యువ

వైవిధ్యభరితం ‘వైర్‌లెస్ మాడ్యూల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐటీ విడిభాగాలు, ఆడియో, వీడియో, నిఘా పరికరాలను ఉత్పత్తి చేసే మన దేశానికి చెందిన ప్రముఖ బ్రాండ్ ‘జీబ్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ విప్లవాత్మక వైర్‌లెస్ మాడ్యుల్ బీటీ కనెక్ట్‌ను విడుదల చేసింది. ఈ విప్లవాత్మక బ్లూ టూత్ మాడ్యుల్ 3.5 ఎం.ఎం జాక్ కలిగిన ఏ పరికరాన్నైనా ఇన్‌పుట్ వైర్‌లెస్‌గా మారుస్తుంది.
ఈ మాడ్యుల్ కింద పేర్కొన్న పరికరాలను మీ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ లేదా కంప్యూటర్‌కు కనెక్ట్ చేస్తుంది
* 3.5 ఎంఎం లేదా ఆర్‌సిఎ ఇన్‌పుట్ కలిగిన స్పీకర్లు
* 3.5 ఎంఎం లేదా ఆర్‌సిఎ ఇన్‌పుట్ కలిగిన హోమ్ థియేటర్
* యాక్స్ ఇన్‌పుట్ కలిగిన కార్ స్టీరియో సిస్టం
* హెడ్ ఫోన్స్
బీటీ కనెక్ట్ అనే ఈ పరికరం చాలా చిన్న మరియు కాంపాక్ట్ మోడల్. దీన్ని మీరు ఏ డివైజ్‌కైనా కనెక్ట్ చేసి వైరు అవసరం లేకుండా మ్యూజిక్‌ను వినవచ్చు. ఇది చాలా సులభమైన ‘ప్లగ్ అండ్ ప్లే’ ఫీచర్‌ను కలిగి ఉన్నందున దీన్ని ఆపరేట్ చెయ్యడం కూడా చాలా సులభం. ఇందులో మైక్ కూడా అమరి ఉండడంతో మీరు కనెక్ట్ చేసిన స్మార్ట్ ఫోన్ నుంచి కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఆడియో ఔట్‌పుట్ కోసం చిన్నగా, అందంగా కన్పించే ఈ మాడ్యుల్‌లో 3.5 ఎం.ఎం జాక్ కూడా వుంటుంది. ఇందులో మీడియా కంట్రోల్ బటన్, ఆన్- ఆఫ్ ఫీచర్, వాల్యూం కంట్రోల్ బటన్, ఎంపీ త్రీ ప్లే బ్యాక్ కోసం మైక్రో ఎస్.డి స్లాట్ కూడా ఉన్నాయి. ఈ మాడ్యుల్ ఎంత చిన్నగా డిజైన్ చెయ్యబడిందంటే, దీన్ని మీరు మీ దుస్తులపై ఎక్కడైనా పిన్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఏ పరికరానికైనా కనెక్ట్ చేసి వాటిని పూర్తిగా వైర్‌లెస్ పరికరాలుగా మార్చుకోవచ్చు. ఇంట్లో వినోదాన్ని ఖరీదైనదిగా కన్పించే విధంగా మార్చుకోవాలని భావించే వారికి ఎంతో ఉపయోగకరమైనది. దీన్ని స్పీకర్లు, హెడ్‌ఫోన్స్‌కు కనెక్ట్ చేస్తే చాలు, అవి వైర్‌లెస్ పరికరాలుగా మారిపోతాయి.
ఈ బ్లూత్ మాడ్యూల్ లాంచింగ్ సందర్భంగా జీబ్రానిక్స్ ఇండియా డైరెక్టర్ ప్రదీప్ దోషి మాట్లాడుతూ- మీరు ఏదైనా వైర్లెస్ పరికరాన్ని ఉపయోగించాలని కోరుకుంటే ముందుగా గుర్తుకువచ్చేది జీబ్రానిక్స్. ఈ విషయంలో ఎల్లప్పుడూ ముందుండే జీబ్రానిక్స్ ఇండియా ఇప్పుడు కూడా ఈ బిటి కనెక్ట్ పేరిట చిన్నపాటి వైర్లెస్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వైర్లెస్ మార్కెట్‌లో మరో విప్లవానికి శ్రీకారం చుట్టింది. ‘స్మార్ట్’ అన్న పదానికి ఇది మరో కొత్త అర్థాన్నిస్తుంది. వైర్లెస్ పరికరాలను ఇష్టపడేవారి ఊహలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా, ఏ పరికరాన్నైనా వైర్లెస్ పరికరకంగా మార్చే ఈ మాడ్యుల్‌ను రూపొందించామని అన్నారు.
ఈ మాడ్యూల్‌లో వున్న బ్లూటూత్ 10 మీటర్ల దూరం వరకు ఎటువంటి అంతరాయం లేకుండా తరంగాలను ప్రసారం చెయ్యగలదు. ఇక ఇది క్లిప్ డిజైన్‌లో రూపకల్పన చెయ్యడం వల్ల చేతితో పట్టుకోవలసిన అవసరం లేకుండా సులభంగా ఎక్కడైనా, దేనికైనా అతికించి సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో వస్తున్న ఈ బ్లూత్ మాడ్యుల్ దేశంలోని అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తుంది.