యువ

కొత్త ఫీచర్లతో ‘ఎక్స్‌జెడ్1’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తరకం స్మార్ట్ఫోన్లు మార్కెట్‌లో రంగప్రవేశం చేశాయంటే చాలు.. వాటిని కొనాలన్న తహతహ నేటి యువతలో మరీ ఎక్కువగా ఉంటోంది. ధరలు బరువుగా ఉన్నా, తాము కొనే ఫోన్లు మాత్రం తేలిగ్గా, కంటికి ఇంపుగా ఉండాలని వినూత్న ఫీచర్లు అందుబాటులోకి రావాలని అంతా ఆసక్తి చూపుతారు. సోనీ సంస్థ తాజాగా విడుదల చేసిన ‘ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1’ ఫోన్‌పై ఇపుడు ఇలాంటి ఆసక్తే నెలకొంది.
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్‌తో మార్కెట్‌లోకి అడుగిడిన ఈ సరికొత్త మొబైల్‌లో అలరించే ఫీచర్లు అనేకం ఉన్నాయి. మెటాలిక్ డిజైన్‌తో 5.2 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే మైమరపించేలా ఉంది. 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ‘సెల్ఫీ ప్రియుల’కు ఎంతగానో ఉపకరిస్తుంది. 19 మెగా పిక్సెల్ రియర్ కెమెరాతో వీడియోలు, ఫొటోలను సులువుగా తీసుకునే వీలుంది. ‘్ఫంగర్ ప్రింట్’ సెన్సర్ ఈ మొబైల్‌లో మరో అదనపు ఆకర్షణగా నిలిచింది. క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 837, 4జిబి ర్యామ్‌తో ఫోన్ సామర్థ్యం మెరుగ్గా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఐపి 68 రేటింగ్‌ను దక్కించుకున్న ఈ ఎక్స్‌జడ్1 రకం ఫోన్ నీళ్లలో పడినా ఎలాంటి నష్టం జరగదు. రోజంతా పనిచేసేలా బ్యాటరీ బ్యాకప్ అందుబాటులో ఉంటుంది.