుర్రాడికి ప్రపంచ బ్యాంకు నుంచి ప్రశంసలు లభించాయి.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన దివాకర్ సంక్లా చెన్నై ఐఐటిలో ఇంజనీరింగ్, లక్నో ఐఐఎం నుంచి ఎంబిఎ పూర్తి చేశాడు. పెప్సీకో, సిటీ బ్యాంకు వంటి ప్రముఖ సంస్థల్లో మంచి జీతభత్యాలు దక్కే ఉద్యోగాలు అతడిని వరించాయి. కానీ, ఆ సంపాదన అతనికి సంతృప్తిని ఇవ్వలేదు. తన మనసులో నిక్షిప్తమైన సేవాకాంక్షతో ఆ ఉద్యోగాలను తృణప్రాయంగా వదిలేశాడు. బిటెక్, ఎంబిఎ చదివాక భారీ జీతంతో 2013 వరకూ దివాకర్ అందరిలాగే సంపాదనే లక్ష్యమని భావించాడు. అయితే, ఏ ఉద్యోగమూ, ఏ హోదాలూ తనకు ఆత్మసంతృప్తి ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులకు పాఠాలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మురికివాడల్లోని పిల్లలు విద్యాగంధం లేక దీనావస్థలో ఉండడాన్ని చూసి చలించిపోయిన దివాకర్ తన గమ్యాన్ని నిర్దేశించుకున్నాడు.
2012లో ‘టీచ్ ఫర్ ఇండియా ఫెలోషిప్’కు దరఖాస్తు చేసి, వాలంటీర్‌గా ఎంపికయ్యాక రెండేళ్లపాటు దేశ రాజధానిలోని మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పాడు. పిల్లల్లోను, వారి తల్లిదండ్రుల్లోను మార్పును గమనించి ఇక అదే దారిలో తను నడవాలనుకుని దివాకర్ నిర్ణయించుకున్నాడు. ఫెలోషిప్ ముగిసిన అనంతరం కూడా పేదపిల్లలకు విద్యను అందించాలన్న తపన అతనిలో అధికమైంది. ఈ నేపథ్యంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థల, మిత్రుల సహకారంతో ‘అల్మోరా ఎడ్యుకేషన్’ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. వినూత్న పద్ధతుల్లో పిల్లలకు విద్యను అందించాలని భావించాడు. పాఠాలు చెప్పడమే కాదు, పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, నైతిక విలువలు పెంచేందుకు కృషి చేస్తూ తన ప్రతిభను దివాకర్ చాటుకున్నాడు. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనలో కొత్త పద్ధతులు అవసరమని ఆయన చెబుతుంటాడు. వినూత్నమైన ఆయన బోధనాశైలిని మెచ్చుకుంటూ ‘ప్రపంచ బ్యాంకు యువజన సమ్మేళనం-2016’లో ‘టాప్-6 గ్లోబల్లీ రీ థింకింగ్ ఎడ్యుకేషన్ ఐడియాస్’ జాబితాలో దివాకర్‌కు స్థానం లభించింది. గత ఏడాది నవంబర్‌లో ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమ్మేళనంలో దివాకర్ ప్రసంగం తీరు ఆహూతులను అలరించింది.
విద్యారంగం వ్యాప్తికి దివాకర్ చేస్తున్న కృషిని మెచ్చుకుని ఇంటర్నెట్ దిగ్గజం ‘గూగుల్ ఇండియా’ ఇరవై వేల డాలర్ల విరాళం ఇచ్చింది. గూగుల్ సిబ్బంది కూడా సాంకేతిక అంశాల్లో దివాకర్‌కు అండగా నిలిచారు. దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించాలన్నదే ధ్యేయమని దివాకర్ చెబుతున్నాడు.