యువ

‘యాపిల్’ నుంచి వినూత్న ఐపాడ్ (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కెట్‌లోకి సరికొత్త ఫోన్లు, ట్యాబ్‌లు, ఐపాడ్‌లు వచ్చాయంటే చాలు వాటిని సొంతం చేసుకునేందుకు అందరిలోనూ ఆరాటమే.. విభిన్నమైన ఫీచర్ల కోసం అంతులేని అనే్వషణ.. అందుకే వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మొబైల్ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తున్నాయి. ప్రపంచంలోనే తొలి ట్రిలియన్ డాలర్ కంపెనీగా అవతరించబోతున్న ‘యాపిల్’ విక్రయాల పరంగా ఆశించిన స్థాయిని అందుకోలేక పోతోంది. అయితే, ఇటీవల విడుదల చేసిన కొత్త ఐపాడ్‌ల అమ్మకాలు ఆశాజనకంగా ఉండడంతో ఇదే దారిలో పయనించాలని ‘యాపిల్’ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐపాడ్‌లకు మరింత గిరాకీని సృష్టించేందుకు ‘బడ్జెట్ ఫ్రెండ్లీ’ ధరల్లో వినియోగదారులను ప్రసన్నం చేసుకునేందుకు ‘యాపిల్’ వ్యూహరచన చేసింది. వచ్చే ఏడాది విడుదల చేయబోతున్న 9.7 ఇంచ్ ఐపాడ్ మోడల్ ధరను పాతిక వేల రూపాయల లోపుగా నిర్ణయించాలని ‘యాపిల్’ భావిస్తోంది. 2018లో విడుదల కానున్న కొత్త వెర్షన్ ఐపాడ్ ప్రస్తుత మోడల్‌తో పోల్చితే 4,500 రూపాయల తగ్గింపుతో లభించే అవకాశం ఉంది. ప్రస్తుత మోడల్ ఐపాడ్ ధర 28,900 రూపాయలు కాగా, వచ్చే ఏడాది విడుదలయ్యే ఐపాడ్ ధర 24వేల రూపాయలుగా ఉండవచ్చు. ఇదే నిజమైతే ప్రపంచ వ్యాప్తంగా ‘యాపిల్’ ఐపాడ్‌లకు డిమాండ్ భారీగా పెరిగే వీలుంది. ఈ ఏడాది మార్కెట్‌లోకి యాపిల్ విడుదల చేసిన 9.7 ఇంచ్ ఐపాడ్ వైఫై, వైఫై సెల్యులార్ అనే రెండు రకాల్లో లభిస్తోంది. వైఫై వేరియంట్ ధర రూ. 28,900గా, సెల్యులార్ వేరియంట్ ధర రూ. 39,900గా ఉంది. మొదటి రకాన్ని 32 జీబీ స్టోరేజీతో, రెండో రకాన్ని 128 జీబీ స్టోరేజీతో వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.

కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో..
దేశీయంగా ప్రాచుర్యం పొందిన ‘మైక్రోమాక్స్’ సంస్థ తాజాగా ‘కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రో’ రకం స్మార్ట్ఫోన్‌ను విడుదల చేసింది. డ్యూయల్ సెల్ఫీ కెమెరాలతో లభించే ఈ ఫోన్ ధరను 13,999 రూపాయలుగా నిర్ణయించారు. ఈ కొత్తరకం ఫోన్ విక్రయాలు ఇప్పటికే జోరందుకున్నాయి. భారీ బెజెల్ లెస్ డిస్‌ప్లేతో పాటు డ్యూయల్ కెమెరా దీనిలోని ఆకర్షణలు. పోర్ట్రయిట్ మోడ్, ఫేస్ బ్యూటీ, ఆటో సీన్ డిటెక్షన్, ఫేస్ గ్యాలరీ, టేల్ ఆల్బమ్ ఇందులో ఉన్నాయి.
ప్రత్యేకతలు..
5.7 అంగుళాల ఫుల్ విజన్ డిస్‌ప్లే 1440 ఇన్‌టూ 720 పిక్సల్స్, స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగహెడ్జ్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ , ఆండ్రాయిడ్ 7.1 నోగట్, డ్యూయల్ సిమ్, 16 మెగా పిక్సల్ వెనుక కెమెరా, 20.8 మెగా పిక్సల్‌తో డ్యూయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జీ వీవోఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ అదనపు ఆకర్షణలు.

రెడ్‌మి 5ఎ వచ్చేసింది..
చైనా మొబైల్ దిగ్గజమైన ‘గ్జియామీ’ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి ‘రెడ్‌మి 5ఎ’ స్మార్ట్ఫోన్‌ను తాజాగా పరిచయం చేసింది. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభించే ఈ స్మార్ట్ఫోన్‌లో అయిదు అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే అదనపు ఆకర్షణగా ఉంటుంది. 3000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజి మెమరీ కెపాసిటీ ఇందులోని ప్రత్యేకతలు. 2 జీబీ మోడల్ ధర 4999 రూపాయలుగా, 3 జీబీ రకం ధర 6999 రూపాయలుగా నిర్ణయించారు.

ఆనర్ 7ఎక్స్..
చైనాకు చెందిన ‘హువావే’ కంపెనీ భారతీయ మార్కెట్‌లోకి ‘హానర్ 7ఎక్స్’ పేరిట విభిన్నమైన మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది. 32 జీబీ అంతర్గత మెమరీ కలిగిన ఫోన్ ధరను 12,999 రూపాయలుగా, 64 జీబీ మెమరీ కలిగిన రకం ధరను 15,999 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో మెమరీ సామర్థ్యాన్ని మైక్రో ఎస్‌డి కార్డు సాయంతో 256 జీబీ వరకూ పెంచుకునే వీలుంది. హానర్ 7ఎక్స్‌లో 5.93 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, 16 ఎంపి ప్లస్ 2 ఎంపి వెనుక కెమెరా, 8 ఎంపి ముందు కెమెరా, 4 జిబి ర్యామ్, అక్టాకోర్ కిరిన్ 659 ప్రాసెసర్, 3340 ఎంఎహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ నౌగట్ ఓఎస్ వంటి అదనపు ఆకర్షణలున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది.

నూతన సంవత్సర కానుక ‘నోకియా-9’
ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ‘మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017’లో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ తన మొదటి విడత (నోకియా 6, నోకియా 5, నోకియా 3) ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కొత్త సంవత్సర కానుకగా నోకియా-9 విడుదల కానుంది. నోకియా-8, నోకియా-2 ఫోన్లు ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతుండగా, నోకియా-7 విడుదల కావాల్సి వుంది. ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి నోకియా పవర్ యూజర్ ఇటీవల ప్రకటించిన నివేదిక ప్రకారం నోకియా-7 విడుదల విశ్వ విపణిలో 2018లో ఉండబోతోంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో మాత్రమే లభ్యమవుతోంది. ఇదే సమయంలో నోకియా-9ను కూడా 2018 ఆరంభంలో హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం వుంది.
నోకియా-7 విశిష్టతలు..
5.2 అంగుళాల 1080 పిక్సెల్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టమ్ (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్, 630 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జిబి, 6 జిబి) ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో ఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజి కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 16మెగా పిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కార్ల్‌జిస్ ఆప్టిక్స్ టెక్నాలజీ, 360 డిగ్రీ క్రిస్టల్ క్లియర్ సౌండ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ.
నోకియా-9 ప్రత్యేకతలు..
5.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వ్‌డ్ గ్లాస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్, 13 మెగా పిక్సల్ డ్యూయల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 8 జిబి ర్యామ్, ఈ ఫోన్ ధర భారతీయ మార్కెట్‌లో రూ.45,000 వరకు ఉండవచ్చు.