యువ

లక్ష్యం కోసం పరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రన్ ఫన్!
బెంగళూరు టు హైదరాబాద్
పది రోజులు...600 కిలోమీటర్లు
రోజుకు 60 కిలోమీటర్లు
ఫిబ్రవరి 23న ప్రారంభం
హైదరాబాద్‌కు చేరుకునే రోజు: మార్చి 3 లేదా 4

బెంగళూరు టు హైదరాబాద్...600 కిలోమీటర్లు...పది రోజుల లక్ష్యం. పైన ఎండ మాడ్చేస్తుంటే రోజుకు 60 కిలోమీటర్లు పరుగెత్తడం సాధ్యమేనా?
సాధ్యమేనంటోంది ఓ జంట. అనడమే కాదు...కార్యరంగంలోకి దూకింది. లక్ష్యాన్ని దిగ్విజయంగా చేరుకుంది కూడా. బెంగళూరుకు చెందిన గిరిధర్ కామత్, స్ఫూర్తి మురువందల ఆశయం ముందు 600 కిలోమీటర్ల లక్ష్యం చిన్నబోయింది.
ఇంతకీ ఎవరా గిరిధర్, స్ఫూర్తిలనేగా మీ సందేహం? వీరిద్దరూ బెంగళూరుకు చెందినవారు. అక్కడే ఓ బొమ్మల తయారీ కంపెనీని నడిపిస్తున్నారు గిరిధర్.

ఓ ఆఫీసులో ఉద్యో గం చేస్తున్నారు స్ఫూర్తి. పరుగెత్తడం ఈ జంటకు హాబీ. అంతకుమించి తమ ఆశయంకోసం వారెంచుకున్న ఓ సాధనం. బెంగళూరునుంచి హైదరాబాద్‌కు ఈ జంట ఫిబ్రవరి 23న రన్ ప్రారంభించింది. ప్రముఖ సినీ నటుడు, మోడల్ మిలింద్ సోమన్ ఈ రన్‌ను ప్రారంభించారు.
మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు తాము ఈ పరుగును ప్రారంభించినట్టు 28 ఏళ్ల స్ఫూరి మురువంద చెప్పారు. ‘కుటుంబం కోసం సర్వస్వం ధారపోసే మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోరు. వాస్తవానికి వారు ఆరోగ్యంగా ఉంటే కుటుంబానికి మరింత సేవ చేయగలుగుతారు. ఈ విషయంలో వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకే మేం ఈ రన్ చేపట్టాం’ అని వివరించారామె. దీనికోసం వారు ‘గిరి అండ్ స్ఫూర్తి గ్రేట్ గులాబీ గోల’ అనే పేజీని కూడా వారు సోషల్ మీడియాలో నిర్వహిస్తున్నారు. పింక్‌ను హిందీలో గులాబీ రంగని అంటారు. తెలుగులో గోల అంటే రణగొణ ధ్వని అని అర్థం. మాకు ఎదురయ్యే ప్రతి మహిళనూ చైతన్యవంతుల్ని చేయడమే మా ‘గులాబీ గోల’ ఉద్దేశం’ అన్నారు స్ఫూర్తి. గిరిధర్‌కు రన్నింగ్ అనేది వెన్నతో పెట్టిన విద్య. గత ఏడాది బెంగళూరు- చెన్నై (350 కిలోమీటర్లు) పరుగును ఆయన విజయవంతంగా పూర్తి చేశారు.
స్ఫూర్తికి మాత్రం ఇది రెండో సందర్భం. గతంలో ఆమె చాలా లావుగా ఉండేవారట. గిరిధర్ ప్రోత్సాహంతో రన్నింగ్ అలవాటుగా చేసుకున్నారు. దాంతో సన్నబడ్డారు. పరుగెత్తడం వల్ల కలిగే లాభాలను స్వయంగా తెలుసుకున్న స్ఫూర్తి, రన్నింగ్‌ను తన జీవన విధానంలో భాగం చేసుకున్నారు.
‘ఉదయం నాలుగు గంటలకే లేచి పరుగు మొదలుపెడతాం. రోజుకు 60 కిలోమీటర్లు పరుగెట్టాలనేది మా లక్ష్యం. అలా చేస్తే మార్చి 3కల్లా హైదరాబాద్ చేరుకుంటాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మమ్మల్ని అనుసరించి ఓ సపోర్ట్ వ్యాన్ వస్తూంటుంది. ప్ర తి రెండు కిలోమీటర్లకూ నీళ్లూ, పండ్లూ తీసుకుంటాం. డీ హైడ్రేషన్ రాకుండా ఈ జాగ్రత్త’ అన్నారు స్ఫూర్తి. *