యువ

కొన్ని ఫోన్లకు వాట్సాప్ బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి సాంకేతిక యుగంలో ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌కు సంబంధించి వేగంగా దూసుకుపోతున్న యాప్ ఏది అంటే- అందరూ చెప్పే సమాధానం వాట్సాప్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ తనకు పోటీ ఏదీ లేదని సగర్వంగా ఇది చాటి చెబుతోంది. అయితే- వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్‌లలో నిలిచిపోనున్నాయి. త్వరలో కొన్ని ఫోన్‌లలో మాత్రం ఈ యాప్ పనిచేయకుండా వాటికి సపోర్టును నిలిపివేస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ దాటితే బ్లాక్‌బెర్రి ఓఎస్, బ్లాక్‌బెర్రి 10ఓఎస్ ఉన్న ఫోన్లలో, విండోస్ ఫోన్ 8.0 ఓఎస్ ఉన్న ఫోన్లలో వాట్సప్ ఇక పనిచేయదు. 2018 డిసెంబర్ 31 నాటికి నోకియా ఎస్ 40 ఓఎస్ ఉన్న ఫోన్‌లలో ఈ యాప్ సేవలు ఆగిపోతాయంటున్నారు. 2020 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ఆండ్రాయిడ్ 2.3.7 ఓఎస్ ఉన్న ఫోన్లలోనూ ఇది పనిచేయదు. ఓఎస్ ఉన్న ఫోన్లను వాడేవారు కొత్త ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అయితే వాట్సప్ సేవలకు ఎలాంటి ఆటంకం ఉండదు. కొన్ని రకాల ఫోన్లకు ఎటువంటి అప్‌డేట్ కాని, బగ్స్ పిక్స్ చేయడం కాని జరగదని వాట్సప్ తేల్చిచెప్పింది. కొత్త ఫీచర్ల అప్‌డేట్లు సైతం ఈ ఫోన్‌లకి పనిచేయవని తెలిపింది.