యువ

కొత్తకొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోటో ఎక్స్-4..
రెండు విభిన్నమైన రూపాలతో కొన్ని విశిష్టతలతో వినియోగదారులను అలరించేందుకు ప్రఖ్యాత ‘మోటరోలా’ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి తాజాగా ‘మోటో ఎక్స్-4’ స్మార్ట్ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటో హబ్ దుకాణాల్లో నలుపు, నీలిరంగుల్లో లభిస్తోంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ వేరియంట్ ధర 20,999 రూపాయలుగా, ఫోర్ జీబీ ర్యామ్, 64 జీబీ మొమొరీ వేరియంట్ ఫోన్ ధర 22,999 రూపాయలుగా నిర్ణయించారు. డ్యూయల్ ఆటో ఫోకస్ పిక్సెల్ టెక్నాలజీతో 12 ఎంపీ ప్లస్ 8 ఎంపీ కెమెరా, లో లైట్ మోడ్ ఫీచర్ ఉన్న 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1.1 నుగోట్ ఆపరేటింగ్ సిస్టం, 5.2 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ రక్షణ, ఆక్టాకోర క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, ఐపీ 68 వాటర్/ డస్ట్ రెసిస్టెన్స్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో పవర్ చార్జర్ వంటి ఫీచర్లు మోటో ఎక్స్-4లో ఉన్నాయి.
సెల్పీ లైట్ కెమెరాతో..
16 మెగా పిక్సెల్ సామర్థ్యంతో అదిరిపోయే సెల్ఫీలు తీసుకునేందుకు విభిన్నమైన ‘సెల్ఫీ లైట్’తో ‘రెడ్మీ వై1’ కెమెరా ఫోన్ మార్కెట్‌లో రంగ ప్రవేశం చేసింది. ఫోన్‌లో ఉండే ‘బ్యూటి ఫై 3.0’ ఫీచర్‌తో మనం సెల్ఫీలకు విభిన్నమైన హంగులను సమకూర్చుకునే వీలు ఈ ఫోన్‌లో ఉంది. దీని తెర పరిమాణం 5.5 అంగుళాలు కాగా, 1280 న 720 రిజల్యూషన్ పిక్సల్స్, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఇది అందుబాటులో ఉంది. బ్యాటరీ సామర్థ్యాన్ని ‘మియూ’ ఇంటర్‌ఫేస్‌తో పెంచుకునే వీలుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత మొమరీ, క్వాల్‌కమ్ శ్నాప్ డ్రాగన్ 534 ప్రాసెసర్ వంటి ఆకర్షణలతో లభించే ‘రెడ్మీ వై1’ ధరను 10,999 రూపాయలుగా నిర్ణయించారు.
మోటో ట్యాబ్
‘మోటో ట్యాబ్’ పేరుతో ప్రఖ్యాత మోటరోలా సంస్థ తాజాగా ఓ ట్యాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 10.1 అంగుళాల తెర, 1920 న 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 2జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మొమరీ, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఎన్ 7.1 ఓఎస్‌తో పనిచేసే ఈ సరికొత్త ట్యాబ్ ధరను 19,000 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులోని మొమరీ సామర్థాన్ని 128 జీబీ వరకూ పెంచుకునే అవకాశం ఉంది.
గూగుల్ బడ్స్
కొన్ని ప్రత్యేక సౌకర్యాలతో విభిన్నమైన ‘బడ్స్’ను గూగుల్ సంస్థ అందుబాటులోకి తెస్తోంది. అలరించే సంగీతం, రియల్‌టైమ్ ట్రాన్స్‌లేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ‘యాపిల్’ ఎయిర్‌పాడ్స్‌కు పోటీగా రూపొందిన గూగుల్ బడ్స్ పూర్తిస్థాయి వైర్‌లెస్ బడ్స్ కాకున్నా, అర్థం కాని భాషను అనువాదం చేసుకునే సౌకర్యం ఇందులో ఉంది. కుడివైపు ‘బడ్’ను నొక్కిపెడితే గూగుల్ అసిస్టెంట్ ద్వారా అనువాద సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త తరహా ఇయర్ బడ్స్ వినియోగదారులను అలరించడం ఖాయమని గూగుల్ భరోసా ఇస్తోంది.
ఇన్‌ఫినిక్స్ ఆవిష్కరణలు
చైనాకు చెందిన ‘ఇన్‌ఫినిక్స్ మొబైల్’ సంస్థ తన ‘జీరో’ సీరీస్‌లో రెండు భిన్నమైన స్మార్ట్ఫోన్లను మార్కెట్‌లోకి తెచ్చింది. జీరో-5 ఫోన్ ధరను రూ. 17,999గాను, జీరో-5 ప్రో రకం ధరను 19,999 రూపాయలుగాను నిర్ణయించారు. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ‘్ఫ్లప్‌కార్టు’లో ఇవి ఈనెల 22 నుంచి వినియోగదారులకు లభిస్తాయి. నలుపు, ఎరుపు రంగుల్లో లభించే ‘జీరో-5’ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 5.98 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్ ప్లే, ప్రీమియం డ్యూయల్ రియర్ కెమెరా (12 ఎంపీ ప్లస్ 13 ఎంపీ), 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,350 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన చార్జింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి విశిష్టతలు ఉన్నాయి. ఇక ‘జీరో-5 ప్రో’ రకం ఫోన్లు బంగారు రంగులో లభిస్తుంది. 128 జీబీ మెమరీతో పాటు ‘జీరో-5’ లోని ఫీచర్లన్నీ ఇందులో ఉంటాయి.
అడ్మయిర్ యూనిటీ
ఇపుడు ఎక్కువ మంది వినియోగించే 4జి నెట్‌వర్క్‌కు అనుగుణంగా ‘అడ్మయిర్ యూనిటీ’ స్మార్ట్ఫోన్‌ను ప్రఖ్యాత ‘జెన్ మొబైల్స్’ రూపొందించి వినియోగదారుల కోసం మార్కెట్‌లోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ నౌగట్ ఓఎస్, 5 అంగుళాల డిస్‌ప్లే, 5 ఎంపీ బ్యాక్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంతర్గత మెమరీ, 13 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2,300 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం, వైఫై కనెక్టివిటీ వంటి విశిష్టతలు ఉన్న ఈ ఫోన్ ధర 5,099 రూపాయలు. ఇందులోని అంతర్గత మెమరీని 32 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషలకు ఇది సపోర్ట్ చేస్తుంది.
విభిన్నంగా వివో వి7ప్లస్
16 ఎంపీ బ్యాక్, 24 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో 5.99 అంగుళాల టచ్ స్కీన్, ఫేస్ అన్‌లాక్, ఆండ్రాయిడ్ నౌగట్ ఓఎస్, 4 జీబీ ర్యామ్, 65 జీబీ అంతర్గత మెమరీ, 3225 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం వంటి భిన్నమైన ఫీచర్లతో వివో సంస్థ భారతీయ మార్కెట్‌లోకి ‘వివో వి7 ప్లస్’ రకం స్మార్ట్ఫోన్‌ను పరిచయం చేసింది. ప్రముఖ సెల్‌ఫోన్ దుకాణాలతో పాటు అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో ముందుగా బుక్ చేసుకుని దీన్ని పొందవచ్చు. ఈ ఫోన్ ధరను 21,990 రూపాయలుగా నిర్ణయించారు. నీలిరంగులో సరికొత్త ఫీచర్లతో అలరించే ఈ ఫోన్ ఈనెల 15 నుంచే మార్కెట్‌లో సందడి చేస్తోంది.