యువ

అమ్మాయిలకోసం ఐదు యాప్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలో స్మార్ట్ఫోన్, అందులో యాప్స్ ఉంటే మనకు ఎదురు లేదన్నమాటే. ఏ పనైనా క్షణాల్లో చేసేయొచ్చు. అయితే ఏ యాప్ దేనికి ఉపయోగపడుతుందో తెలిసి ఉండాలి. లేదంటే తిప్పలు తప్పవన్నమాటే. మగవాళ్ల మాట అటుంచితే, ఆడవాళ్లకోసం రకరకాల యాప్స్ వస్తున్నాయి. వాటిలో వారికి బాగా ఉపయోగపడే ఐదు యాప్స్ గురించి చూద్దాం.
Revv
అద్దెకు దొరికే కార్ల వివరాలు అందించే యాప్స్ చాలానే ఉన్నాయి. ‘రెవ్’ ప్రత్యేకత ఏంటంటే- కావలిసిన కారు ఇంటి ముందుకు రావడమే కాదు, ఆ కారును మీరే నడిపే సదుపాయం ఉండటం. దీనివల్ల సెక్యూరిటీకి సంబంధించిన భయాలు ఉండవు. మహిళలపై కారు డ్రైవర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెవ్ యాప్ రూపొందింది. కిలోమీటర్లతో పనిలేకుండా, గంటల ప్రాతిపదికపై డబ్బు చెల్లించే సదుపాయం ఉండటం ఇందులో మరో ప్రత్యేకత.
Jugnoo
ఛండీగఢ్‌కు చెందిన జుగ్నూ అనే సంస్థ కంపెనీ పేరు మీదే తయారు చేసిన యాప్ ఇది. దేశవ్యాప్తంగా బడా నగరాల్లో ఆటోలకు సంబంధించిన సమాచారం అందించే మొబైల్ యాప్- జుగ్నూ. విద్యార్థినులు, ఉద్యోగినులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైనప్పుడు కాల్ చేస్తే చాలు...ఆటో మీ ఇంటిముందు ప్రత్యక్షం.
Urban Clap
ఇంటికొచ్చి అందించే సేవలకు సంబంధించిన యాప్- అర్బన్ క్లాప్. ఫొటోగ్రాఫర్లు, సెలూన్లు, బ్యూ టీషియన్లు, హోమ్ క్లీనింగ్, మరమ్మతులు, యోగా, గిటార్ క్లాసెస్...ఇలా అనేక రకాల సర్వీసులను అర్బన్ క్లాప్ అందిస్తుంది.
Goibibo
ఆన్‌లైన్‌లో ట్రావెల్ సమాచారాన్ని అందించే మొబైల్ యాప్-గోఇబిబో. ఎయిర్ టికెట్స్, బస్ టికెట్స్ బుక్ చేసుకోవడం మొదలు అద్దెకు లభించే కార్ల వివరాలు, హాలీడే ట్రిప్స్ ప్లానింగ్ వంటి సమాచారాన్ని ఈ యాప్ అందిస్తోంది.
Voonik
మహిళల ఫ్యాషన్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించే యాప్-వూనిక్. అంతేకాదు, పేరొందిన స్టయిలిస్టులు మహిళలకు తలెత్తే సందేహాలను నివృత్తి చేయడం ఈ యాప్ ప్రత్యేకత.
*