యువ

సెల్‌తో మెదడుకు చెద!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మార్ట్ఫోన్’తో అనుబంధం పెరిగేకొద్దీ మెదడు శక్తి సన్నగిల్లిపోతుంది.. ఇదీ ఓ అంతర్జాతీయ అధ్యయనంలో నిపుణులు చేసిన హెచ్చరిక.

స్మార్ట్ఫోన్ల ప్రభావంతో సామాజిక నైపుణ్యాలు సన్నగిల్లడమే కాదు, మానవ సంబంధాలు సైతం దిగజారుతున్నాయని కూడా పరిశోధకులు గుర్తించారు. నేటి నవ నాగరిక యుగంలో మన మెదడుపై పలు రకాల ఒత్తిళ్లు తప్పడం లేదు. వీటికి ఇపుడు స్మార్ట్ఫోన్ జత కలియడంతో మెదడు మరింత బిజీగా మారింది. సమస్త సమాచారాన్ని అందుబాటులోకి తెస్తున్న స్మార్ట్ఫోన్ ఓ పదునైన ఆయుధంలా మారి చివరకి.. మెదడుకి చేటు కలిగిస్తోందని అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్తవ్రేత్తలు తాజా అధ్యయనంలో తేల్చారు. ప్రతి పనికీ స్మార్ట్ఫోన్‌పై ఆధారపడడం వల్ల సమస్యలపై దృష్టిపెట్టే, సృజనాత్మకతతో ఆలోచించే సామర్ధ్యం తగ్గుముఖం పడుతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘యాపిల్’ కంపెనీ సమాచారం మేరకు ఓ వ్యక్తి సగటున రోజుకు కనీసం 80 సార్లయినా స్మార్ట్ఫోన్‌ను వినియోగిస్తున్నాడు. మన మెదడు ఒకేసారి అనేక పనులకు ఉపక్రమిస్తుంది.
ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్, ఫోన్ సంభాషణలు, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను వీక్షించడం.. ఇలా ఎనె్నన్నో పనులను చేయడానికి మెదడు శ్రమిస్తుంది. ఏకకాలంలో అపరితంగా వచ్చి చేరే సమాచారాన్ని ఆకళింపు చేసుకోలేక మెదడు సతమతమవుతుంది.. ఫలితంగా మనలో మేధోశక్తి తగ్గిపోతోందని శాస్తవ్రేత్తలు విశే్లషిస్తున్నారు. స్మార్ట్ఫోన్‌కు దాసోహం కావడంతో మనిషి బిజీగా మారడం.. ఫలితంగా మెదడుపై ఒత్తిడి పెరిగి దాని సామర్ధ్యం దిగజారుతోంది. ఏకకాలంలో అనేకానేక పనులకు ఉపక్రమించడం వల్ల మేధస్సు, నైపుణ్యాలు బలహీనపడుతున్నాయి. దీని పర్యవసానంగా మెదడు పనితీరులో మార్పు కనిపిస్తోందని, మనం గుర్తుంచుకోవాల్సిన వాటిని గుర్తుపెట్టుకోలేక పోతున్నామని నిపుణులు చెబుతున్నారు. టీవీ, కంప్యూటర్, స్మార్ట్ఫోన్‌లకు బానిసలు కావడం మన బలహీనతలకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. ఈ బలహీనతలే మెదడు బలాన్ని హరిస్తున్నాయి.
సాంకేతికత మనకు అవసరమే అయినప్పటికీ- స్మార్ట్ఫోన్లు వంటివి మన ఆలోచనా విధానాన్ని, మన దృష్టిని, ప్రవర్తనను, నైపుణ్యాలను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఫోన్ రింగ్ కావడం, వైబ్రేషన్, మెసేజ్ వచ్చినపుడు రింగ్‌టోన్.. ఇలాంటి వన్నీ మన పనులకు ఆటంకం కలిగించినట్లే- వీటికి మనం స్పందించనపుడు అవతలి వ్యక్తుల్లో ఆందోళన, రక్తపోటు వంటివి తలెత్తుతున్నాయని పరిశోధనలో తేలింది. కొంతమంది ఐఫోన్ వినియోగదారులపై అధ్యయనం చేసినపుడు ఇలాంటి ఆందోళనకరమైన పలు అంశాలు వెలుగు చూశాయి. స్మార్ట్ఫోన్ ద్వారా అందే సమాచారం, అనుభవాలు మెదడులో తరంగాల మాదిరి తిరుగుతుంటాయి. మన చుట్టూ ఎన్నో వస్తువులు ఉన్నప్పటికీ మన దృష్టి, ధ్యాస స్మార్ట్ఫోన్‌పైనే ఉంటాయని పరిశోధకులు కనుగొన్నారు. స్మార్ట్ఫోన్ చెరలో బందీలవుతున్నవారు నిత్యం ఆలోచనల్లోనే మునిగి తేలుతుంటారు. గనుక వీరు ముఖాముఖిగా మాట్లాడేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులతో, ఇతరులతో సంబంధాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా ఎవరికివారు స్మార్ట్ఫోన్‌లతో మమేకం కావడంతో సంభాషణలు, పలకరింపులు సైతం కరవవుతున్నాయి. దీనివల్ల ప్రవర్తనలు, మనస్తత్వంలో అనూహ్య మార్పులు అనివార్యమవుతున్నాయి. మరోవైపు మెదడులో గందరగోళం, అయోమయం కారణంగా ఏ పనిపైనా ఏకాగ్రత ఉండడం లేదు.
టీవీ చూస్తూ విద్యార్థులు పాఠ్య పుస్తకాలు చదవడం వల్ల వారికి పరీక్షలకు పనికొచ్చే సమాచారం గుర్తుండడం లేదు. ఏకాగ్రత లోపించడంతో మెదడు పనితీరు పక్కదారి పట్టడమే ఇందుకు కారణం. విద్య, కెరీర్, వ్యాపారం.. ఇలా ఏ రంగంలో రాణించాలన్నా మెదడుపై ఒత్తిడి తగ్గించాలని, స్మార్ట్ఫోన్‌కు బానిసలు కాకుండా ఉండడమే ఇందుకు పరిష్కార మార్గమని పరిశోధకులు సూచిస్తున్నారు.