యువ

డ్రోన్ల సాయంతో షార్క్‌ల వేట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాస్’ సినిమా చాలామంది చూసే ఉంటారు. తీరంలో జలకాలాడేవారే లక్ష్యంగా ఓ షార్క్ వేట కొనసాగించడం, చివరకు హీరో దాని పనిపట్టడం ‘జాస్’ కథాం శం. ఆస్ట్రేలియా తీరవాసులకు కూడా ఇప్పుడు ఇలాంటి కష్టమే వచ్చిందట. కొన్ని షార్క్‌లు తీరానికి వచ్చి మనుషుల్ని నోట కరచుకుని పోతున్నాయట. దీంతో డ్రోన్లను రంగంలోకి దించేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వం నిర్ణయించిందట. రెండున్నర లక్షల ఆస్ట్రేలియా డాలర్లు వెచ్చించి ‘లిటిల్ రిప్పర్’ అనే డ్రోన్‌ను తయారు చేసింది. ఇది తీరం పొడవునా గస్తీ తిరుగుతూ లైవ్ ఫుటేజ్‌ని చేరవేస్తుందట. దీంతో షార్క్‌ల భరతం పట్టడం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.