S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/26/2020 - 03:58

నల్లగొండ లీగల్, ఫిబ్రవరి 25: కనగల్ మండలంలో 2017 ఆగస్టు 21న చోటుచేసుకున్న జంట హత్యల కేసులో నిందితులు ఏడుగురికి జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎం.వి.రమేష్ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు. కురంపల్లి గ్రామం శివరులోని 937, 938 సర్వేనెంబర్‌లలోని 11 ఎకరాల్లో దాసరి యాదయ్య సాగు చేసుకుంటు, పక్కనే ఉన్న దోటి మణెమ్మకు చెందిన 2.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

02/26/2020 - 03:56

హవేళి ఘణపూర్, ఫిబ్రవరి 25: తన అక్రమ సంబంధం బయటపడటం.. ఆ విషయంలో తనను భర్త నిలదీస్తున్నాడన్న కోపంతో భార్య అతడి గొంతు నులిమి చంపిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది.

02/26/2020 - 03:50

రాయపర్తి, ఫిబ్రవరి 25: పోలీస్ వాహనం ఇన్నోవా ఢీకొని బైక్‌పై వెళ్తున్న దంపతులు మృతిచెందగా, వారి కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని తిరుమలయపల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

02/26/2020 - 02:20

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 25: ఒకరి మృతికి కారకుడైన టిప్పర్ డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, 2వేల రూపాయల జరిమానా విధిస్తూ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం..

02/26/2020 - 02:20

తిరువూరు, ఫిబ్రవరి 25: తిరువూరు, విస్సన్నపేట కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకుల్ని ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కల్లూరు ఏసీపీ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం తిరువూరు, విస్సన్నపేట కేంద్రాలుగా ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని సీలేరు నుంచి గంజాయిని ద్విచక్రవాహనంపై తెచ్చి విక్రయిస్తున్నారు.

02/26/2020 - 02:09

బాలాపూర్, ఫిబ్రవరి 25: కొత్తపేట్‌లో కల్తీ వైన్ తయారు కేంద్రంపై ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు దాడి చేశారు. కల్తీ వైన్‌తో పాటు నిర్వాహకుడిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ అధికారుల వివరాల ప్రకారం.. కొత్తపేట్ సరస్వతి నగర్ కాలనీలోని ఇంటిలో మహేశ్వరం శివప్రసాద్ అనే వ్యక్తి కల్తీ వైన్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాడు.

02/26/2020 - 02:08

షాద్‌నగర్, ఫిబ్రవరి 25: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ పోలీసులు పట్టుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ టోల్‌ప్లాజా వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం జడ్చర్ల వైపు నుండి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్సును హైదరాబాద్ జోనల్ యూనిట్ స్పెషల్ అధికారులు (డీఆర్‌ఐ) తనిఖీలు నిర్వహించి 3099గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు.

02/26/2020 - 02:02

నార్సింగి, ఫిబ్రవరి 25: దాడికి పాల్పడిన వ్యక్తులను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 18న సాయంత్రం కోల్లూరి ఆనంద్, రాజ్‌కుమర్‌పై బీర్ బాటిళ్లు, కట్టెలు, గోడ్డళ్లతో దాడి చేసి గాయపరిచారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

02/26/2020 - 01:45

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఇళ్లలో ఎవరూ లేని సమయాన్ని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ముఠా, దుర్గామాత విగ్రహంతో పాటు కోటి రూపాయలు విలువ చేసే నాగమణి రాయిని విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సీపీ వెల్లడించారు.

02/25/2020 - 23:22

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసులోని ముద్దాయిలకు ఉరిశిక్షను అమలు చేయడంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి అయిదో తేదీన విచారించనున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది.

Pages