యువ

వీడియో కాల్స్‌ను రికార్డు చేయడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో వీడియో కాల్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌ల ద్వారా ఇద్దరు వ్యక్తులు లేదా గ్రూప్స్ మధ్య జరిగే సంభాషణలకు వీడియో కాల్స్ మరింత వాస్తవికతను తీసుకువస్తున్నాయి. వీడియో కాలింగ్ అందుబాటులోకి రాకముందు కేవలం వాయిస్ కాల్స్ ద్వారా మాత్రమే సంభాషణలు సాగేవి. ఈ క్రమంలో అవతలి వ్యక్తుల స్వరాన్ని మాత్రమే వినగలిగే అవకాశం వుండేది. వీడియో కాల్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత అవతలి వ్యక్తులను ప్రత్యక్షంగా చూస్తూ మాట్లాడుకోగలుగుతున్నాం. ఈ క్రమంలో మనుషులు మధ్య కొత్త కొత్త ఎమోషన్స్ చిగురిస్తున్నాయి.
ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సంభాషణల దృశ్యాలను వారి వారి ఫోన్ ఫ్రంట్ కెమెరాల ద్వారా లైవ్ వీడియో రూపంలో చిత్రీకరించి, ఆ విజువల్స్‌ను ఏకకాలంలో ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ద్వారా ఒకరి విజువల్‌ను మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయడమే వీడియో కాలింగ్ ముఖ్య ఉద్దేశం. వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వెబ్‌సైట్‌లు డీఫాల్ట్‌గా వీడియో కాలింగ్ సదుపాయాన్ని ఆఫర్ చేస్తున్నప్పటికీ, వాటిని రికార్డ్ చేసుకుని సేవ్ చేసుకనే ఆప్షన్‌ను మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేకపోయాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా వీడియోకాల్‌ను రికార్డ్ చేయవల్సి వస్తే ఏం చేస్తారు? సోషల్ మీడియా వెబ్‌సైట్‌ల ద్వారా నిర్వహించుకునే వీడియో కాల్స్‌ను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకునేందుకు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి వాటికోసమే ఎదురుచూస్తున్నట్లయితే ఇది చదవండి.. వాస్తవానికి వాట్సాప్, ఫేస్‌బుక్‌ల ద్వారా నిర్వహించుకునే వీడియో కాల్స్‌ను రెండు మార్గాలలో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ పనిని పూర్తిచేయటం కోసం రెండు ప్రత్యేకమైన స్క్రీన్ రికార్డర్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. వాటి గురించిన వివరాలను తెలుసుకుందాం..

డియూ రికార్డర్

ఈ అప్లికేషన్‌ను చాలా సింపుల్‌గా ఉపయోగించుకోవచ్చు. డియూ రికార్డర్ యాప్‌ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత స్క్రీన్‌పై ఓ ఫ్లోటింగ్ ఐకాన్ ప్రత్యక్షమవుతుంది. ఈ ఐకాన్‌పై ‘టాప్’ చేసిన ప్రతిసారి అనేక ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వీటిలో రికార్డ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫోన్ స్క్రీన్‌పై జరిగే ప్రతి విషయం రికార్డ్ అయిపోతుంది. వీడియోలను రికార్డ్ చేసే సమయంలో సౌండ్‌ను కూడా ఈ యాప్ రికార్డ్ చేసి సేవ్ చేస్తుంది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల వీడియో కాల్స్‌ను రికార్డ్ చేసుకునే వీలుంటుంది.

ఎజెడ్ స్క్రీన్ రికార్డర్

డియూ రికార్డిర్ మాదిరిగానే ఎజెడ్ స్క్రీన్ రికార్డర్ యాప్‌ను కూడా చాలా సింపుల్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ మీ స్మార్ట్ ఫోన్‌లో పని చేసేందుకు ఎటువంటి రూట్ యాక్సెస్ అవసరం ఉండదు. నోటిఫికేషన్ ప్యానెల్ నుంచే వీడియోలను రికార్డ్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్ ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర యాప్‌లకు సంబంధించిన వీడియో కాల్స్‌ను నిర్వహించుకోవచ్చు. ఈ స్క్రీన్ రికార్డర్ యాప్ వీడియోలను రికార్డ్ చేసే సమయంలో సౌండ్‌ను కూడా చాలా క్లియర్‌గా క్యాప్చర్ చేస్తుంది.

మాతుకుమల్లి వెంకట సాయి కిరణ్ (బెర్లిన్, జర్మనీ)