యువ

శోధించి సాధించాలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులైనా, ఉద్యోగులైనా.. ఏ వర్గం వారైనా, ఏ వయసు వారైనా తమకు అవసరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘గూగుల్ సెర్చి’పై ఆధారపడడం నేడు అలవాటుగా మారింది. ‘నెట్’లో ‘శోధన’కు కేవలం గూగుల్‌నే ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నేటి సాంకేతిక యుగంలో ఇలాంటి ‘సెర్చి ఇంజన్లు’ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ‘గూగుల్’ తర్వాత ద్వితీయ స్థానాన్ని ఆక్రమించిన సెర్చి ఇంజన్- ‘బింగ్’. సాఫ్ట్‌వేర్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సంస్థ ‘బింగ్’ను అందిస్తోంది. ఇందులోని హోం పేజీ ఆకర్షణీయమైన చిత్రాలతో అందరినీ అలరిస్తుంది. గూగుల్ మాదిరి గానే ‘బింగ్’ (www.bing.com) సమస్త సమాఛారాన్ని, ఫొటోలను అందజేస్తుంది. ఇక, ఓపెన్‌సోర్స్ సెర్చి ఇంజన్‌గా ప్రఖ్యాతి పొందిన ‘డక్‌డక్‌గో’ మన ‘శోధన’కు గోప్యతను ఇస్తుంది. వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ఇది (https://duckduckgo.com) ఏ విధంగానూ బహిర్గతం చేయదు. విద్యార్థులు తమకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి www.wolframalpha.com లో శోధన చేసి అవసరమైన సమాచారం పొందవచ్చు. కాగా, ఇతర సెర్చి ఇంజన్ల కంటే నిర్ధిష్టమైన, నిశితమైన వివరాలతో మనకు సమాచారాన్ని అందజేస్తుంది ‘ఇప్పీ’. htpps://yippy.comలో శోధించి మనం మంచి రిజల్ట్స్ పొందే వీలుంది. ఇక, శోధన చేసే వారి గోప్యతను కాపాడేలా ‘స్టార్ట్‌పేజ్’ సెర్చి ఇంజన్ ఉపయోగపడుతుంది. ‘ప్రైవసీ ప్రొటెక్షన్ మోడ్’లో ఇది www.startpage.com లో అంధుబాటులో ఉంటుంది.