S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/12/2018 - 02:56

లింగాలఘణపురం, నవంబర్ 11: ఫోన్ చార్జింగ్ పెట్టి పాటలు వింటున్న క్రమంలో షార్ట్‌సర్క్యూటై ఒకరు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం చిరిపురం గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బస్వగాని అనిల్ (30) బతుకు దెరువు కోసం ఉప్పల్ సమీపంలోని అనోజిగూడలో జీవనం సాగిస్తున్నాడు.

11/12/2018 - 02:10

మేడ్చల్, నవంబర్ 11: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ గంగాధర్ కథనం ప్రకారం... సిద్ధిపేట్ జిల్లా ములుగు మండల బండమైలారం గ్రామానికి చెందిన తీగుల్ల నాగభూషణం గౌడ్ కుమారులు తీగుల్ల బాలశెట్టి గౌడ్(43), తీగుల్ల శ్రీనివాస్ గౌడ్(40)లు పాలవ్యాపారం చేస్తుంటారు.

11/12/2018 - 01:55

ఇటిక్యాల, నవంబర్ 11: దైవదర్శనానికి వెళ్ళి కారులో వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు మృతి చెందిన ఘటన ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల పరిధిలో చోటు చేసుకుంది. కోదండాపురం ఎస్సై వస్తన్రాయక్, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

11/12/2018 - 01:50

జి.కొండూరు, నవంబర్ 11: వెలగలేరులో భారీ వాహనం ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పూసల బాలకోటేశ్వరరావు (28) మృతి చెందాడు. వెలగలేరులో రోడ్డు పక్కన నిల్చుని ఉన్న బాలకోటేశ్వరరావును మలుపు వద్ద టిప్పరు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు యువకుడిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరిన కొద్ది నిముషాలకే అతను మృతి చెందాడు.

11/12/2018 - 01:31

లబ్బీపేట, నవంబర్ : నగరంలో గుట్టు చప్పడు కాకుండా మత్తు ఇంజక్షన్ల విక్రయాలకు సంబంధించిన ముఠాను ఆదివారం టాస్క్‌పోర్సు ఏసీపీ రాజీవ్ పర్యవేక్షణలో అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం సూర్యారావుపేట పోలీసులకు అప్పగించారు.

11/12/2018 - 01:27

ముసునూరు, నవంబర్ 11: మండలంలోని కాట్రేనిపాడులో అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాట్రేనిపాడు గ్రామ శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన ఎం శివరామకృష్ణ (32)తో నాగమల్లేశ్వరి(25)తో 3 నెలల క్రితం వివాహం జరిగింది.

11/12/2018 - 01:26

బెంగళూరు, నవంబర్ 11: మాజీ మంత్రి, ఓబుళాపురం గనుల యజమాని గాలి జనార్దన్ రెడ్డిని కోట్లాది రూపాయల9 పోంజీ స్కాం కేసులో బెంగళూరు పోలీసులు ఆదివారం అరెస్టు చేవారు. ఈ కేసులో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి గాలి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు, అనంతరం శనివారం గాలి జనార్దన్ రెడ్డి సెంట్రల్ క్రైమ్ బ్రాంచికి వచ్చి లొంగిపోయారు. ఆదివారం ఉదయం వరకు గాలి జనార్దన్ రెడ్డిని పోలీసులు విచారించారు.

11/12/2018 - 01:15

నరసరావుపేట, నవంబర్ 11: ఇటీవల పట్టణ శివారులోని బ్యాంక్ కాలనీ శ్రీరామ్ హైట్స్‌లో, వెంకట సాయి టవర్స్‌లో గత నెల 8న జరిగిన దొంగతనం కేసులో డేంజరస్ చడ్డీగ్యాంగ్‌లోని ముద్దాయిని ఆదివారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

11/12/2018 - 01:01

రాజమహేంద్రవరం, నవంబర్ 11: అన్ని సెల్‌ఫోన్లకు రీచార్జి చేసేందుకు ప్రత్యేక వి పేటిఎం పేరిట యాప్ ఏర్పాటుచేసి ఉభయ రాష్ట్రాల్లో సుమారు రూ. 2 కోట్లకు టోకరా వేసిన వ్యక్తులను పోలీసులు గుర్తించారు. అన్ని సంస్థల సెల్‌ఫోన్లకు తమ వి పేటిఎం ద్వారా రీచార్జి చేస్తామని ఉభయ రాష్ట్రాల్లో పంపిణీదారులు, ఏజెంట్లను నియమించి, వారి నుంచి రూ. లక్షల్లో వసూలు చేశారు.

11/12/2018 - 00:36

ఏర్పేడు, నవంబర్ 11: అనుమానాస్పదంగా ఓ కుటుంబం అగ్నికి ఆహుతి అయిన సంఘటన ఏర్పేడు మండలం, మడిబాక పంచాయతీ పరిధిలోని రాజులకండ్రిగ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసులరెడ్డి (38) జిల్లాలోని పుంగనూరు ప్రాంతానికి చెందిన వాడు.

Pages