యువ

19 ఏళ్లకే వందకోట్లకు అధిపతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందొమ్మిదేళ్ల వయసులో కేవలం పదహారు నెలలు కష్టపడి ఆ కుర్రాడు వందకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్ఞానికి అధిపతిగా నిలిచాడు. ఆత్మీయుల నుంచి రుణంగా తీసుకున్న సుమారు ఆరు లక్షల రూపాయలను స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి, పనె్నండు మిలియన్ పౌండ్ల (సుమారు 103 కోట్ల రూపాయలు)మేరకు లాభాలను ఆర్జించి అందరి చేత ‘ఔరా’ అనిపించాడు. లండన్‌లో భారతీయ సంతతికి చెందిన పందొమ్మిదేళ్ల అక్షయ్ రూపారెలియా తన ఆన్‌లైన్ స్థిరాస్తి సంస్థ ద్వారా ఇంతటి అద్భుతాన్ని సాధించాడు. బ్రిటన్‌లో ‘డోర్‌స్టెప్స్ డాట్ కో డాట్ యూకె’ అనే ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ సంస్థను నిర్వహిస్తున్న అక్షయ్ ‘అత్యంత పిన్నవయసులో బ్రిటన్ కోటీశ్వరులైన’ వారిలో ఒకడిగా రికార్డు సృష్టించాడు. బ్రిటన్‌లో 18వ అతిపెద్ద స్థిరాస్తి సంస్థకు అధిపతిగా నిలిచిన ఈ కుర్రాడు కళాశాల రోజుల్లోనే వ్యాపార రంగంపై ఆసక్తి చూపాడు. ముఖ్యంగా ఆర్థిక సాధికారత సాధించిన మహిళలను స్థిరాస్తి రంగంవైపు ఆకర్షితులను చేయడంలో అక్షయ్ విజయం సాధించాడు. ఇప్పటివరకూ తాను సుమారు 860 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులకు సంబంధించి లావాదేవీలు నిర్వహించినట్లు ఇతను గర్వంగా చెబుతున్నాడు.