యువ

ఉద్యోగాలన్నీ రోబోలవే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ శక్తిని యాంత్రిక శక్తి జయించబోతోందా? మనిషికే సాధ్యమనుకున్న అనేక పనులను యంత్రాల ద్వారా నిర్వహించగలిగే రోజు రాబోతోందా? నేడు ప్రపంచ వ్యాప్తంగా రోబోలే అన్నింటా అడుగుపెడుతున్న నేపథ్యంలో రానున్న 30 సంవత్సరాల కాలంలో ఈ చిన్ని యంత్రాలు నిరుపమానంగా మారబోతున్నాయి. మనుషులు మాత్రమే చేయగలిగే దాదాపు అన్ని పనులనూ రానున్న మూడు దశాబ్దాల కాలంలో రోబోలే చేయకలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ మేథస్సులో ఇటీవల కాలంలో సాధించిన ప్రగతి ఇందుకు ప్రధానంగా దోహదం చేయబోతోంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా జనాభాకు ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. రానున్న 30 సంవత్సరాల్లో అటు యంత్రాలు, ఇటు కంప్యూటర్లు మనుషులు చేసే దాదాపు అన్ని పనులనూ చేసేస్తాయని, టెక్నాలజీ అభివృద్ధి వేగాన్ని బట్టి చూస్తే ఇది అనివార్యంగానే కనిపిస్తోందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. దాదాపు యంత్రాలే అన్ని పనులనూ చేసే యాంత్రిక యుగం వేగంగా సమీపిస్తోందని, ఈ నేపథ్యంలో యంత్రాలే అన్ని పనులు చేసేస్తే పెరిగిపోయే నిరుద్యోగానికి పరిష్కారం ఏమిటన్నది కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతానికి ఊహగానే కనిపిస్తున్నా, 30ఏళ్ల అనంతర కాలంలో ఇది వాస్తవమే అవుతుందని, అలాంటప్పుడు మానవాళి పరిస్థితి ఏమిటన్నది కూడా ఇప్పటినుంచే ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే అనేక రంగాల్లో కృత్రిమ ఇంటలిజెన్స్, టెక్నాలజీలు వేగవంతం అవుతున్నాయి. దీని కారణంగా ఎన్నో చిన్న చిన్న ఉద్యోగాలు లేకుండాపోయాయి. రోబో టెక్నాలజీ విస్తరిస్తున్న కారణంగా తలెత్తే అనేక సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే దిశగా ఇప్పటినుంచే మానవాళి సన్నద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు.
*