యువ

ఒంట్లోనే టెక్నాలజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీన్‌లోకి
సైబోర్గ్‌లు!
సాయంత్రం ఆరయింది. లండన్‌లోని
వెస్ట్ హాంప్‌స్టెడ్‌లో ఉన్న తన ఇంటికి కార్లో రయ్యిన
దూసుకొచ్చింది కేటీ కోలిన్స్ (పక్క ఫొటోలో అమ్మాయ). కార్‌ను పార్క్ చేసి, తలుపు దగ్గరకొచ్చి, గాల్లోకి చేయి ఊపింది. అంతే.. డోర్ అన్‌లాక్ అయింది. లోపలకి వచ్చి హాండ్‌బ్యాగ్‌ను, స్మార్ట్ఫోన్‌ను సోఫాలో పడేసి, తాను మరో సోఫాలో కూలబడింది. మరోసారి చేయి ఊపింది. ఎదురుగా ఉన్న టీవీ ఆన్ అయింది. కాసేపు టీవీ చూశాక, ఫ్రెండ్‌కు ఫోన్ చేయాలనిపించింది. దూరంగా ఉన్న స్మార్ట్ఫోన్‌వైపు చూసి, గాల్లోనే చేతిని స్వీప్ చేసింది. స్మార్ట్ ఫోన్ అన్‌లాక్ అయింది. ఎదురుగా ఉన్న లాప్‌టాప్ స్క్రీన్‌పై ఫ్రెండ్ నంబర్‌ను చూసి, వేలితో నొక్కింది.
స్మార్ట్ఫోన్‌లో నంబర్ డయల్ కావడం మొదలైంది.
మరోసారి కొలిన్స్ చేత్తో సైగ చేయడంతో స్మార్ట్ఫోన్ స్పీకర్ ఆన్ అయింది. ఈలోగా
ఫ్రెండ్ లైన్‌లోకి వచ్చాడు. ఇద్దరూ మాటల్లో పడ్డారు.
-ఇదంతా హాలీవుడ్ సినిమాలా అనిపించినా ముమ్మాటికీ వాస్తవమే. కేటీ కొలిన్స్ తన కుడి చేతి బొటనవేలికి, చూపుడు వేలికి మధ్య ఓ మైక్రోచిప్‌ను ఇంప్లాంట్ చేసుకుంది. దాంతోనే ఆమె ఈ ‘మ్యాజిక్’ చేయగలుగుతోంది. ఆ మాటకొస్తే కేవలం కొలినే్స కాదు...
ప్రపంచవ్యాప్తంగా ఇలా తమ శరీరంలోకి మైక్రోచిప్స్‌ను ఇంప్లాంట్ చేసుకున్నవారు పదివేల మందికి పైగా ఉన్నట్టు అంచనా. టెక్నాలజీపై ఉన్న సాధికారతతోనే వాళ్లు ఇలా చేయగలుగుతున్నారు.
వీళ్లని సైబోర్గ్స్ అనీ, బయో హ్యాకర్లనీ అంటున్నారు.

మాత్ర మహిమ
చెప్పతరమా!

సైబర్ పిల్

‘నీ చేతి మాత్ర..వైకుంఠ యాత్ర’ అని డాక్టర్లను ఒకప్పుడు సరదాగా ఆట పట్టించేవారు. రాబోయే రోజుల్లో ఆ మాత్రలే సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారబోతున్నాయి. భవిష్యత్తులో ఇక ఏ రోగమొచ్చినా డాక్టర్ల వద్దకు వెళ్లక్కర్లేదు. ఓ సైబర్ పిల్‌ను మింగితే చాలు...వాడుతున్న మందులు ఎలా పనిచేస్తున్నాయి? వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉంది? వంటి సమాచారాన్ని నేరుగా డాక్టర్‌కే చేరవేస్తుంది. బ్రిటన్‌కు చెందిన ఓ శాస్తవ్రేత్తల బృందం ఇప్పుడదే పనిలో ఉంది. వారు చేపట్టిన ప్రాజెక్ట్ పేరు ప్రొటియస్.

బ్యాటరీలూ లోపలే!
ఇంప్లాంటబుల్ చిప్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్య పవర్. శరీరం లోపల ఉండే చిప్స్‌కు పవర్ ఎలా అందించడం? దీనిపై మసాచుసెట్స్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ శాస్తజ్ఞ్రులు పరిశోధనలు జరుపుతున్నారు. ఇంప్లాంటబుల్ చిప్స్‌కు పవర్ అందించేందుకు వీరు బయో డీగ్రేడబుల్ (వాటంతట అవే కరిగిపోయే) బ్యాటరీలే మార్గమని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయోగాలు సాగిస్తున్నారు. శరీరంలోపల ఏదో ఓ అవయవానికి అతుక్కునో, లేక లోపల తేలియాడుతూనో ఉండే చిప్స్‌కు ఈ బ్యాటరీలు వైర్‌లెస్ పద్ధతిలో పవర్‌ను అందిస్తాయి. అనంతరం అవి వాటంతట అవే కరిగిపోతాయి.

టెక్నాలజీ రోజుకో కొత్త ఆవిష్కరణకు వేదికవుతోంది. అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేస్తోంది. మానవ జీవితంలో అనుకోని మా ర్పులు తెస్తోంది. ఊహాజనితమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన హాలీవుడ్ సినిమాలను చూసి ఒకప్పుడు ఆశ్చర్యం కలిగేది. కానీ ఇప్పుడు అవన్నీ
నిజ రూపాన్ని సంతరించుకుంటున్నాయి. డ్రైవర్‌లెస్ కార్లు, డ్రోన్లు వంటివి అలాంటివే కదా! భవిష్యత్తులోనూ టెక్నాలజీ మరిన్ని
కొత్త పుంతలు తొక్కబోతోంది. ఇప్పటివరకూ బయటే ఉండి విశ్వరూపం చూపిస్తున్న టెక్నాలజీ రాబోయే రోజుల్లో మనిషి శరీరంలోకి
చొచ్చుకుపోయి వింతలు విడ్డూరాలూ చేయబోతోంది. మరింత వివరంగా చెప్పాలంటే...ఇంప్లాంటబుల్ గాడ్జెట్స్ అన్నమాట.
అవి శరీరంలోనే అమరిపోతాయి. రాబోయే రోజులు వీటివేనంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం...

శరీరంలోంచి ట్రింగ్ ట్రింగ్!
స్మార్ట్ఫోన్ లేని జీవితాన్ని ఇప్పుడు ఊ హించలేం. అంత గా మనం స్మార్ట్ఫోన్‌కు కనెక్ట్ అయిపోయాం. అయితే, ఇదే ఫోన్ మన శరీరంతోనే కనెక్ట్ అయిపోతే? అంటే...శరీరంలోనే ఓ స్మార్ట్ఫోన్‌ను ఇంప్లాంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ దిశగానే ప్రయోగాలు సాగుతున్నాయి. పైగా ఇంప్లాంటబుల్ స్మార్ట్ఫోన్ ఆవిష్కరణకు ఎంతో కాలం పట్టదంటున్నారు శాస్తవ్రేత్తలు. ఆ మధ్య ఆంథొనీ అంటొనెల్లిస్ అనే ఓ ఆర్టిస్ట్ తన అరచేతిలో ఆర్‌ఎఫ్‌ఐడి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) చిప్‌ను ఇంప్లాంట్ చేసుకున్నాడు. అతను వేసే ప్రతి బొమ్మా ఈ చిప్‌లో సేవ్ అయి, అతని స్మార్ట్ఫోన్‌కు చేరవేస్తుంది. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఆర్ట్ఫిషియల్ స్కిన్ (కృత్రిమ చర్మం)ను సృష్టించేందుకు ప్రయోగాలు మొదలయ్యాయి. దీనిపై ఇమేజెస్ డిస్‌ప్లే చేయచ్చట. మరికొందరు సైంటిస్టులు ఓ అడుగు ముందుకేసి, ఐ ఇంప్లాంట్స్‌పై ప్రయోగాలు చేస్తున్నారు. కనురెప్ప వేస్తే చాలు, ఎదుట ఉన్న ఇమేజ్ కాప్చరైపోతుంది. ఈ ప్రయోగాలు కూడా సఫలమైతే ఇంప్లాంటబుల్ స్మార్ట్ఫోన్ రూపొందించడానికి ఎంతో కాలం పట్టదు మరి!
గప్‌‘చిప్’గా
ఇక కు.ని!
రానున్న రోజుల్లో కుటుంబ నియంత్రణ పద్ధతులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకోబోతున్నాయి. మహిళలు వాడే కుటుంబ నియంత్రణ చిప్ ప్రయోగ దశలో ఉంది. చూడటానికి టాటూలా ఉండే ఈ చిప్‌ను ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఈ చిప్ క్రమబద్ధంగా సంతాన నిరోధక హార్మోన్‌ను స్రవిస్తుంది. దీనిని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేస్తారు. ఈ చిప్ ఏకధాటిగా 16 ఏళ్లు పనిచేస్తుందట. పరిశోధన పూర్తయి, ప్రయోగ దశలో ఉన్న ఈ చిప్ 2018లో వెలుగుచూస్తుందంటున్నారు. ఎంఐటి ప్రాజెక్టు చేపట్టిన ఈ ప్రయోగానికి బిల్‌గేట్స్ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తోంది.
చింతలు తీర్చే చిప్స్!
సైబర్ ఇంప్లాంట్స్ గురించి వినే ఉంటారు. ఇవి ఇప్పటికే వాడుకలోకి వచ్చాయి. రోగుల శరీరంలోకి వీటిని జొప్పించి, స్మార్ట్ఫోన్‌లోని యాప్‌తో అనుసంధానిస్తారు. చిప్ ద్వారా అందుతున్న సమాచారం ఆధారంగా రోగికి చికిత్స చేస్తారు. తాజాగా అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో శాస్తవ్రేత్తలు కృత్రిమ పాంక్రియాస్‌ను సృష్టించారు. రక్తంలో చక్కెర శాతాన్ని, కొవ్వులను నియంత్రణలో ఉంచేందుకు ఈ కృత్రిమ పాంక్రియాస్ తోడ్పడుతుందని భావిస్తున్నారు. దీనిపై ఉండే కేప్సూల్ పరిమాణంలోని సర్క్యూట్ల ద్వారా రక్తంలోని చక్కెర శాతాన్ని, కొవ్వుల శాతాన్ని లెక్కవేయొచ్చు. పైపెచ్చు, కృత్రిమ పాంక్రియాస్‌పై ఓ సన్నటి నీడిల్ ద్వారా బుల్లి సెన్సార్‌ను అమరిస్తే, అది స్మార్ట్ఫోన్‌లోని యాప్‌తో నిరంతరం ‘మా ట్లాడుతూ’ చక్కెర, కొవ్వు శాతాలపై సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుందట. దీనిపై తుది ప్రయోగా లు జరుగుతున్నాయి. డయాబెటిక్ రోగులకు ఇది వరంగా అభివర్ణిస్తున్నారు. *