యువ

ధర చూస్తే బేజారే! (కొత్తకొత్తగా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెక్నాలజీ దిగ్గజం ఏసెర్ ఇతర సంస్థలకు సవాల్ విసురుతూ సరికొత్త ల్యాపీని వినిగదారుల కోసం తీసుకువచ్చింది. ఈ ల్యాపీని ఈనెలలోనే అట్టహాసంగా విడుదల చేశారు. 9.98 మి.మి మందంతో దూసుకువచ్చిన ఈ ల్యాపీని ‘స్విఫ్ట్ 7’ పేరుతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ల్యాపీని వినియోగదారులు ఎక్కడకైనా సులువుగా తీసుకెళ్ళే అవకాశం వుంది. ఇంటెల్ కోర్ ప్రాసెసర్ అల్యూమినియం బాడీ డిజైన్, గొరిల్లా గ్లాస్, ఎన్‌బిటి టచ్ స్క్రీన్ అండ్ టచ్ పాడ్, 256 స్టోరేజ్ కెపాసిటీ, 8 జిబి ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, విండోస్ 10, సింగిల్ చార్జ్‌తో 10 గంటల బ్యాటరీ లైఫ్. దీని ధరను కంపెనీ రూ.1,07,470 (1699 డాలర్లు)గా నిర్ణయించింది. కాగా, మార్చి ఆరంభంలో నార్త్ అమెరికాలో దీని అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ నుంచి ఇతర దేశాల్లో రూ.1,29,329 ధరతో అమ్మకాలు జరుగుతాయి. దూర ప్రయాణాలు చేసేవారికోసం ఈ ల్యాపీని అందుబటులోకి తీసుకొచ్చామని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీనిలో ఉన్న ప్రధాన ప్లస్‌పాయింట్ ఏంటంటే అతి తక్కువ కాంతి పరిస్థితులలో కూడా బ్యాక్ లిట్ కీబోర్డుతో పనిచేసుకునే అవకాశం వుంది. కొత్త స్పిన్ 3ను 8వ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్, ఐపిఎస్ టెక్నాలజీతో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే, రెండు ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్లు, ఏసెర్ ట్రూ హార్మోనీ టెక్నాలజీ లాంటి ఫీచర్లతో మరింత శక్తివంతంగా రూపొందిస్తోందట.