యువ

ఇన్‌స్టాగ్రామ్ నుంచి కొత్త మెసేజింగ్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫేస్‌బుక్‌కు అనుబంధంగా వున్న ఫొటో సందేశాల వేదిక ‘ఇన్‌స్టాగ్రామ్’ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల వచ్చిన ఎన్నో డైరెక్ట్ ఫీచర్లు ఇన్‌స్టాగ్రామ్‌లోకి అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటికీ ఇపుడు అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజింగ్ కోసం తనదైన ఒక యాప్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ యాప్ టెస్టింగ్ సందర్భంగా టర్కీ, ఇటలీ, పోర్చుగల్, ఇజ్రాయిల్, చిలీ, ఉరుగ్వే వంటి దేశాల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు దీన్ని వాడుకునే అవకాశం వుంది. ఆ దేశాల్లో ఈ యాప్ సక్సెస్ అయితే మిగతా దేశాల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్ కోసం తయారుచేస్తున్న న్యూ స్టాండ్లోన్ డైరెక్ట్ మెసేజింగ్ యాప్‌ను ‘డైరెక్ట్ యాప్’ అని వ్యవహరిస్తారని ‘ది వెర్జ్ రిపోర్టు’ తెలిపింది. న్యూ డైరెక్ట్ యాప్ అనేది స్నాప్ చాట్ మాదిరిగానే ఉంటుంది. ఈ యాప్‌ను ఓపెన్ చేసినపుడు కెమెరా పేన్ షేరింగ్ కోసం ఫొటోలను, వీడియోలతోపాటు కొత్త కంటెంట్లను యూజర్లు సృష్టించుకోవచ్చు. ఇక ఇందులోని కెమెరా నాలుగు ఎక్స్‌క్లూజివ్ ఫిల్టర్ల ఇన్‌స్టాగ్రామ్ ఒకే విధంగా ఉంటుంది. కెమెరా ఇంటర్ స్పేస్‌లో ఎడమవైపు అకౌంట్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను చూపిస్తుంది. కుడివైపు చాట్స్ లిస్టును చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో చూసినట్లు, డైరెక్ట్ యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నపుడు, ఇన్‌స్టాగ్రామ్ చాట్స్‌ను డిస్‌ప్లే చేయడం నిలిపివేస్తుంది. ఎడమవైపు యూజర్లను డైరెక్ట్ యాప్‌కు దారి మళ్లించే స్విప్ట్ యానిమేషన్‌ను చూపుతుంది. ఇదే తీరులో డైరెక్ట్ ఇన్‌బాక్స్ నుంచి ఎడమవైపునకు స్విప్పింగ్‌లో యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌కు రావచ్చు.
న్యూ డైరెక్ట్ యాప్ సింపుల్‌గా ఉంటుంది. ఇది అందరికీ అర్థమయ్యేలా ఈజీ ప్రాసెస్‌ను కలిగి వుంటుంది. ఇది కేవలం ఇన్‌స్ట్రాగ్రామ్ ఆఫ్ మెసేజ్ సర్వీసు ఉపసంహరించుకోవడానికి ఉపయోగపడుతుంది. మెసెంజర్ యాప్‌ను ఉపయోగించడం ద్వారా ఫేస్‌బుక్‌లో న్యూ డైరెక్ట్ మెసెంజర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఇచ్చిన, ఇది ఫేస్‌బుక్ ఇపుడు మూడు అటువంటి మెసేజింగ్ యాప్స్‌ను కలిగి వుందని చెప్పవచ్చు. వాట్సాప్ ఇప్పటికి మెసేజ్ ఫ్లాట్‌ఫాం అయినప్పటికి, మెసెంజర్ ఆఫర్స్, ఆప్షన్స్, బాట్స్, ఫోన్‌కాల్స్ చేసి కెపాసిటీ, మెసెంజర్‌లోనే గేమ్స్ ఆడుకోవడంతో మెసెంజర్‌కు డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఒక కెమెరా ఫస్ట్ మెసేజ్ సర్వీస్ డైరెక్ట్ కాల్ కనిపిస్తుంది. ఈ కొత్త యాప్ ఏ దిశలో ఉంటుందో ఇంకా తెలియరావడం లేదు. ఇది కూడా వినియోగదారుల కోసం రోల్ చేయబడి ఉంటుంది. న్యూ డైరెక్ట్ యాప్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది.
అలరించే ఫీచర్లు..
వినియోగదారుల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఇపుడు రెండు కొత్త ఫీజర్లను జత చేసింది. అవే- స్టోరీస్ ఆర్కైవ్, స్టోరీస్ హైలెట్లు. ఈ రెండు కొత్త ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు వారి స్టోరీలను సేవ్ చేసుకోవడానికి అనుమతించే ఫ్లాట్‌ఫాంలో భాగంగా ఉంటాయి. యూజర్లు వారి ప్రొఫైళ్లను సూచించానికి మరో ఫ్లాట్‌ఫాంను కూడా అందిస్తారు. స్టోరీస్ ఆర్కైవ్ ఫీచర్ ద్వారా, మీ స్టోరీలను యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ ప్రొఫైల్‌కు యాడ్ చేసే స్టోరీలు, ప్రైవేట్ ఆర్కైవ్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ చేయబడతాయి. తర్వాత మీరు దాన్ని సూచించవచ్చు. ఆర్కైవ్ నుంచి స్టోరీస్‌ను- ఇప్పటికే ఉన్న స్టోరీకికూడా షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు స్టోరీలను హైలెట్ చేయడానికి ఒకఆప్షన్ కూడా వుంది. ఇక మీకు స్టోరీస్ ఆర్కైవ్ ఫీచర్ అంటే ఇంట్రెస్టు లేనట్లయితే దాన్ని టర్న్ ఆఫ్ కూడా చేయవచ్చు. ఇక స్టోరీస్ హైలెట్స్ అని పిలిచే కొత్త ఫీచర్ విషయానికి వస్తే.. మీ ప్రొఫైల్‌లో కొత్త స్పేస్‌ను సూచిస్తుంది. ఇక్కడ మీరు ఇప్పటికే చర్చించిన స్టోరీస్ ఆర్కైవ్ నుంచి సోర్స్ ఇమేజ్‌లను పొందే అవకాశం వుంటుంది. భద్రపరిచిన ఇమేజ్‌లు కొత్త ట్యూబ్‌లో మీ ప్రొఫైల్లో కనిపిస్తాయి. మీరు ఆర్కైవ్స్ నుంచి కావాల్సినన్ని హైలెట్లను యాడ్ చేసుకోవచ్చు. ఫోటోగ్రిడ్‌పై హారిజాంటల్ స్క్రోల్ బార్ కూడా చూడవచ్చు. ఆర్కైవ్‌లో స్టోరీలను యాక్సెస్ చేయడానికి, మీరు మీ ప్రొఫైల్‌లో కనిపించే ఆర్కైవ్ ఐకాన్‌ను నొక్కాలి. మీరు పోస్టులో ఆర్కైవ్ మరియు స్టోరీస్ ఆర్కైవ్‌ల మధ్య ఈజీగా మారవచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆర్కైవ్ ద్వారా నావిగేట్ చేయడానికి ప్రతిరోజు మీ స్టోరీలో తేదీని సూచిస్తుంది. ఈ కొత్త ఫీచర్స్ ఆండ్రాయిడ్, ఐఒఎస్ రెండింటిలోను ఇన్‌స్టాగ్రామ్ 25వవెర్షన్‌లో కనిపిస్తాయి. స్నాప్ చాట్ ఫీచర్ ప్రజాదరణ పొందిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ప్రారంభం అయ్యాయి. స్నాప్‌చాట్ ఇంతకుముందు కొంతమందికి మాత్రమే అందుమాటులో ఉండేది. ఇప్పుడు స్టోరీస్ ఆర్కైవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశపెట్టారు.