యువ

చదరంగ సామ్రాజ్యానికి రాణి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌హిట్ బాలీవుడ్ సినిమా ‘రాణి’ అంటే ఆమెకు తెగ ఇష్టం.. ఆ సినిమాలో కీలకపాత్రలో మెప్పించి జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కంగనా రనౌత్ అన్నా మరీ ఇష్టం.. కంగనాకు, తనకు ఎన్నో పోలికలున్నాయని సన్నిహితులు చెబుతుంటే ఆమెకు ఎంతో సంతోషం.. ‘రాణి’ సినిమా సంగతిని పక్కన పెడితే- ఆమె మాత్రం ‘చదరంగ సామ్రాజ్యాని’కి మకుటం లేని మహారాణిలా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. దేశీయ చదరంగ పోటీల్లో జాతీయ చాంపియన్‌గా తన ఆధిపత్యాన్ని అప్రతిహతంగా సాగిస్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన పద్మినీ రౌత్ (23) వరుసగా నాలుగోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచింది. కొద్ది రోజుల క్రితం సూరత్‌లో జరిగిన జాతీయ చదరంగం పోటీలో మరోసారి తన సత్తా చాటుకుంది. తన అభిమాన నటి కంగనాలా తాను ఉంటానని అందరూ అంటూంటే గర్వంగా ఉంటుందని పద్మిని చెబుతోంది.
చదరంగంలోనే కాదు, చిత్రలేఖనం అన్నా పద్మినికి చిన్నప్పటి నుంచి ఇష్టమే. తన అక్క ఎలీ నుంచి స్ఫూర్తి పొంది పాఠశాల స్థాయిలోనే చదరంగం పోటీల్లో ఆమె పాల్గొనేది. ప్రస్తుతం జర్మనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అక్క ఎలీ చిన్నప్పటి నుంచి వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించడంతో తాను కూడా అలానే అందరి నుంచి ప్రశంసలు పొందాలని పద్మిని తపన పడేది. చదరంగంలో ప్రవేశం ఉంటే మేధస్సు, చురుకుదనం పెరిగి చదువులోనూ రాణిస్తారని భావించి ఆమె తండ్రి కూడా పద్మినిని ఎంతగానో ప్రోత్సహించేవారు. బహుమతులు సాధించేందుకు చదరంగం ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఆ దిశగా పద్మిని సాధన చేసేది. కొన్నాళ్లకు చదరంగంలో ఎత్తుగడలు తెలుసుకుని వివిధ స్థాయిల్లో పోటీలకు హాజరుకావడం ప్రారంభించింది. తన అక్క సాధించిన బహుమతులను కాకుండా, తాను స్వయంగా గెలుచుకున్న బహుమతులను అందరికీ ఆమె గర్వంతో చూపించేది. తాను సొంతంగా సాధించిన బహుమతులను చూపిస్తూ ఎంతగానో మురిసిపోయేది.
తొమ్మిదేళ్ల ప్రాయంలో చదరంగం పోటీలకు వెళ్లేది. మొదట్లో సరదాగా ఉన్నా, ఆ తర్వాత పతకాలు సాధించాలన్న పట్టుదల ఆమెలో పెరిగింది. 2005 సంవత్సరంలో ఎవరూ ఊహించని రీతిలో పద్మిని మూడు ప్రతిష్ఠాత్మక పతకాలను తన ఖాతాలో వేసుకుంది. నేషనల్ అండర్-11, అండర్-13, ఏషియన్ అండర్-12 పోటీల్లో టైటిళ్లను సాధించాక ఇక ‘చదరంగమే తన జీవితం’ అని నిర్ణయించుకుంది. అదే సంకల్పంతో అనేక పోటీలకు హాజరై అంతర్జాతీయ వేదికలపైనా నైపుణ్యం చాటుకుంది. 2008 సంవత్సరంలో వరల్డ్ అండర్-14 చాంపియన్ షిప్‌లో మెరిసింది. 2010లో జరిగిన వరల్డ్ జూనియర్స్ పోటీలో కాంస్య పతకం, 2014లో జరిగిన చెస్ ఒలింపియాడ్ బంగారు పతకం సాధించింది. నార్వేలో ‘ఒలింపియాడ్’కు హాజరై బంగారు పతకం గెలుచుకోవడం తనకెంతో సంతోషం కలిగించిందని పద్మిని చెబుతోంది. 131 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్న ఆ పోటీలో తాను విజేతగా నిలవడాన్ని ఎప్పటికీ మరచిపోలేనని అంటోంది. అదే ఏడాది తొలిసారిగా ‘నేషనల్ ప్రీమియర్’ పోటీల్లో టైటిల్ సాధించింది. ఈ తరహా పోటీల్లో ఇప్పటికి నాలుగుసార్లు గెలిచినా, తొలిసారి పతకం అందుకోవడం మధురానుభూతిని మిగిల్చిందని పద్మిని గత స్మృతులను వివరిస్తోంది. కాగా, ఒక్కోసారి తీవ్ర మానసిక ఒత్తిడి వల్ల పతకాలు చేజారిపోతుంటాయని ఆమె తన అనుభవాలను చెబుతోంది.
భవిష్యత్‌లో ‘గ్రాండ్ మాస్టర్’ టైటిల్‌ను సాధించడమే తన ఆశయమంటోంది. ఇప్పటికే ‘ఉమన్ గ్రాండ్ మాస్టర్’, అంతర్జాతీయ మాస్టర్ టైటిళ్లను సాధించినా తన గమ్యం ఇంకా చాలాదూరంలో ఉందంటోంది. 2015లో గిబ్రాల్టర్‌లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ కోసం పోరాడినా ఆమెకు అనుకున్నంత స్కోర్ దక్కలేదు. మరిన్ని టోర్నమెంట్లలో తాను సత్తా చాటుకోవలసి ఉందని, యూరప్‌లో జరిగే పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్నట్లు పద్మిని తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. అంతకంటే ముందు ఈ నెల 26 నుంచి సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగే ‘వరల్డ్ రాపిడ్ అండ్ బ్లిడ్జ్ చాంపియన్‌షిప్’ పోటీలకు సమాయత్తమవుతోంది. సౌదీ అరేబియాలో తొలిసారిగా క్రీడాకారిణులు తలపై ముసుగులు వేసుకోవాల్సిన అవసరం లేదని అక్కడి ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. ఇలా ఆంక్షలను తొలగించడం మహిళలు సాధించిన ఘన విజయమని పద్మిని ఆనందం వ్యక్తం చేస్తోంది. *