యువ

స్వచ్ఛ మల్లి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు చేటలు, చీపుళ్లు పట్టిన నేతలు ఎంతోమంది! శుభ్రంగా ఉన్న రోడ్ల మీద చెత్త ఊడుస్తున్నట్టు నటించి ఫోటోలు తీయించుకున్న వారే వీరిలో ఎక్కువ మంది! కానీ, స్వచ్ఛ భారత్ పిలుపు వెనక అంతరార్థం గ్రహించి, పరిసరాల పరిశుభ్రతకు ఒంటరి పోరాటం చేస్తున్నాడో యువకుడు. తనకొచ్చే పాతిక వేల జీతంలో 75 శాతాన్ని తన ఆశయం కోసమే వెచ్చిస్తున్న మల్లికార్జున్‌ని చూస్తే, మన నాయకమ్మన్యులు తలలు వంచుకోవాల్సిందే! ఇంతకీ ఎవరీ మల్లికార్జున్?
ఆల్వాల్‌లో నివసించే తుడిమెళ్ల మల్లికార్జున్ ఓ చిరుద్యోగి. రోజంతా కష్టపడితేగానీ కుటుంబాన్ని పోషించుకోలేని సగటు మనిషి. అయితేనేం, స్వచ్ఛ భారత్ కోసం రోజుకు కొన్ని గంటలు కష్టపడుతున్నాడు. పదిమందికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. ‘నా ఇంటి చుట్టూ పరిసరాల్ని శుభ్రంగా ఉం చుకోవాలన్న తపనతో ముందడుగు వేశాను. ఆ లక్ష్యం పూర్తయ్యాక, చుట్టుపక్కల కాలనీలపై దృష్టి పెట్టాను. రోడ్లపై గతుకుల్ని పూడ్చడం, వీధుల్ని శుభ్రపరచడం మొదలుపెట్టాను.
నన్ను చూసి, నాతోపాటు మరికొందరు చేరారు. మేమంతా ఉదయం ఆరు గంటలకే సమావేశమవుతాం. ఆ రోజు చేయాల్సిన పనిని నిర్ణయించుకుంటాం. అక్కడికి వెళ్లి పని పూర్తి చేస్తాం. తర్వాత ఎవరి ఉద్యోగాలకు వారు వెళ్ళిపోతాం. గతంలో మేం పూడ్చిన గుంతల పరిస్థితిని కూడా వారానికోసారి చూసి వస్తాం. అవసరమైతే మళ్లీ పూడుస్తాం. ఇందుకయ్యే ఖర్చును మేమే భరిస్తున్నాం. కేవలం పరిశుభ్రతకే పరిమితం కాకుండా ఓ ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్ నిర్మించాం. పాఠశాల ఆటస్థలాన్ని బాగు చేశాం. సమీపంలోని ఓ మురికివాడకు కరెంటు సదుపాయం లేకపోతే సబ్సిడీపై కరెంటు మీటర్లు కొని అందరి గుడిసెల్లో అమర్చాం. అలాగే మంచినీటి సౌకర్యం లేకపోతే అధికారులకు విజ్ఞప్తి చేసి ట్యాంకర్లను సరఫరా చేయిస్తున్నాం’ అంటూ తమ దినచర్యను వివరించాడు మల్లికార్జున్. జిహెచ్‌ఎంసికి చెప్పి ఈ మధ్యే కొన్ని కాలనీల్లో డస్ట్‌బిన్లను ఏర్పాటు చేసింది మల్లికార్జున్ బృందం. మల్లికార్జున్‌తోపాటు అతని కుటుంబమూ ఈ స్వచ్ఛ భారత్‌లో రోజూ పాల్గొంటుందట. ఒకప్పుడు సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగేవాళ్లం. కానీ ఆ పనులన్నీ స్వయంగా చేస్తుంటే అందులో ఆనందమేమిటో తెలిసి వస్తోందంటున్న మల్లికార్జున్ చుట్టుపక్కల ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు. మొదట్లో అతనితోపాటు ఉన్నవారు తొమ్మిది మందే. కానీ, ఇప్పుడు అతన్ని చూసి, అనేకమంది అతనివెంట నడుస్తున్నారు.
*