యువ

అతిగా మారితే అనర్థమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ విషయంలోనైనా మితి మీరితే అవస్థలు అనివార్యం కాకతప్పదు. అందుకే ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు పెద్దలు. పరిధులు, పరిమితులు దాటితే ఉపయోగం కన్నా లేనిపోని సమస్యలు తప్పవు. మన పెద్దలు ఏనాడో చెప్పిన ఈ సూత్రం నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ఫోన్లకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుంది. సాధారణ ఫోన్లు కనుమరుగవుతూ ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు కనిపిస్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో సరికొత్త ఫీచర్లకు, అదనపు ఆకర్షణలకు అంతేలేకుండా పోతోంది. వీటిలో ఎప్పుడు ఏ ప్రత్యేకత చోటుచేసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈరోజున వింతగా అనిపించిన ఫీచర్ మర్నాడే పాతదైపోయి రోత పుడుతుంది. ఖర్చుకు ఏ మాత్రం సంకోచించకుండా సరికొత్త రకం ఫోన్లను సొంతం చేసుకునేందుకు యువత ఆరాటపడుతోంది.
స్మార్ట్ఫోన్ ఎంత కొత్తదైనప్పటికీ వాడిన కొద్ది రోజులకే బోర్ కొడుతోందని చాలామంది యువతీ యువకులు తెగ ఫీలైపోతుంటారు. కొత్తలో బాగానే ఉన్నా వాడేకొద్దీ స్మార్ట్ఫోన్‌లోని ఫీచర్లపై సంతృప్తి తగ్గుముఖం పడుతోందని, ఈ భావన చివరికి మనోవ్యాకులతకు దారితీస్తున్నట్టు అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా జరిపిన అధ్యయనంలో తేటతెల్లమైంది. అమెరికాలో సుమారు లక్ష మంది యువతీ యువకులను సర్వే సందర్భంగా ప్రశ్నించగా ఆసక్తికరమైన ఈ అంశాలు వెలుగుచూశాయి. స్మార్ట్ఫోన్ల వల్ల సంతోషం కన్నా మనోవేదనే ఎక్కువగా కనిపిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
మరోవైపు- స్మార్ట్ఫోన్లకు దాసోహం కావడంతో స్నేహితులు, కుటుంబ సంబంధాలు, విహార యాత్రలు వంటివి తాము మిస్ అవుతున్నట్లు సర్వేలో చాలామంది అంగీకరించారు. ట్యాబ్, కంప్యూటర్, స్మార్ట్ఫోన్‌లతో గంటల తరబడి చాటింగ్, బ్రౌజింగ్, వీడియో కాలింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నవారు తాము పూర్తిస్థాయిలో సంతోషంగా లేమని చెప్పారు. రోజులు గడుస్తున్నకొద్దీ తమ స్మార్ట్ఫోన్లలో ఫీచర్లు పాతవైపోతున్నాయని బాధ అనేకమందిలో వ్యక్తమైంది. ‘డిజిటల్ స్క్రీన్’ కంటే బయటి ప్రపంచంలోనే నిజమైన ఆనందం ఉందని బోధపడినట్లు చాలామంది తెలిపారు. కెరీర్‌ను సైతం నిర్లక్ష్యం చేస్తున్నామన్న ఆవేదన సైతం కొందరిలో కనిపించిందని పరిశోధకులు తెలిపారు. కాలం విలువ, మానవ సంబంధాల గురించి తగిన అవగాహన లేనందువల్లనే యువతరంలో చాలామంది స్మార్ట్ఫోన్లతో మమేకం అవుతున్నట్టు తేలింది.