యువ

‘నెట్’ వేగం ఎంతో తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో ఇంటర్నెట్ సౌకర్యాన్ని వాడుతున్న వినియోగదార్లకు ఇంటర్నెట్ స్పీడ్‌ను అంచనా వేసే ‘ఓక్లా’ అనే సంస్థ ఓ శుభవార్తను అందించింది. నవంబర్ మాసానికి సగటు మొబైల్ ఇంటర్‌నెట్ వేగం దాదాపు రెట్టింపు అయిందని, ఇది భారతీయ వినియోగదారులకు శుభవార్తేనని తెలిపింది. కాగా, మొబైల్ ఇంటర్‌నెట్ స్పీడ్‌లో భారత్ 109వ స్థానంలో నిలచింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్‌లో 76వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఇండెక్స్ స్పీడ్ టెస్ట్ నవంబర్ నెల గణాంకాలను ఓక్లా విడుదల చేసింది. దీని ప్రకారం సగటు మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్ 7.65 ఎంబిపిఎస్‌గా నిలిచింది.
బ్రాడ్ బ్యాండ్ వేగం 76వ స్థానంలో
ప్రపంచ వ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ వేగం 76వ స్థానంలో ఉంది. ఈ సగటు జనవరి నాటికి 12.12 పాయింట్లు ఉంటే, నవంబర్‌లో 18.82 పాయింట్లుగా నిలిచింది ఓక్లా తెలిపింది. మొత్తం 133 దేశాల్లో మొబై నెట్ వేగాన్ని విశే్లషిస్తూ, నెట్ సేవల సంస్థ ఓక్లా ఈ విషయాన్ని వెలువరించింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో నార్వే నిలిచింది. నార్వేలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ సగటు డౌన్‌లోడ్ వేగం 62.66 ఎంబిపిఎస్‌గా ఉంది. ఇక ల్యాండ్‌లైన్, బ్రాడ్ బ్యాండ్ సేవలకు వచ్చేసరికి 153.85స్పీడ్‌లో సింగపూర్ ప్రథమ స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో నెదర్లాండ్స్ (53.01 ఎంబిపిఎస్‌ఔ), మూడవ స్థానంలో ఐస్‌ల్యాండ్ (52.78 ఎంబిపిఎస్), నాలుగవ స్థానంలో సింగపూర్ (51.50 ఎంబిపిఎస్) నిలిచాయి.