యువ

గూగుల్ ఫెయిలైతే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు విశ్వవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ‘గూగుల్’. అంతర్జాలంలో విహరించేవారంతా ‘గూగులమ్మ’ ఒడిలో సేద తీరాల్సిందే. అంతగా మనం అలవాటు పడ్డ ‘గూగుల్’ ఎప్పుడైనా మొరాయిస్తే ఏం చేయాలి? ఇంటర్నెట్ యూజర్లకు అత్యంత ఉపయోగపడే ఉత్తమ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’. ఏ విషయం అయినా సరే ఠక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్ ఇది. అన్నింటికీ మించి ఉచిత సేవలు అందించడంలో ముందుంటుంది. ఇక సమాచారాన్ని సెర్చ్ చేసే విషయానికొస్తే.. ఆటోమేటిగ్గా గూగుల్‌లోకి వెళ్ళేందుకు ఎంతో కచ్చితత్వంతో ప్రోగ్రామ్ చేయబడి ఉంది. ఇంతటి ప్రఖ్యాతి పొందినందు సెర్చ్ ఇంజన్ కావడం వల్లే గూగుల్ ద్వారా మనం ప్రపంచ వ్యాప్తంగా లేదా మనకు అవసరమైన మేరకు కావాల్సిన సమాచారాన్ని పొందగలం. కొన్ని సందర్భాల్లో ఇందులో అవసరమైన కొంత సమాచారాన్ని పొందలేకపోవచ్చు. పరీక్షల సమయాల్లో విద్యార్థులు ఇతర సెర్చ్ ఇంజన్లను ఆశ్రయించాల్సిన అవసరం ఉంటుంది. గూగుల్ నుంచి సమాచారాన్ని పొందలేని సమయాల్లో ఇతర సెర్చ్ ఇంజన్ల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అలాంటి సెర్చ్ ఇంజిన్లు మీ కోసం.

DuckDuck Go.

ఈ సెర్చ్ ఇంజన్‌లోని ప్రధాన ఫీచర్‌లలో ఒకటి.. వినియోగదారుల డేటాను ట్రాక్ చేయకపోవడం. ఇది ‘ప్రకటనల లేని’ (యాడ్ ఫ్రీ) సెర్చ్ ఇంజన్ కావడంతో మనం విసుగు చెందే అవసరం ఉండదు. ప్రైవేట్ బ్రౌజింగ్ అనేది మనం ఊహించినదానికంటే ఎక్కుగానే ఉంటుంది.

Bing..

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ‘బింగ్’ అనేది రెండవ ప్రసిద్ధి చెందిన సెర్చ్ ఇంజన్. దీని మార్కెట్ వాటా 15 శాతం ఉంటుంది. ఇందులో వీడియో సెర్చ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఆటో కంప్లీట్ సజిషన్ రెండు రెట్లు ఎక్కువగా ఇస్తుంది.

Dogpile..

ఇతర సెర్చ్ ఇంజన్ల నుంఛి సమాచారాన్ని, లింక్‌లను మరింతగా తెలుసుకోవడంలో ఇది పురాతన వెబ్ సెర్చ్ ఇంజిన్ అని చెప్పవచ్చు. ఇది గూగుల్, యాహూ, యానె్డక్స్‌తోపాటు ఇతర వాటితో సహా అన్ని లింక్స్‌ను పొందుతుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మరియు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌కు కూడా దీని నుంచి టూల్ బార్ ఉంటుంది.

Yandex...

రష్యాకు చెందిన ఈ సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు దాదాపు సమానమైనదని భావించవచ్చు. దీన్ని మిగతా దేశాలకంటే రష్యాలోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇది లాజికల్ ఫార్మట్ ఫలితాలను అందజేస్తుంది. ఫొటోలు, వీడియోలు, మెయిల్స్, మ్యాప్‌లతో పాటు ఇతర సేవలను సైతం అందిస్తుంది. 1997 నుంచి సెర్చ్ ఇంజన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Ask.com..

సెర్చ్ ఇంజిన్ కంటే.. ఇది క్వశ్చన్ ఆన్సర్ సర్వీస్‌గా ఉపయోగపడుతుంది. సెర్చ్ బార్లో మనం సందేహాలు అడిగినప్పుడు వెంటనే సమాధానం ఇస్తుంది. ఆర్ట్స్, లిటరేచర్, జియోగ్రఫీ, ఎడ్యుకేషన్ అండ్ పాలిటిక్స్ నుంచి టెక్నాలజీ, సైన్స్ మరియు బిజినెస్ క్విటీస్ వరకు ఉన్న అంశాలను మనం ఇందులో చూసే అవకాశం ఉంటుంది.

Gibiru.. Gibiru....

ఈ సర్వీస్ గూగుల్ నుంచి సెన్సార్ చేయబడిన కంటెంట్ లాగుతూ ‘షోకాజ్’ చేస్తుంది. ఇక్కడ ప్రైవసీ సమస్య అనేది దాని అనామక ప్రాక్సీ సెర్చ్ ఇంజిన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఇది మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఎక్స్‌టెన్షన్‌ను కలిగి వుంటుంది. అన్ సెన్సార్డ్ కంటెంట్ కోసం అవాంఛిత సెర్చ్‌కు ఉచితంగా ఉంటుంది.

Wolfram alpha..

గణనీయమైన వాస్తవాలను, విశ్వసనీయమైన కళాశాల ప్రచురణలు, గ్రంథాలయాలు, క్రంచ్ బస్, ఎఫ్‌ఎఎ, బెస్ట్ బై నుంచి ఈ సర్వీసు గణన వాస్తవాలతో డేటాతో వస్తుంది.

క్రియేటివ్ కామన్స్ సెర్చ్

మన సొంత వెబ్‌సైట్స్ కోసం ఉచిత కాపీరైట్ చిత్రాలను కనుగొనేటప్పుడు ఈ సర్వీస్ చాలా సులభమైంది. ఇందుకు కావలసిందల్లా ఇమేజ్ పేరు టైప్ చేసి సెర్చ్‌పై క్లిక్ చేయడమే.