యువ

ఇపుడంతా ‘డేటా’ హవా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి సాంకేతిక యుగంలో జాబ్ మార్కెట్ అంతా వైవిధ్యం, నైపుణ్యంపైనే నడుస్తోంది.. ఓ నాలుగు కొత్త నైపుణ్యాలు సాధిస్తేనే ఉద్యోగాలకు అవకాశం.. ఎంతటి ప్రతిభ ఉన్నా కాలానుగుణంగా నైపుణ్యం పెంపొందించుకుంటేనే ‘కెరీర్ కలలు’ సాకారం అవుతాయన్నది కాదనలేని వాస్తవం.. ఈ క్రమంలో కంపెనీల్లో మారుతున్న సాంకేతిక, వ్యాపార, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఉద్యోగార్థులకు ఎన్నో కొత్త కోర్సులు స్వాగతం పలుకుతున్నాయి.. నేడు పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ‘డేటా సైన్స్’ నిపుణులకు అనూహ్యంగా డిమాండ్ పెరుగుతోంది.. ‘డేటా సైన్స్’ను ఓ స్పెషలైజేషన్‌గా ఎంచుకుని, మంచి నైపుణ్యాలతో ‘జాబ్ మార్కెట్’లోకి ప్రవేశిస్తే చాలు ఆకర్షణీయమైన జీతభత్యాలతో అద్భుతమైన ప్యాకేజీలతో కొలువులకు కొదవేలేదు.. ఈ కారణంగానే నేటి యువతకు ‘డేటా సైన్స్’ కెరీర్ పరంగా ఆశాదీపంలా మారింది..
బహుళజాతి సంస్థలైనా, దేశీయ సంస్థలైనా వాణిజ్యపరంగా నిలదొక్కుకోవాలంటే సరైన వ్యూహరచన చేయాల్సిందే. లేకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో వైఫల్యాలను చవిచూడక తప్పదు. అందుకే అన్ని రకాల సంస్థలూ ఇపుడు ‘డేటా సైన్స్’వైపు దృష్టి సారిస్తున్నాయి. సమాచార విశే్లషణలో ‘డేటా సైన్స్’ నిపుణులదే కీలక పాత్ర. వీరి సేవల వల్లే బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఆరోగ్య సేవలు, ఆతిథ్యరంగం, టెలికం సేవలు లక్ష్యసాధనలో దూసుకుపోతున్నాయి. ‘డేటా సైన్స్’ను ఆధారంగా చేసుకునే వివిధ రంగాల్లోని సంస్థలు మనుగడ సాగిస్తున్నాయి. ఈ-కామర్స్, ఫార్మా, టెక్నాలజీ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఎనలిటిక్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రంగాల మాదిరి ‘డేటా సైన్స్’కు సంబంధించి కూడా నేడు నిపుణుల కొరత ఉంది. ఈ డిమాండ్ దృష్ట్యా ‘డేటా సైన్స్’లో నైపుణ్యం ఉన్న వారికి ఇపుడు కొలువులు దండిగా లభించే అవకాశాలున్నాయి. భారత్‌లోనే కాదు, విశ్వవ్యాప్తంగా డేటా సైన్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతున్నందున అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇందుకు సంబంధించిన కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ కోర్సుల్లో సాధించిన నైపుణ్యాల మేరకు వివిధ హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు అనుభవం, ప్రతిభను గుర్తించి భారీగా వేతన ప్యాకేజీలను అందిస్తున్నాయి. నైపుణ్యం కలిగిన డేటా సైంటిస్టుకు సగటున నెలకు లక్ష రూపాయల వరకూ అనేక సంస్థలు జీతభత్యాలు ఇస్తున్నాయి. డేటా సైంటిస్టు, డేటా ఎనలిస్టు, ఎనలటిక్స్ మేనేజర్, స్టాటిస్టికల్ ఎనలిస్టు, డేటా డెవలపర్, బిగ్ డేటా ఇంజనీర్.. ఇలా వివిధ హోదాల్లో ఆకర్షణీయమైన కొలువులు సిద్ధంగా ఉన్నాయి.
డేటా సైన్స్‌ను ఓ స్పెషలైజేషన్‌గా అభ్యసించిన వారికి బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఈ-కామర్స్, ఆరోగ్య సేవలు, ఫార్మా, ఐటీ- ఐటీఈఎస్, మీడియా, ట్రావెల్, ఆతిథ్యరంగం, ఇంధనం, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఇపుడు దండిగా ఉన్నాయి. గత ఏడాది డేటా ఎనలిటిక్స్‌కు సంబంధించి బ్యాంకింగ్ రంగం 42 శాతం ఉద్యోగాలను అందించాయి. మన దేశంలోని ప్రధాన నగరాల్లో డేటా సైంటిస్టులకు ఐబిఎం, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర సంస్థలు ఉపాధిని కల్పిస్తున్నాయి. డేటా సైన్స్‌ను ఓ కేరీర్‌గా ఎంచుకుంటే వివిధ అంశాల్లో నైపుణ్యాలను పుణికిపుచ్చుకోవాల్సిందే. ఎక్సెల్, డేటా సైన్స్ బేసిక్స్, ఆర్- ఫర్ డేటాసైన్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మెషీన్ లెర్నింగ్, స్పార్క్, అండర్‌స్టాండింగ్ స్టాటిస్టిక్స్, పైథాన్ కోడింగ్, హడూప్ ప్లాట్‌ఫాం వంటి నైపుణ్యాలు డేటా సైన్స్‌లో ఉన్నాయి. ప్రాక్టికల్స్, ప్రాజెక్టులు కూడా ఇందులో భాగంగానే అభ్యసించాలి. ఇంజనీరింగ్, మ్యాథ్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో డిగ్రీ చేసినవారు డేటాసైన్స్ కోర్సుకు అర్హులు. కొన్ని కోర్సులకు పీజీని అర్హతగా నిర్ణయించారు. కొత్తవారికి, అప్పటికే ఉద్యోగాలు చేస్తున్నవారికి నైపుణ్యం పెరిగేలా ఈ కోర్సులు సహాయ పడతాయి. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీలు, ఐఐఎంలు డేటా సైన్స్‌లో కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఈ తరహా కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ కోర్సులను ప్రారంభించేందుకు కొన్ని విశ్వవిద్యాలయాలు కూడా ముందుకొస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు తగ్గట్టుగా డేటా సైంటిస్టులు లేరు. అంతర్జాతీయ డేటా సంస్థ (ఐడిసి) గణాంకాల మేరకు బిగ్ డేటా టెక్నాలజీ, సేవా రంగం మార్కెట్ వచ్చే ఏడాదికి 41.5 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. డేటా సైంటిస్టులకు డిమాండ్ 2020 నాటికి 28 శాతం మేరకు పెరగొచ్చు. ప్రస్తుతం ఐటీ సంస్థల్లో పనిచేసే వారిలో దాదాపు సగం మందికి డేటా సైన్స్‌లో నైపుణ్యం లేనందున వారికి భవిష్యత్‌లో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమని జాబ్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. డేటా సైన్స్‌లో నైపుణ్యం సాధిస్తే ఉద్యోగాలకు ఢోకా ఉండదని వారు భరోసా ఇస్తున్నారు.