S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/25/2018 - 02:48

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ల ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజావ్యాజ్య పిటీషన్‌ను హైకోర్టు స్వీకరించింది.

09/25/2018 - 00:55

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: మూక, గోరక్షణ పేరుతో దాడుల విషయంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడే వారు చట్టప్రకారం శిక్షార్హులు అవుతారన్న విషయం మరువరాదని హెచ్చరించింది.

09/25/2018 - 00:42

ప్రేమ విఫలంకావడంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పీఎన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లవ్‌కేశ్ కుమార్‌కోల్ (21) పక్షం రోజుల క్రితం వరుసకు సోదరుడైన బేతు రావత్‌కోల్ వద్దకు జీవనోపాధి నిమత్తం వలసవచ్చాడు.

09/25/2018 - 00:38

గణేష్ నిమజ్జానికి వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...మహరాజ్ గంజ్ ధూల్‌పేట్ ప్రాంతానికి చెందిన అయిందల అనంతి కుమారుడు అయిందల వేణు(20) చిక్కడపల్లిలో ఓ కాలేజ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఘోడే కి కబర్ గోషామహల్‌కు చెందిన నింభవత్ నౌరంగల్ కుమారుడు నింభవత్ సురేష్ (50) బాస్మతి రైస్ క్లీనింగ్ చేస్తుంటాడు.

09/25/2018 - 00:28

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై దాఖలైన పిటిషన్‌పై అక్టోబర్ 1న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలను సవాల్ చేస్తూ సిద్దిపేటకు చెందిన పోతుగంటి శశాంక్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాదులు ప్రత్యేకంగా మెన్షన్ చేశారు.

09/25/2018 - 00:27

దాచేపల్లి, సెప్టెంబర్ 24: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే జంక్షన్ సమీపంలోని పులిపాడు గేట్ వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను లోక్‌మాన్య ఎక్స్‌ప్రెస్ సోమవారం ఢీకొంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన ఆటోడ్రైవర్ ఆటో పట్టాల మీద వదలి పరారయ్యాడు. ఈ ఘటనతో అరగంటపాటు రైలు పట్టాలపై నిలిచిపోయింది.

09/25/2018 - 00:22

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: ట్రైన్‌లో బంగారం రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి దాదాపు రూ.62.35 లక్షల విలువైన రెండు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆదివారం వెలుగుచూసింది.

09/24/2018 - 23:41

కోడూరు, సెప్టెంబర్ 24: హంసలదీవి, పాలకాయతిప్ప బీచ్‌లో విహార యాత్రకు వచ్చి సముద్రంలో కొట్టుకుపోయిన విజయవాడ పంజా సెంటరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి జైజుల్లా మృతదేహం సోమవారం మ ధ్యాహ్నం లభ్యమైంది. కోడూరు ఎస్ ఐ ప్రియకుమార్ పంచనామ నిర్వహి ంచి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

09/24/2018 - 23:36

సోమవారం కలెక్టర్ సమక్షంలో జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో నగర పరిధిలోని నిజాంపేటకు చెందిన నిరుద్యోగి జూగటి సాంబయ్య తన వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసాడు. 2012లో కోర్టులో తాను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ తనకు కాకుండ ఇతరులకు అటెండర్ ఉద్యోగం కేటాయించారని, అనేక దఫాలు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు.

09/24/2018 - 23:30

కారంపూడి, సెప్టెంబర్ 24 : స్నేహితుడిని కాపాడటానికి వెళ్లి నాగార్జునసాగర్ కుడికాలువలో ఆదివారం గల్లంతైన కారంపూడి పోలీస్ కానిస్టేబుల్ పత్తిపాటి ఆనంద్‌కుమార్ (30) మృతదేహం సోమవారం సాయంత్రం లభ్యమైంది. గత 32 గంటల నుండి కారంపూడి సాగర్ కాలువ వద్ద నుండి ఎన్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది, గజ ఈత గాళ్లు బృందాలుగా విడిపోయి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Pages