క్రీడాభూమి

స్కాట్‌లాండ్‌పై జింబాబ్వే గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, మార్చి 10: టి-20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ గ్రూప్ ‘బి’ మొదటి రౌండ్‌లో స్కాట్‌లాండ్‌ను ఢీకొన్న జింబాబ్వే 11 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. సీన్ వియల్స్ 36 బంతుల్లో, ఆరు ఫోర్లతో 53 పరుగులు సాధించాడు. స్కాట్‌లాండ్ బౌలర్లలో అలిస్టర్ ఇవాన్స్, మార్క్ వాట్, సఫియాన్ షరీఫ్ తలా రెండేసి వికెట్లు కూల్చారు. అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్‌లాండ్ 19.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. రిచీ బారింగ్టన్ 36, పెస్టన్ మొమ్‌సెన్ 31, జొష్ డావీ 24 పరుగులతో రాణించారు. వీరిని మినహాయిస్తే, మిగతా వారెవరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకపోవడంతో స్కాట్‌లాండ్‌కు ఓటమి తప్పలేదు. జింబాబ్వే బౌలర్లలో వెల్లింగ్టన్ మసకజా 28 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చాడు. టెండై చతారా, డొనాల్డ్ టిరిపానో చెరి రెండు వికెట్లు పడగొట్టారు.