S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/24/2019 - 00:10

హైదరాబాద్, ఆగస్టు 23: అసెంబ్లీ తరహాలో హైకోర్టును బుద్వేల్ గానీ మరో ఇతర ప్రదేశానికి తరలించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు హైకోర్టు పరిరక్షణ కమిటీ నేతలు శుక్రవారం నాడు పేర్కొన్నారు. తరలింపు ప్రతిపాదన చేస్తే న్యాయవాదుల నుండి తీవ్రంగా ప్రతిఘటనను ఎదుర్కోవల్సి వస్తుందని వారు హెచ్చరించారు. దీనికి హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన పరిపాలనా కమిటీ ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించరాదని కోరారు.

08/24/2019 - 00:09

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 23: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రాత్రి కొంతమంది మందు సేవించి విందు చేసుకున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం బాటిళ్లు, గ్లాసులు, విస్తరాకులు పడి ఉండటంతో కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒన్‌టౌన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.సదానాగరాజు శుక్రవారం పాఠశాలను సందర్శించారు. వివరాలు సేకరించారు.

08/24/2019 - 00:09

పిట్లం, ఆగస్టు 23: మధ్యాహ్న భోజనం వికటించి 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని చిన్నకొడప్‌గల్ జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో, శుక్రవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. వారిని వెంటనే ఉపాధ్యాయులు పిట్లం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

08/24/2019 - 00:08

మెదక్ రూరల్, ఆగస్టు 23: గత వారం గిరిజన మహిళను హత్యచేసిన నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు. భర్త కోరిక మేరకు మరో ఇద్దరు ఆమెకు మద్యం తాగించి, అత్యాచారంచేసి హతమార్చారు. శుక్రవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్‌పీ కృష్ణమూర్తి వివరాలు వెల్లడించారు. ఔరంగాబాద్ తండాకు చెందిన కెతావత్ విజయను ఈ నెల 17న రాత్రి అత్యాచారం జరిపి హత్యచేసిన విషయం తెలిసిందే.

08/24/2019 - 00:03

శేరిలింగంపల్లి, ఆగస్టు 23: యువతుల నగ్న వీడియోలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పైశాచికానందం పొందాడు. రిసెప్షనిస్టు ఉద్యోగం పేరుతో దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 600 మంది మహిళల నగ్న వీడియోలు రికార్డు చేసుకున్నాడు. రాడిసన్ హోటల్‌లో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పరిచయం చేసుకుని వాట్సాప్‌లో నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించి వాటి ద్వారా ఆనందం పొందేవాడు. ఓ మహిళ ఫిర్యాదుతో అతని బండారం బయటపడి కటకటాల పాలయ్యాడు.

08/24/2019 - 00:03

హైదరాబాద్, ఆగస్టు 23: దేశంలోవ్యక్తులు, సంస్థల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన డేటా పరిరక్షణకు కేంద్రం త్వరలో పార్లమెంటులోబిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లు ముసాయిదా ప్రతులను పరిశీలన నిమిత్తం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రహోంశాఖ, ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ మంత్రిత్వశాఖ పంపాయి. ఈ బిల్లును రిటైర్డు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ కృష్ణ ఆధ్వర్యంలోని కమిటీ రూపొందించింది.

08/24/2019 - 00:01

హైదరాబాద్, ఆగస్టు 23: పెట్రోలు బంకుల్లోజరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. పెట్రోలు, డీజిల్‌ను నిర్దేశిత కొలతల మేరకు కాకుండా తక్కువగా పోస్తున్నారని, కల్తీ చేస్తూ అమ్ముతూ బంకు యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నట్లు ఆ శాఖ పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2553 పెట్రోలు బంకులకు గాను ఈ నెల 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 638 బంకుల్లో తనిఖీలు నిర్వహించారు.

08/23/2019 - 23:58

హైదరాబాద్, ఆగస్టు 23: సామాజిక మాధ్యమాల వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా జనసేనపై జరుగుతున్న దుష్ప్రచారానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు.

08/23/2019 - 23:34

షిమ్లా, ఆగస్టు 23: హిమాచల్ ప్రదేశ్, షిమ్లా జిల్లాలో ఓ మిలటరీ ట్రక్కు ప్రమాదవశాత్తున ఎతె్తైన పర్వత ప్రాంతం నుంచి లోయలో పడడంతో ఓ జవాను మృతి చెందగా, మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. భారత ఆర్మీ మహర్ రెజిమెంట్‌కు చెందిన సైనికులు ట్రక్కులో హర్యానాలోని అంబాల నుంచి షిమ్లాకు బయలుదేరారు.

08/23/2019 - 23:33

జకార్తా, ఆగస్టు 23: పడవలో మంటలు చెలరేగడంతో పెను ప్రమాదం సంభవించింది. ఇందులో ప్రయాణిస్తున్న 277 మందిలో 22 మంది ప్రయాణికుల జాడ కనిపించడం లేదు. ఇండోనేషియాలో రెండవ అతి పెద్ద నగరమైన సురబాయ నుంచి బాలిక్‌పాపన్‌కు (బొర్నియో ద్వీపం) 277 మంది ప్రయాణికులతో పడవ బయలుదేరింది. అయితే మార్గమధ్యలో మంటలు చెలరేగడంతో గందరగోళం చెలరేగి ప్రయాణికులు అటు-ఇటు పరుగులు తీశారు.

Pages