యువ

ఈ ల్యాపీ ధర రూ.7 లక్షలు! (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ల్యాపీ దిగ్గజం ఏసర్ ప్రీడేటర్ 21 ఎక్స్ పేరుతో అత్యంత ఖరీదైన ధరలో నూతన గేమింగ్ ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. బెర్లిన్‌లో 2016లో ఐఎఫ్‌ఏలో తొలుత దీన్ని లాంచ్ చసిన తర్వాత మార్కెట్‌లోకి దీన్ని ప్రవేశపెట్టింది. కాగా కర్వ్‌డ్ స్క్రీన్ డిస్‌ప్లేతో వచ్చిన ప్రపంచపు తొలి గేమింగ్ ల్యాప్‌టాప్ ఇదే కావడం విశేషం. ఈ ల్యాప్‌టాప్‌లో వీడియో గేమ్ ఆడుతుంటే థియేటర్‌లో ఉన్నట్లు అనుభూతి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ ఆర్డర్‌కు వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ఇప్పటికే అందుబాటులోకి రానుంది. ఈ ల్యాప్‌టాప్ ఖరీదు రూ.6,99,999గా కంపెనీ పేర్కొంది. అమెరికాలో పోలిస్తే భారత్‌లో దీని ధర ఎక్కువగా ఉంది. అమెరికాలో దీని ధర 8,999 డాలర్లు అంటే సుమారుగా రూ.5,77,000గా ఉంది. విండోస్ 10 ఆధారితంగా ఇది రూపొందింది.
ఏసర్ ప్రిడేటర్ 21 ఎక్స్ ఫీచర్లు
21అంగుళాల కర్వ్‌డ్ ఫుల్ హెచ్‌డి ఆల్ట్రా వైడ్ ఐపిఎస్ డిస్‌ప్లే, జి-సింక్ సపోర్టు, 2560/1080 పిక్సెల్ రెజల్యూషన్ 7వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7- 7820 హెచ్‌కె ప్రాసెసర్, 64 జిబి ర్యామ్, 512 జిబితో వర్క్‌చేసే నాలుగు సపరేట్ డ్రైవ్స్, 1 టిజిబి ఆర్‌పిఎం హార్డ్ డ్రైవ్ 8.5 కిలోగ్రాముల బరువు, ఆరు బిల్డ్ ఇన్ స్టీరియో స్పీకర్లు.