యువ

చెప్పింది చేస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులో తలచుకొంటే చాలు.. మనం కోరుకున్నది కళ్ల ముందు ప్రత్యక్షం కావడం’ పౌరాణిక, జానపద సినిమాల్లో చూసి ఉంటాం. ప్రస్తుత సాంకేతిక యుగంలో ‘మీట’ నొక్కితే చాలు చకచకా పనులు జరగడమూ మనకు అనుభవమే. ఇలాంటి సౌకర్యానే్న ‘అలెక్సా’ అనే యాప్ మనకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే స్మార్ట్ఫోన్ వినియోగదారులు ‘ఒకే గూగుల్’ అని పిలుస్తూ కొన్ని పనులు చేయించుకోవడానికి అలవాటు పడ్డారు. ఇతే తరహాలో మనం ‘అలెక్సా’ అని పిలిస్తే చాలు ఆ ‘యాప్’ క్షణాల్లో స్పందిస్తుంది, సేవలను అందిస్తుంది. మనం చెప్పే పనులను ఆగమేఘాలపై చేసి పెడుతుంది. ఫోన్ ముట్టకుండానే ‘అలెక్సా’ అని మనం కేకేస్తే చాలు- మెసేజ్ పంపడం, కాల్ చేయడం, టైమెంతో చెప్పడం, వాతావరణ విశేషాలు అందించడం, మనకు నచ్చిన పాటను వినిపించడం.. ఇలా మనం చెప్పింది చిటికెలో చేయడం ‘అలెక్సా’కు తెలుసు. ఇందుకు మనం చేయాల్సింది ఏమిటంటే- నిత్యం మనకు అవసరమైన పనులకు దీన్ని ‘యాక్టివేట్’ చేసి ఉంచుకోవడమే. ‘క్యాబ్’ బుక్ చేయమన్నా అలెక్సా ఆ పని చేస్తుంది. ఉబర్, ఓలా వంటివి ‘అలెక్సా’తో యాక్టివేట్ చేసుకుంటే చాలు. మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఇదే ‘క్యాబ్’ను ఇంటికి రప్పిస్తుంది. మనం సంగీతం వింటుండగా, మధ్యలో ఏదైనా పాట వినాలంటే- ఆ పనిని కూడా ఇది చేసి పెడుతుంది. ఉదయానే్న నిద్ర లేపడం, మనం చెప్పే షాపింగ్ లిస్టును అందించడం, మన రోజువారీ కార్యకమాలను, జన్మదినం వంటి సందర్భాలను సమయానికి గుర్తు చేయడం కూడా దీనికి తెలుసు. అంతేకాదు.. మనకు ఇష్టమైన పుస్తకాన్ని చదివి పెడుతుంది, తాజా వార్తలను చదివి వినిపిస్తుంది. అయితే- ఈ పనులన్నింటినీ చేయడానికి మనం ఈ యాప్‌ను ఒకసారి ‘సెట్’ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పనులను మనం అడిగిన మరుక్షణం ఇది చేసేస్తుంది. బద్ధకంతో మనం నిద్రను వాయిదా వేసుకుంటే- మళ్లీ తర్వాత ‘అలారం’ మోగిస్తుంది. నిత్యం ఉపయోగపడే ఈ యాప్‌కు ‘అమెజాన్’ రూపకల్పన చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో వాడేందుకు దీనిని ‘గూగుల్ ప్లేస్టోర్’ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మోటరాలా విడుదల చేసిన మోటో ‘ఎక్స్4’ వంటి ఫోన్లతో దీన్ని ఉచితంగా పొందవచ్చు.