యువ

పెట్రోల్ కార్‌ను తలదనే్న ‘కానె్సప్ట్ వన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రిక్ కార్లంటే అమ్మబాబోయ్ అనే వారే ఎక్కువమంది. చీటికీ మాటికీ చార్జింగ్ చేయడం ఓ తలనొప్పి. అంతేనా? స్పీడ్ విషయంలో రెండెడ్ల బండి కంటే కాస్త మెరుగు. ఇవే చాలామందిలో ఉన్న స్థిరాభిప్రాయాలు. అయితే వీటిని పటాపంచలు చేస్తూ క్రొయోషియాకి చెందిన రిమాక్ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ కార్‌ను మార్కెట్‌కి పరిచయం చేయబోతోంది. కానె్సప్ట్ వన్‌గా పిలుచుకుంటున్న ఈ కారుతోపాటు మరో ఏడు కార్లను రిమాక్ ప్లాన్ చేస్తోంది. గత ఐదేళ్లుగా తయారీలో ఉన్న కానె్సప్ట్ వన్‌ను ఈ నెలలో జరిగే జెనీవా మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచబోతోంది. హార్స్‌పవర్‌లోగానీ, స్పీడ్‌లోగానీ, డిజైన్‌లోగానీ పెట్రోల్, డీజిల్ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కానె్సప్ట్ కార్‌ను రూపొందించినట్టు రిమాక్ చెబుతోంది. గంటకు 220 మైళ్ల వేగంతో పరుగెత్తే కానె్సప్ట్ వన్, స్టార్ట్ చేసిన 2.6 నిమిషాల్లో గంటకు 62 మైళ్ల వేగాన్ని అందుకుంటుందట. ఇంతకీ దీని ధర ఎంతనుకుంటున్నారు? రిమాక్ ప్రతినిధులు ధర గురించి పెదవి విప్పకపోయినా, పది లక్షల డాలర్లకు పైమాటేనన్నది మార్కెట్లో వినిపిస్తున్న మాట. *