యువ

మొబైల్స్ వెనుక నమ్మలేని నిజాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజుల్లో అన్ని వయసుల వారికీ మొబైల్ నిత్యావసర వస్తువుగా మారిన సంగతి తెలిసిందే. ఎవరూ మొబైల్ లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచం డిజిటల్ మీడియా వైపు శరవేగంగా పరుగులు పెడుతున్న నేపథ్యంలో మొబైళ్ల వాడకం జీవితంలో ముఖ్య భాగంగా మారిపోయింది. ఫోన్ల వాడకం ఓ వ్యసనంలా మారడంతో వీటి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
టూత్‌బ్రష్ వర్సెస్ మొబైల్
ప్రపంచ జనాభా సుమారు 6.8 బిలయన్లు అనుకుంటే అందులో టూత్‌బ్రష్ వాడే వారి సంఖ్య 3.5 బిలియన్లు. మరి.. మొబైల్ వాడే వారి సంఖ్య ఎంతో తెలుసా..? అక్షరాలా నాలుగు బిలియన్లు..!
110 సార్లు ఫోన్ అన్‌లాక్!
స్మార్ట్ఫోన్‌లను వినియోగిస్తున్న వారిలో సగటున ఒకరు రోజుకు 110 సార్లు తన ఫోన్‌ను అన్‌లాక్ చేస్తున్నట్లు ఓ సర్వే తెలిపింది.
టాయ్‌లెట్ల కంటే..
* ప్రపంచ వ్యాప్తంగా మరుగుదొడ్ల కంటే మొబైల్ ఫోన్‌ల సంఖ్యే ఎక్కువ.
* బ్రిటన్‌లో సంవత్సరానికి దాదాపు లక్ష ఫోన్‌లను టాయ్‌లెట్‌లలో జారవిడిచేస్తున్నారట!
* జపాన్‌లో వినియోగిస్తున్న 90 శాతం ఫోన్లు వాటర్‌ఫ్రూఫ్ ఫీచర్‌ను కలిగి ఉండేవే.
బ్యాక్టీరియా
టాయలెట్ హ్యాండిల్స్‌తో పోలిస్తే మొబైల్ ఫోన్లు 18 శాతం ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి వుంటాయి.
నిద్రలేమి
మొబైల్ పోన్ రేడియేషన్ వల్ల నిద్రలేమి, తలనొప్పి ఇంకా మానసిక గందరగోళం వంటి అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం వుంది.
* మూత్రం ద్వారా మొబైల్ ఫోన్‌లను చార్జ్ చేసే విధానాన్ని కనుగొన్నారు.
* మాల్‌వేర్ దాడులు ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్‌లపైనే జరుగుతున్నాయి.
* స్మార్ట్ఫోన్ వాడే వారు నెలకు సగటున 150 ఫొటోలను తీస్తుంటారు. అత్యాధునిక సౌకర్యాలున్న మొబైల్ ఫోన్ల ద్వారా యూజర్లు ఒక ఏడాదిలో సగటున 130 బిలయన్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. డౌన్‌లోడ్ చేసిన వాటిలో 58 శాతం యాప్స్ నిరుపయోగంగానే ఉంటున్నాయి. 12 వారాలకు మించి వినియోగిస్తున్న యాప్‌ల సంఖ్య చాలా తక్కువే.
* మొబైల్ ఫోన్లను వాడుతున్న వారిలో 57 శాతం మంది ‘అలారం’ సౌకర్యాన్ని వినియోగిస్తున్నారు. 50 శాతం మంది చేతివాచీలను అస్సలు ఉపయోగించడం లేదు.
* ఏటా 33 శాతం స్మార్ట్ఫోన్లు పగిలిపోవడం లేదా దొంగలపాలు కావడంతో యూజర్లు కొత్తవి కొనుక్కుంటున్నారు.