యువ

మొబైల్ డేటాను ఆదా చేసుకోండి ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక మాధ్యమాలతో మమేకం అవుతున్న యువత స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోతూ పోస్టులు, ట్వీట్లు, అప్‌డేట్లతో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తోంది. ఫేస్‌బుక్, వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి సామాజిక వేదికలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలను తీసుకువస్తూ సోషల్ మీడియాపై మరింత మక్కువను పెంచుతున్నాయి. దీంతో మొబైల్ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. ఒక నిర్ధిష్టమైన అవగాహనతో సోషల్ మీడియా సైట్లను వినియోగించుకుంటే ‘డేటా’ ఆదా అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియా యాప్స్‌ను స్మార్ట్ఫోన్‌లో వినియోగిస్తున్నపుడు డేటాను మరింతగా ఆదా చేసుకునేందుకు పలు మార్గాలున్నాయి.
ఫేస్‌బుక్ వాడినపుడు..
సోషల్ మీడియాలో దిగ్గజమైన ‘ఫేస్‌బుక్’కు విశ్వవ్యాప్తంగా యూజర్లు ఉన్నారు. వీరిలో అధికశాతం మంది రోజులో కనీసం ఒకసారైనా తమ ఫేస్‌బుక్ అకౌంట్‌ను వినియోగిస్తుంటారు. ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన ప్రతిసారీ ఎంతోకొంత మొబైల్ డేటా ఖర్చవుతుంది. గంటల తరబడి ఫేస్‌బుక్‌తో గడిపేవారు యాప్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డేటా సేవర్ ఆప్షన్’ను ఆన్ చేసుకుంటే మొబైల్ డేటా ఆదా అవుతుంది.
స్నాప్‌చాట్ వినియోగంలో..
మొబైల్ డేటాను అపరిమితంగా ఖర్చు చేసే యాప్‌లలో స్నాప్‌చాట్ కూడా ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. విభిన్నమైన ఫీచర్లను కలిగిన ఈ యాప్‌లో సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవడం వల్ల డేటాను ఆదా చేసుకునే వీలుంది.
ఇంకొన్ని చిట్కాలు..
ఇంటర్నెట్ కోసం ‘వైఫై’ను వాడడం వల్ల మొబైల్ డేటా వినియోగాన్ని మరింతగా తగ్గించుకోవచ్చు. అంతేగాక, మొబైల్ డేటాతో పోల్చితే ‘వైఫై’ డేటా మరింత చౌక. ఆన్‌లైన్ గేమ్స్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తాయి. గనుక స్మార్ట్ఫోన్‌లో ‘ఆన్‌లైన్ వీడియో గేమింగ్’కు బదులు ‘ఆఫ్‌లైన్ వీడియో గేమింగ్’ పట్ల ఆసక్తి చూపడం మంచిది. ఫోన్‌లో అధికంగా డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్లను పరిమితం చేసుకోవాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డేటా యూసేజి’ని చూసినట్లయితే మన ఫోన్‌లో ఏ యాప్ ఎంత డేటాను ఖర్చు చేస్తుందో తెలుస్తుంది. అవసరం లేనపుడు 3జి, 4జి కనెక్షన్లను టర్న్ ఆఫ్ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల డేటాను పొదుపుగా వాడుకోవచ్చు.
మేలైన ‘స్కానింగ్’ యాప్స్..
ఒక డాక్యుమెంటును అత్యవసరంగా స్కాన్ చేసి వేరొకరికి పంపాల్సి వచ్చినపుడు సరిగ్గా అదే సమయంలో మీ స్కానర్ పనిచేయని పక్షంలో ఏం చేస్తారు? అపుడు ‘నెట్ సెంటర్’ కూడా దగ్గరలో లేకుంటే ఎలా? ఇలాంటి సందర్భాల్లో ‘స్కానింగ్’ కోసం నానా తిప్పలు పడనక్కర్లేదు. డాక్యుమెంట్ల స్కానింగ్ పనిని స్మార్ట్ఫోన్‌కు అప్పజెప్పి హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కోసం ఎనె్నన్నో స్కానింగ్ యాప్స్ ‘గూగుల్ ప్లే స్టోర్’లో మన కోసం కొలువుదీరి ఉన్నాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుని స్మార్ట్ఫోన్‌ను స్కానర్‌లా వినియోగించుకుంటే డాక్కుమెంట్లను సులువుగా స్కాన్ చేసి ఇతరులకు క్షణాల్లో పంపేయవచ్చు. సులభతరమైన స్కానింగ్ ఫీచర్లతో గూగుల్ ప్లే స్టోర్‌లో మేలైన స్కానింగ్ యాప్స్ గురించి తెలుసుకోండి..
క్యామ్ స్కానర్..
గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న అనేక స్కానింగ్ యాప్‌లలో ‘క్యామ్ స్కానర్’ ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఇది చాలా ‘కూల్’గా పనిచేస్తుంది. దీని ద్వారా డాక్యుమెంట్లను స్కాన్ చేసుకుని, వాటిని నచ్చిన ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం లింక్: దఆఆఔఒ://్య్య./్హ్గతీనజూ
ఢాక్యుఫై స్కానర్..
ఈ స్మార్ట్ డాక్యుమెంట్ స్కానర్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ వినియోగదార్లకు స్కానింగ్‌లో అనేక సౌకర్యాలను అందిస్తోంది. డాక్యుమెంట్లను స్కాన్ చేయడంతో పాటు వాటిని మరింతగా మెరుగుపరచుకునే వీలుంది. స్కాన్ చేసిన ఫైల్స్‌ను ఫ్యాక్స్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది. ఇతర ఫార్మాట్లలోని డాక్యుమెంట్లను పిడిఎఫ్ ఫార్మాట్‌లోకి మార్చవచ్చు. జెపెగ్ ఫొటోను పిడిఎఫ్ ఫైల్స్‌గా కన్వర్ట్ చేసి వాటికి మన వ్యాఖ్యానాలను జత చేయవచ్చు. దీనికి లింక్: దఆఆఔఒ://్య్య./షజీ-2శ్రీ
టర్బోస్కాన్ ఫ్రీ- పిడిఎఫ్ స్కానర్..
దీని ద్వారా అన్ని రకాల డాక్యుమెంట్లను సులభంగా స్కాన్ చేసుకోవచ్చు. వేగంగా స్కాన్ చేసుకోవడంతో పాటు వాటిని మల్టీపేజ్ పిడిఎఫ్ లేదా జెపెగ్ ఫైల్స్ రూపంలో మెయిల్ చేసుకునే వీలుంది. దీని కోసం లింక్: దఆఆఔఒ://్య్య./ఖయ5ఱరీ
జీనియస్ స్కాన్- ఫిడిఎఫ్ స్కానర్..
మేలైన స్కానింగ్ యాప్‌లలో ఇది ముఖ్యమైనది. ఈ యాప్‌కు ‘క్విక్ స్కాన్ ఫీచర్’ ప్రధాన ఆకర్షణ. ఇది డాక్యుమెంట్లను త్వరితగతిన స్కాన్ చేయడంతో పాటు వాటిని ‘షేర్’ చేసుకునేలా ఉపకరిస్తుంది. నోట్స్, వైట్‌బోర్డ్సు తదితర డాక్యుమెంట్లను స్కాన్ చేసే క్రమంలో ఈ యాప్ మీ ఫోన్‌ను మల్జీపేజ్ స్కానర్‌లా మార్చేస్తుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్: దఆఆఔఒ://్య్య./య్ళూ5
కెవెఠా 2 ఫిడిఎఫ్ స్కానర్ క్రియేటర్..
ఈ కూల్ స్కానర్ యాప్ స్మార్ట్ఫోన్ కెమెరాను స్కానర్‌లా మార్చేసి డాక్యుమెంట్లను సునాయాసంగా స్కాన్ చేస్తుంది. ఈ పిడిఎఫ్ క్రియేటర్ యాప్ అన్ లిమిటెడ్ క్లౌడ్ స్టోరేజీని కూడా అందజేస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు లింక్: దఆఆఔఒ://్య్య..ఢ3తీశ్రీ
సింప్లీ స్కాన్- పిడిఎఫ్ కెమెరా స్కానర్..
ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం అధునాతనమైన స్కానింగ్ యాప్‌లలో ఇది ఒకటి. ఇది డాక్యుమెంట్లను స్కాన్ చేయడమే గాక వాటిని సులువైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసి పెడుతుంది. దీని కోసం లింక్: దఆఆఔఒ://్య్య../్గ94జఉష
ఇన్‌స్టాగ్రామ్ వాఢుతున్నపుడు..
ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ చూరగొన్న ‘ఇన్‌స్టాగ్రామ్’ ఫొటో షేరింగ్ యాప్‌లోని కొన్ని ఫీచర్లు మొబైల్ డేటాను విపరీతంగా ఖర్చు చేసేలా ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను గంటల తరబడి వినియోగించే వారు యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి ‘యూస్ లెస్ డేటా’ను సెలక్ట్ చేసుకుంటే తక్కువ డేటాను ఈ యాప్ ఖర్చు చేస్తుంది.
-వెంకట సాయి కిరణ్ మాతుకుమల్లి

డేటా తొలగించడం ఎలా..?

మీ ఫోను లేదా టాబ్లెట్ చేజారిపోయిందా? ఎవరైనా దొంగిలించారా? దానిలో పర్సనల్ డేటాతోపాటు అఫీషియల్ డేటా ఏమైనా నిక్షిప్తమై ఉందా? అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ డేటాను ఇతరులు చూడకుండా.. ప్లస్ యాప్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు కోల్పోయిన డివైస్‌ను కనుగొనడంలో మీకు సహాయం చేస్తుంది. యాప్ స్టోర్లో ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది. కంటెంట్స్ ఎలా తొలగించాలో.. డివైస్ ఎలా లాక్ చేయాలో.. ఫోన్ ఎలా తిరిగి పొందడం వంటి విషయాలను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ డివైసుల కోసం డిఫాల్ట్‌గా.. మై డివైస్ సెర్చ్ ద్వారా కనుగొనవచ్చు. ఫైండ్ మై డివైస్ టు వర్క్- మీ డివైస్ ఆన్ లేదా వైఫై, లొకేషన్ ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయండి. డివైస్‌ను ఆన్ చేసి కనెక్ట్ చేసి గూగుల్ అకౌంట్‌కు సైన్ చేయాలి. మీరు ‘నా ఫోన్‌ను కనుగొను’లో మీరు డివైస్ ఒకసారి చూస్తే.. ఇది మీ డివైస్ చివరి లొకేషన్‌ను చూపుతుంది. దీంతో డివస్ నోటిఫికేషన్ పొందుతుంది.
స్టెప్ 1: ఇప్పుడు దఆఆఔ://్య్య./ఱళ3్ళఖఢకి వెళ్లండి.
స్టెప్ 2: మీ గూగుల్ అకౌంట్‌కు సైన్ ఇవ్వండి.
స్టెప్ 3: పైన మీరు ఉపయోగించే డివైస్‌ల జాబితాను చూపుతుంది. మీరు ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లను కలిగివుంటే స్క్రీన్ పైభాగంలో కోల్పోయిన డివైస్‌ను క్లిక్ చేయండి.
స్టెప్ 4: మ్యాప్‌లో డివైస్‌ను ఎక్కడైనా చూడండి.
స్టెప్ 5: మీరు డివైస్‌ను చూడలేకపోతే.. అది అందుబాటులో ఉన్నట్లయితే.. దాని చివరి లొకేషన్‌ను చూపుతుంది.
స్టెప్ 6: ఇప్పుడు అప్లికేషన్స్‌లో ఆప్షన్స్ వదిలి సౌండ్ లాక్
మరియు ఎరేస్ చేయొచ్చు. మీరు ప్లే సౌండ్‌ను నొక్కితే.. మీరు డివైస్ వాల్యూమ్ లేదా వైబ్రేట్ చేయడానికి సెట్ చేసినప్పటికీ, మీ డివైస్‌ను 5 నిమిషాల్లో పూర్తి పరిమాణంలో రింగ్ చేస్తుంది. మీరు లాక్ నొక్కితే,, మీ డివైస్ మీ పిన్, నమూనా లేదా పాస్‌వర్డ్‌తో లాక్ చేస్తుంది. ఇంతేకాకుండా మీరు లాక్ స్క్రిన్‌ను రికవరీ మెసేజ్ లేదా ఫోన్ నెంబర్ యాడ్ చేయవచ్చు. మీరు డిలీట్ చేసి నొక్కితే మీ డేటా ఫోన్ నుంచి పర్మినెంట్‌గా తొలగించబడుతుంది.