అంతర్జాతీయం

జికా భయంతో అబార్షన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్‌: జికా వైరస్‌ లాటిన్‌ అమెరికా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ అబార్షన్లు చేయించుకునే మహిళల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోందట. గతేడాది నవంబర్‌లో ఈ వైరస్‌ను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. జికా ప్రభావిత ప్రాంతాల మహిళలు కొన్నాళ్ల పాటు గర్భం దాల్చకుండా ఉంటే మంచిదని ఇప్పటికే లాటిన్‌ అమెరికాలోని చాలా దేశాల ప్రభుత్వాలు సూచించాయి. దీంతో గర్భిణీలు అబార్షన్లల వైపు మొగ్గుచూపుతున్నారు. బ్రెజిల్‌, ఈక్వెడార్‌ దేశాల్లో గర్భస్రావం చేసుకునే మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో రెట్టింపు అయిందని అధికారులు తెలిపారు. మిగతా దేశాల్లోనూ అబార్షన్లు చేసుకునే మహిళల సంఖ్య మూడొంతులకు పెరిగింది.