యువ

వాట్సాప్ కొత్త ఫీచర్ ‘లొకేషన్ షేరింగ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజురోజుకూ వాట్సాప్ వినియోగం విశ్వవ్యాప్తంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మొబైల్ యాప్ రోజుకో కొత్త ఫీచర్‌తో వినియోగదారులను అలరిస్తోంది. వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన రావడం కూడా కొత్త ఫీచర్ల ఆవిష్కరణకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ సరికొత్తగా ‘లొకేషన్ షేరింగ్’్ఫచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
అటాచ్ బటన్ క్లిక్ చేస్తే
ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఒఎస్ స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చింది. మీరు వాట్సాప్‌లో చాటింగ్ చేస్తుంటారు కదా.. అక్కడ అటాచ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఈ లైవ్ లొకేషన్ ఆప్షన్ కనిపిస్తుంది.
షేర్ లైవ్ లొకేషన్
లైవ్ లొకేషన్‌ను క్లిక్ చేస్తే మీకు షేర్ లైవ్ లొకేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మీకు నచ్చినవారికి లొకేషన్ షేర్ చేయవచ్చు. అక్కడే టైం కూడా సెట్ చేయవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మహిళలు, పిల్లలు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కనెక్ట్ అయ్యేలా ఉండొచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు సులువుగా తెలుస్తుంది.
15 నిమిషాలు నాన్‌స్టాప్‌గా లైవ్‌లో
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో రియల్ టైమ్‌లో లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. ఏ సమయంలోనైనా ఈ షేరింగ్ ఆపివేయవచ్చు. అప్పుడు లైవ్ లొకేషన్ టైమర్ కూడా ఆగిపోతుంది. 15 నిమిషాలు నాన్ స్టాప్‌గా లైవ్‌లో ఉండవచ్చని, ఇలా గరిష్టంగా ఎనిమిది గంటలపాటు లైవ్‌ను ఎంచుకోవచ్చని వాట్సాప్ సంస్థ చెబుతోంది.
గ్రూపులకు సంబంధించి
గ్రూపులకు సంబంధించి లైవ్ లొకేషన్ సెలక్ట్ చేసుకున్న గ్రూపు మెంబర్స్ లొకేషన్స్ ఒకే మ్యాప్‌లో కనిపిస్తాయి. ఎంతసేపు లైవ్‌లో ఉండాలనేది యూజర్ నిర్ణయించుకోవచ్చు.