యువ

ప్రేమికులకు ప్రత్యేకం!(కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే ‘బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్’గా పేరొందిన ఆనర్-7ఎక్స్ త్వరలో రెడ్ కలర్ వేరియంట్‌లో దర్శనమిస్తుంది. ఈ ఫోన్లు లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే అందుబాటులో వుంటాయి. వచ్చే నెలలో కోలాహలంగా జరుపుకునే ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ప్రత్యేక మోడల్‌ను విడుదల చేస్తున్నట్లు ఆనర్ సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 4 నుంచి వీటి విక్రయాలు మొదలవుతాయి. భారత్‌తోపాటు అమెరికా, రష్యా, యుకె, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో ఇది అందుబాటులో వుంటుంది. ఆనర్ ఇండియాకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఈ ఫోన్ అమ్మకానికి ఉంటుంది. ఆనర్ 7 ఎక్స్ రెడ్ కలర్ వేరియంట్‌ను ముందుగా సొంతం చేసుకునే 100మంది యూజర్లకు కోబ్రాండెడ్ ఆనర్ మాన్‌స్టర్ ఎఎం15 హెడ్ ఫోన్‌లను ఉచితంగా ఇస్తారు. 5.93 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (1080/2160 పిక్సల్) విత్ 18.9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, కైరిన్ 659 ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, స్టోరేజ్ వేరియెంట్స్ (32 జిబి, 64 జిబి), హైబ్రీడ్ సిమ్ స్లాట్ ద్వారా పోన్ స్టోరేజ్ కెపాసిటీని 256 జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3340 ఎంఎహెచ్ బాటరీ, డ్యూయెల్ సిమ్ కనెక్టివిటీ (జిఎఎమ్ + జిఎస్‌ఎమ్), కనెక్టివిటీ ఫీచర్లు (4జి, 3జి, వైఫై, జిపిఎస్, బ్లూటూత్, యుఎస్‌బి, ఆన్ ద గో సపోర్టు), ఫోన్ చుట్టుకొలత 156.50/75.30/7.60 మిల్లీమీటర్లు, బరువు 65 గ్రాములు.