యువ

ఓ యువతా.. మేలుకో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ యువతా.. మేలుకో..
ఆశయం ఘనం
ఆచరణ శూన్యం
ఆరంభశూరత్వమే నిత్యకృత్యం

నిర్లక్ష్యపుయువత జీవితం
దారం తెగిన గాలిపటం
దారితప్పిన యువత భవితకు
దారిచూపే చుక్కాని ‘లక్ష్యం’

అజ్ఞానం చేసే అపకారం అంతంత మాత్రమే
నిర్లక్ష్యం నిట్టనిలువునా ముంచుతుంది
కోట్లు సంపాదించడం కాదు
పొదుపు చేయడం నేర్చుకో
నిత్యం సుఖపడడం కాదు
కష్టం విలువ తెలుసుకో

యువత జాతి భవితను
మందులో ముంచెయ్యరాదు
యువత దేశ ప్రగతిని
మత్తుకు అమ్మెయ్యరాదు

నిర్లక్ష్యపు చవిటినేల
నీ ఆశల్ని మొలకెత్తనీదు
నిర్లక్ష్యపు మర్రినీడ
నీ ఆశయాల్ని చిగురియ్యనీదు
ఓ యువతా.. మేలుకో
నిర్లక్ష్యాన్ని ఛేదించు
నీ ప్రయత్నం సాగించు
నీ లక్ష్యాన్ని సాధించు

అలంకారం విజయకుమార్ రాజు, గుడ్లూరు సెల్: 96037 52929